Begin typing your search above and press return to search.

అమెరికా డ్రోన్ తుస్సుమంది.. ఇరాక్‌లో కలకలం!

సుమారు 50 కిలోల పేలుడు పదార్థాలతో నిండి ఉన్న ఈ డ్రోన్ ఎప్పుడు పేలుతుందో తెలియక ఆ ప్రాంతమంతా టెన్షన్ నెలకొంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ డ్రోన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

By:  Madhu Reddy   |   3 March 2026 5:39 PM IST
అమెరికా డ్రోన్ తుస్సుమంది.. ఇరాక్‌లో కలకలం!
X

అమెరికా గర్వంగా చెప్పుకునే అత్యంత శక్తిమంతమైన ‘LUCAS’ డ్రోన్ తాజాగా ఇరాక్ గడ్డపై కుప్పకూలిపోయింది. ఇరాన్‌పై దాడుల కోసం ప్రయోగిస్తున్న ఈ 'కామికేజ్' డ్రోన్ సాంకేతిక లోపంతో కూలిపోవడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. సుమారు 50 కిలోల పేలుడు పదార్థాలతో నిండి ఉన్న ఈ డ్రోన్ ఎప్పుడు పేలుతుందో తెలియక ఆ ప్రాంతమంతా టెన్షన్ నెలకొంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ డ్రోన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

అమెరికా డ్రోన్ తుస్సుమంది.. ఇరాక్‌లో కలకలం:

అత్యాధునిక యుద్ధ తంత్రానికి మారుపేరైన అమెరికాకు ఎదురుదెబ్బ తగిలింది. ఇరాన్‌ లక్ష్యంగా అమెరికా ప్రయోగిస్తున్న శక్తిమంతమైన ‘LUCAS’ డ్రోన్ తాజాగా ఇరాక్‌లోని ఒక మారుమూల ప్రాంతంలో కుప్పకూలింది. గాలిలో ఉండగానే సాంకేతిక లోపం తలెత్తడంతో ఇది ఒక్కసారిగా నేలకొరిగింది. ఈ దృశ్యాలను చూసిన స్థానికులు మొదట ఆశ్చర్యపోయినా, ఆ తర్వాత అది ఏకంగా బాంబుల పొట్లం అని తెలిసి హడలిపోతున్నారు. అత్యంత వేగంగా ప్రయాణించి.. శత్రువుల మీద విరుచుకుపడాల్సిన ఈ డ్రోన్, మధ్యలోనే ఇలా ఫెయిల్ అవ్వడం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది.

50 కిలోల పేలుడు పదార్థాలు.. ప్రాణాలకు ముప్పు:

ఈ ‘LUCAS’ డ్రోన్ సాధారణమైంది కాదు. ఇది ఇరాన్ కు చెందిన ప్రసిద్ధ 'షాహెద్' డ్రోన్ల నమూనాతో తయారు చేయబడింది. దీని ప్రత్యేకత ఏమిటంటే, ఇది దాదాపు 50 కిలోల భారీ పేలుడు పదార్థాలను తనలో నింపుకుని వెళ్లగలదు. శత్రువుల స్థావరాలను తాకినప్పుడు ఇది పేలిపోయి భారీ నష్టాన్ని కలిగిస్తుంది. అయితే, ఇరాక్‌లో కూలిపోయిన ఈ డ్రోన్ ఇంకా పేలలేదు. సుమారు అర క్వింటాల్ బాంబును నింపుకున్న ఈ భారీ యంత్రం పొరపాటున పేలితే ఒక గ్రామానికి గ్రామమే నాశనమయ్యే ప్రమాదం ఉంది. అందుకే స్థానికులు దానిని చూసి ప్రాణభయంతో పరుగులు తీస్తున్నారు.

సోషల్ మీడియాలో వైరల్.. స్థానికుల సాహసం:

ఈ ఘటనకు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందులో కొంతమంది స్థానికులు ఆ డ్రోన్‌ను పక్కకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. కానీ, పేలని డ్రోన్‌ను ముట్టుకోవడం అంటే మృత్యువుతో చెలగాటం ఆడటమేనని రక్షణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇఅమెరికా సైన్యం ఈ డ్రోన్‌ను తిరిగి తీసుకుంటుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవైపు యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ, ఇలాంటి హైటెక్ డ్రోన్లు ఫెయిల్ అవ్వడం అమెరికా రక్షణ వ్యవస్థపై కూడా కొన్ని ప్రశ్నలను లేవనెత్తుతోంది.