Begin typing your search above and press return to search.

ట్రంప్ ఎఫెక్ట్... ఈ సారి సామాన్యుడిని నేరుగా తాకనున్నారా.!

ఇందులో భాగంగా... త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం పుష్కలంగా ఉందని అంటున్నారు.

By:  Raja Ch   |   30 Jan 2026 1:58 PM IST
ట్రంప్ ఎఫెక్ట్... ఈ సారి సామాన్యుడిని నేరుగా తాకనున్నారా.!
X

తనదైన నిర్ణయాలతో ప్రపంచంలోని పలు దేశాల ఆర్థిక వ్యవస్థలపై పెను ప్రభావం చూపిస్తోన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తాజాగా వేస్తున్న అడుగుల నేపథ్యంలో ఈ సారి నేరుగా సామాన్యుడిపై స్పాట్ లో ప్రభావం చూపించే అవకాశం ఉందని అంటున్నారు! ఇందులో భాగంగా... త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం పుష్కలంగా ఉందని అంటున్నారు. అందుకు గల కారణాలు, హార్మూజ్ జలసంధిలో రవాణాపై సందేహాలు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి.

అవును... తాజా భౌగోళిక రాజకీయ సంక్షోభాలు కీలకమైన ఇంధన రవాణా మార్గాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని.. ఫలితంగా సామాన్యుడిని నేరుగా ప్రభావితం చేసేలా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని చెబుతున్నారు. దీనికి ప్రధాన కారణం.. అణు ఒప్పంద నిబంధనలు నెరవేరకపోతే ఇరాన్ పై సైనిక దాడులు జరిగే అవకాశం ఉందని ట్రంప్ చేసిన వ్యాఖ్యలే. దీంతో... ఇది అత్యంత హాట్ టాపిక్ గా మారింది.

తాజా పరిణామాల నేపథ్యంలో యూఎస్ - ఇరాన్ మధ్య ఉద్రిక్తతల వార్తలు చమురు ధరలను తిరిగి పెంచాయి. ఇందులో భాగంగా... బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ జూలై తర్వాత తొలిసారిగా బ్యారెల్ కు 70 డాలర్ల కంటే ఎక్కువగా ముగియగా... వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (డబ్ల్యూటీఐ) కూడా పెరిగింది. ఇందులో భాగంగా బ్యారెల్ కు 66 డాలర్ల వద్ద ధరలు ట్రేడవుతున్నాయి. ఈ ధరలకు ఇరాన్ పై ట్రంప్ సైనిక చర్య గురించి ప్రత్యక్ష హెచ్చరికలే ప్రధాన కారణమని అంటున్నారు.

ఇదే క్రమంలో... ప్రాథమిక ఆందోళన హార్మూజ్ జలసంధిపైనా కేంద్రీకృతమై ఉంది. ఇది ప్రపంచంలోని సముద్రమార్గ ముడి చమురులో సుమారు 30% రవాణాను సులభతరం చేస్తుంది. ఇలా ట్రంప్ బెదిరింపులు.. హార్మూజ్ జలసంధి రవాణాపై ఆందోళనలకు తోడు.. రాబోయే ఆది, సోమవారాల్లో జలసంధిలో లైవ్ ఫైర్ డ్రిల్ ల కోసం ఇరాన్ ప్రణాళికను నివేదికలు సూచిస్తున్నాయి. ఈ చర్య ప్రపంచ ఇంధన మార్కెట్లకు అనివార్యమైన సరఫరా మార్గాలకు అంతరాల భయాలను తీవ్రతరం చేస్తుంది.

మరోవైపు... అంతర్జాతీయ సంస్థలు వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలను విడుదల చేయడం వల్ల గణనీయమైన సరఫరా షాక్ ల సందర్భంలో నిరంతర ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా నియంత్రణ ప్రభావం చూపవచ్చని అంటున్నారు.

ఆ సంగతి అలా ఉంటే... చమురు ధరలు బ్యారెల్ కు $68 - $70 వద్ద ఉండటానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భౌగోళిక, రాజకీయ కారణాలు ఖచ్చితంగా కారణమని ఇనిస్టిట్యూట్ ఫర్ ఎనర్జీ అండ్ ఫైనాన్స్ ఫౌండేషన్ పరిశోధన డైరెక్టర్ అలెక్సీ బెలోగోరివ్ అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో.. ఇరాన్ పై అమెరికా సైనిక చర్యకు దిగినా తన అభిప్రాయం ప్రకారం ధరలు బ్యారెల్ కు $65 - $90 మధ్య ఉంటాయని.. గతంలోలాగా $100 దాటే అవకాశం గురించిన వ్యాఖ్యలు కేవలం ఊహాజనితాలేనని అన్నారు.