బాల్యం, కౌమురం, యువ్వనం, వృధాప్యం లలో ఆఖరిది అంటేనే చాలా మందికి టెన్షన్ అని అంటుంటారు. కొంతమంది ఆ దశ వస్తే అందం తగ్గిపోతుందని ఆందోళన చెందుతారని అంటుంటారు. మరికొంతమంది ఆ దశలో వచ్చే ఆరోగ్య సమస్యలపై ఆందోళన చెందుతారని చెబుతుంటారు. ఈ సమయంలో యూఎస్ శాస్త్రవేత్తలు ఒక కొత్త రసాయనాన్ని కనుగొన్నారని తెలుస్తుంది.
అవును... ఒక సంచలనాత్మక అధ్యయనంలో అమెరికా పరిశోధకులు వృద్ధాప్యం, వయస్సు సంబంధిత వ్యాధులపై పోరాటంలో కొత్త విషయాన్ని కనుగొన్నారన్ని తెలుసుంది. ఇందులో భాగంగా... హార్వర్డ్ మెడికల్ స్కూల్, మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తల బృందం ఒక అధ్యయనం చేపట్టారని అంటున్నారు. ఇందులో భాగంగా యౌవ్వన దశలో కణాలను పునరుత్పత్తి చేసే రసాయనాన్ని కనుగొన్నారని అంటున్నారు.
గతంలో ఈ ప్రక్రియను శక్తివంతమైన జన్యు చికిత్సను ఉపయోగించి మాత్రమే చేసేవారు. 2012 లో నోబెల్ బహుమతిని గెలుచుకున్న ఈ ఆవిష్కరణ, కణాలు చాలా చిన్నవిగా అవ్వకుండా.. క్యాన్సర్ గా మారకుండా.. సెల్యులార్ వృద్ధాప్యాన్ని తిప్పికొట్టడం సాధ్యమేనా అనే ప్రశ్నను లేవనెత్తిందని చెబుతున్నారు.
అయితే ఈ కొత్త అధ్యయనంలో పరిశోధకులు... సెల్యులార్ వృద్ధాప్యాన్ని రివర్స్ చేయగల, మానవ కణాలను పునరుజ్జీవింపజేయగల అణువుల కోసం పరీక్షించారని తెలుస్తుంది. ఇందులో భాగంగా... ట్రాన్స్ క్రిప్షన్ ఆధారిత వృద్ధాప్య కాలాన్ని, రియల్ టైమ్ న్యూక్లియోసైటోప్లాస్మిక్ ప్రోటీన్ కంపార్ట్‌మెంటలైజేషన్ పరీక్షతో పాత వృద్ధాప్య కణాల నుండి యువ కణాలను వేరు చేయడానికి పరీక్షలను అభివృద్ధి చేశారని అంటున్నారు.
ఈ ఆవిష్కరణలో భాగంగా పరిశోధకుల బృందం.. ఆరు కెమికల్ కాక్ టెయిల్ లను గుర్తించిందని అంటున్నారు. ఇవి వృద్ధాప్యానికి సహకరించే కణాలను తిరిగి యవ్వన స్థితికి తేవడంతోపాటు.. రివర్స్ ట్రాన్స్ క్రిప్టోమిక్ వయస్సును ఒక వారం కంటే తక్కువ వ్యవధిలో పునరుద్ధరించాయని అంటున్నారట.
ఈ విషయాలపై స్పందించిన హార్వర్డ్ లోని జెనెటిక్స్ విభాగంలో ప్రొఫెసర్, ప్రధాన శాస్త్రవేత్త డేవిడ్ ఎ.సింక్లైర్... “ఇటీవలి వరకు మనం చేయగలిగింది నెమ్మదిగా వృద్ధాప్యం రావడం మాత్రమే.. అయితే ఈ కొత్త ఆవిష్కరణల ఫలితంగా ఇప్పుడు ఏకంగా వృధ్యాప్యాన్ని తిప్పికొట్టవచ్చని సూచిస్తున్నాయి" అని అన్నారని తెలుస్తుంది.
కంటి నాడి, మెదడు కణజాలం, మూత్రపిండాలు, కండరాలపై చేసిన అధ్యయనాలు మెరుగైన దృష్టితో.. ఎలుకలలో సుదీర్ఘ జీవితకాలం, కోతులలో మెరుగైన దృష్టి నివేదికతో మంచి ఫలితాలను చూపించాయని శాస్త్రవేత్తలు అంటున్నారని తెలుస్తుంది.
ఈ క్రమంలో జన్యు చికిత్స ద్వారా వయస్సు రివర్సల్ కు రసాయన ప్రత్యామ్నాయాన్ని అభివృద్ధి చేయడం ద్వారా... ఈ పరిశోధన వృద్ధాప్యం, గాయాలు, వయస్సు సంబంధిత వ్యాధుల చికిత్సలో విప్లవాత్మక మార్పులు చేయగలదని అంటున్నారు. ఇదే సమయంలో తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో ఇది సాధ్యమవుతుందని చెబుతున్నారు.
అయితే ఏప్రిల్ 2023లో కోతులలో అంధత్వాన్ని తిప్పికొట్టడంలో సానుకూల ఫలితాలు వచ్చాయని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ కోసం సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం.
ఆ ట్రయల్స్ కూడా సక్సెస్ ఫుల్ గా జరిగితే... ఈ కొత్త ఆవిష్కరణ ఒకే టాబ్లెట్ తో వృద్ధాప్యాన్ని తిప్పికొట్టే సామర్థ్యాన్ని అందిస్తుందని అంటున్నారంట శాస్త్రవేత్తలు. ఇదే సమయంలో కంటి చూపును మెరుగుపరచడం నుండి అనేక వయస్సు సంబంధిత వ్యాధులకు సమర్థవంతంగా చికిత్స చేయడం సులువవుతుందని చెబుతున్నారంట.