Begin typing your search above and press return to search.

ఒక్కడ్ని సేవ్ చేశారు.. అమెరికా చరిత్రలో అదిరే ఆపరేషన్

అమెరికా కాకుండా మరే దేశానికి చెందిన పైలట్ అయితే మాత్రం.. అతడి కోసం మరికొందరు బలికాకూడదని.. విలువైన యుద్ధ విమానాలు నష్టపోకూడదన్న పిచ్చి వాదనను వినిపిస్తారు. కానీ.. అమెరికా మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించిందని చెప్పాలి.

By:  Garuda Media   |   6 April 2026 1:33 AM IST
ఒక్కడ్ని సేవ్ చేశారు.. అమెరికా చరిత్రలో అదిరే ఆపరేషన్
X

మిగిలిన దేశాలకు అమెరికాకు ఉన్న తేడా అదే. ఒక ఫైటర్ జెట్ ఇరాన్ గడ్డ మీద కూలటం.. అందులోని ఇద్దరు పైలట్లు ఎగ్జిట్ కావటం.. అందులో ఒకరిని అప్పటికప్పుడు సేవ్ చేయటం ఒక ఎత్తు అయితే.. ఇరాన్ లో చిక్కుకున్న మరో పైలట్ న సేవ్ చేయటం కోసం అమెరికా భారీ ఆపరేషన్ ను నిర్వహించిన తీరు చూసినప్పుడు శత్రువు సైతం అమెరికాను పొగడకుండా ఉండలేరు. ఒక పైలట్ ప్రాణం కోసం అమెరికా చేసిన సాహసం చూసినప్పుడు.. అగ్రరాజ్యానికి మిగిలిన దేశాలకు మధ్య వ్యత్యాసం ఇట్టే అర్థమవుతుంది. అమెరికా కాకుండా మరే దేశానికి చెందిన పైలట్ అయితే మాత్రం.. అతడి కోసం మరికొందరు బలికాకూడదని.. విలువైన యుద్ధ విమానాలు నష్టపోకూడదన్న పిచ్చి వాదనను వినిపిస్తారు. కానీ.. అమెరికా మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించిందని చెప్పాలి.

తమ పైటల్ ను సేవ్ చేసిన విషయాన్ని ఆదివారం ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అంతర్జాతీయ మీడియా సైతం ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేయటం గమనార్హం. ఇంతకూ ఇరాన్ లో చిక్కుకుపోయిన పైలట్ ను ఎలా రెస్క్యూ చేశారు? ఇందుకోసం చేపట్టిన భారీ ఆపరేషన్ గురించి తెలిసినప్పుడు మాత్రం గూస్ బంప్స్ రావటం ఖాయం. అయితే.. యుద్ధ విమానం నుంచి ప్రాణాలతో బయటపడిన పైలట్ నడిచే స్థితిలో ఉండటం లాభించిందని చెబుతున్నారు. అదే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరాన్ లో చిక్కుకున్న పైలట్ ను వెనక్కి తీసుకురావాలని.. అందుకోసం ఎంత పెద్ద ఆపరేషన్ అయినా నిర్వహించాలన్న పట్టుదల కూడా అతడ్ని సేవ్ చేయటం సాధ్యమైందని చెప్పాలి.

ఓవైపు ఇరాన్ లో చిక్కుకున్న అమెరికా పైలట్ కోసం ఇరాన్ గిరిజన తెగలు.. ఐఆర్ జీసీ దళాలు.. బసీజ్ ఫోర్స్ రంగంలోకి దిగి తీవ్రస్థాయిలో గాలింపు చేపట్టగా.. అమెరికా కూడా అంతకు మించి అన్నట్లుగా వ్యవహరించింది. పైలట్ నుంచి రక్షించి భూమార్గాన అతడ్ని కాన్వాయ్ లో సరిహద్దలు దాటిస్తున్నట్లు ప్రచారం చేసినట్లుగా చెబుతున్నారు. వాస్తవానికి సీఐఏనే పైలట్ ఆచూకీని గుర్తించి పెంటగాన్ కు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ సమయంలోనే ఇరాన్ దళాలు సైతం అమెరికా పైలట్ సమీపంలోకి వెళుతున్న పరిస్థితి.

ఇలాంటి వేళ.. ఎత్తైన పర్వతాల్లో ఇరానీ దళాల కంటపడకుండా 7వేల అడుగుల ఎత్తైన కొండకు ఒక రాయి వద్ద దాక్కొన్నట్లుగా అమెరికా మీడియా చెబుతోంది. అతడి వద్ద ఉన్న ఒక సంకేతాల పరికరంతోపాటు.. మరో సెక్యూర్డ్ కమ్యూనికేషన్ పరికరం మాత్రమే ఉండగా.. బేకన్ పరికరాన్ని ఎట్టి పరిస్థితుల్లో వాడొద్దని అమెరికా మిలిటరీ సూచన చేసింది

తమ పైలట్ ను సేవ్ చేసుకోవటానికి వందల సంఖ్యలో అమెరికా స్పెషల్ ఫోర్స్ ను.. డజన్ల కొద్దీ సంఖ్యలో ఫైటర్జెట్లు.. హెలికాఫ్టర్లను ఇరాన్ మీదకు పంపినట్లుగా చెబుతున్నారు. ఒకదశలో ఆ పైలట్ కు దగ్గరగా ఇరాన్ దళాలు చేరుకున్న వేళ.. అమెరికా యుద్ధ విమానాలు బాంబిగ్ చేసి వాటిని దూరంగా ఉంచినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో ఆరుగురు సభ్యుల నేవీ సీల్ టీం ఇరాన్ భూభాగం మీద దిగి.. సదరు పైలట్ ను సేవ్ చేసినట్లుగా తెలుస్తోంది. సేవ్ చేసిన పైలట్ ను చికిత్స కోసం కువైట్ కు పంపినట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఇరాన్ ఆర్మీ వాదన మాత్రం వేరేలా ఉంది.ఈ రెస్క్యూ ఆపరేషన్కు వచ్చిన సి-130 విమానం.. రెండు బ్లాక్ హాక్ హెలికాఫ్టర్లను పేల్చినట్లుగా ప్రకటించింది. ట్రంప్ సైతం తమ పైటల్ ను వెనక్కి తీసుకొచ్చినట్లుగా ప్రకటించారు.