వలసదారులకు అమెరికా షాక్.. ఆశలు వదులుకోవాల్సిందేనా?
సాధారణంగా ఇక్కడితో పోల్చుకుంటే విదేశాలలో ఉద్యోగం చేస్తే డబ్బులు అధికంగా వస్తాయని.. చాలామంది ఇక్కడి నుండి తమకు నచ్చిన దేశానికి వెళ్తూ అక్కడే ఆదాయాన్ని పెంపొందించుకునే ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే.
By: Madhu Reddy | 5 Dec 2025 9:00 PM ISTసాధారణంగా ఇక్కడితో పోల్చుకుంటే విదేశాలలో ఉద్యోగం చేస్తే డబ్బులు అధికంగా వస్తాయని.. చాలామంది ఇక్కడి నుండి తమకు నచ్చిన దేశానికి వెళ్తూ అక్కడే ఆదాయాన్ని పెంపొందించుకునే ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా మిగతా దేశాలతో పోల్చుకుంటే.. చాలామంది అమెరికాకు ఉద్యోగ ప్రయత్నం కోసం వెళ్తే.. మరి కొంతమంది ఉన్నత చదువుల కోసం అమెరికానే ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. ఇంకొంతమంది జీతాలను రెట్టింపు చేసుకోవడానికి అమెరికా బాట పడుతున్న విషయం తెలిసిందే. అయితే అలాంటి వారందరికీ భారీ షాక్ కలిగేలా కీలక నిర్ణయం తీసుకుంది అమెరికా ప్రభుత్వం.
వర్క్ పర్మిట్ తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం వలసదారులకు పూర్తిస్థాయి ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని చెప్పవచ్చు. విషయంలోకి వెళ్తే..ఇప్పటికే వలసదారులపై కఠిన విధానాలు అమలు చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకుంది. శరణార్థులకు ఇచ్చే వర్క్ పర్మిట్ వ్యవధిని తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ముఖ్యంగా అమెరికాలో ఆశ్రయం పొందాలనుకునేవారు.. గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న వారు.. అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునేవారు.. ఇలా ప్రతి ఒక్కరూ ఎంప్లాయిమెంట్ ఆర్థరైజేషన్ కార్డు (EAD) పొందాల్సిందే. అయితే ఒకప్పుడు దీనికి ఐదు సంవత్సరాల కాలం వ్యవధి ఉండేది. కానీ తాజా సవరణలతో దానిని 18 నెలలకు కుదించారు.
భద్రతా కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూ.ఎస్.సీ.ఐ.ఎస్ తెలిపింది. భద్రతా కారణాలకు.. కాలవ్యవధిని తగ్గించడానికి గల కారణం ఏమిటి ? అనే విషయాన్నికొస్తే ఇటీవల అధ్యక్ష భవనానికి సమీపంలో ఇద్దరు నేషనల్ గార్డులపై ఒక దుండగుడు కాల్పులు జరిపిన విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే దేశంలోకి వలస వచ్చే వారికి కఠిన ఆంక్షలు తప్పనిసరి అని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోందట. ఈ నేపథ్యంలోనే వలసదారుల కాలవ్యవధిపై ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఇకపోతే అమెరికాలో ఉద్యోగం చేయాలి అంటే వలసదారులకు ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ అనేది తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. ఇది నిర్దిష్ట కాలవ్యవధిని, ఆ వ్యక్తికి అమెరికాలో పనిచేసేందుకు అధికారం ఉందని నిరూపించే పత్రం ఇది. ఇది ఉంటేనే ఆ వలసదారులు అమెరికాలో ఉద్యోగం చేసుకోవడానికి అనుమతులు లభిస్తాయి. ముఖ్యంగా గ్రీన్ కార్డు పెండింగ్లో ఉన్నవారు, వారి జీవిత భాగస్వాములు, పిల్లలు, ఎఫ్ - 1, ఎం - 1 వీసాల పై వచ్చే విద్యార్థులతో పాటు డిపెండెంట్ వీసాలపై వచ్చేవారు కూడా ఇక్కడ ఉద్యోగం చేయాలి అంటే ఈ పత్రాలు తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. ఏది ఏమైనా ఐదు సంవత్సరాల కాల పరిమితిని తగ్గిస్తూ ట్రంపు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వలసదారులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై మరో నిర్ణయం ఉంటుందా అని అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
