Begin typing your search above and press return to search.

అమెరికాతో వివాదం.. చ‌మురుకోస‌మేనా? ఇంకేదైనా ఉందా?

అమెరికా.. నిన్న మొన్న‌టి వ‌ర‌కు మిత్ర దేశం. అయితే.. చప‌ల చిత్తానికి బ‌ట్ట‌లు తొడిగితే.. ఆ దేశ అధ్య‌క్షుడు ట్రంప్ ఈ ప్ర‌పంచానికి ద‌ర్శ‌న‌మిస్తారు.

By:  Garuda Media   |   8 Aug 2025 6:00 PM IST
అమెరికాతో వివాదం.. చ‌మురుకోస‌మేనా? ఇంకేదైనా ఉందా?
X

అమెరికా.. నిన్న మొన్న‌టి వ‌ర‌కు మిత్ర దేశం. అయితే.. చప‌ల చిత్తానికి బ‌ట్ట‌లు తొడిగితే.. ఆ దేశ అధ్య‌క్షుడు ట్రంప్ ఈ ప్ర‌పంచానికి ద‌ర్శ‌న‌మిస్తారు. ఆయ‌న ఎప్పుడు ఎలా మార‌తారో చెప్ప‌డం క‌ష్టం. నిన్నటి వ‌ర‌కు మోడీని, భార‌త్‌ను తెగ‌పొడిగిన ఆయ‌న‌.. ఇప్పుడు ఆక‌స్మికంగా యూట‌ర్న్ తీసుకుని.. టారిఫ్‌ల యుద్ధం చేస్తున్నారు. దీనికి పైకి జ‌రుగుతున్న ప్ర‌చారం... ర‌ష్యా నుంచి చ‌మురు గొనుగోళ్లు, అదేవిధంగా న్యూక్లియ‌ర్ రియాక్ట‌ర్ ఇంధ‌నాన్ని కొనుగోలు చేస్తుండ‌డ‌మే కార‌ణ‌మ‌ని అంటున్నారు.

అయితే.. ఈ రెండే కార‌ణ‌మా? ఇంకేమీ లేదా? అంటే.. ప్ర‌ధాని మోడీ చెబుతున్న‌ట్టు పాలు కూడా ఉన్నాయి. నిజ‌మే. అమెరికా నుంచి పాలు కొనుగోలు చేయాల‌న్న‌ది కూడా.. ట్రంప్ ఉద్దేశం. అర్జెంటుగా ర‌ష్యాతో చ‌మురు దిగుమ‌తుల ఒప్పందం ర‌ద్దు చేసుకుని, లేదా దిగుమ‌తులు స‌గానికి స‌గం త‌గ్గించుకుని.. త‌మ నుంచి కొనుగోలు చేయాల‌న్న‌ది ట్రంప్ చెబుతున్న‌మాట‌. ఇదేస‌మ‌యంలో తాము వ్య‌తిరేకించే బ్రెజిల్ నుంచి కూడా పాలు కొనుగోలు ఆపేయాల‌న్న‌ది కూడా ట్రంప్ నిర్దేశించిన జాబితాలో కీల‌కాంశం.

వాస్త‌వానికి భార‌త్ పాల ఉత్ప‌త్తిలో ముందుంది. అయితే.. బ్రెజిల్ నుంచి కూడా మ‌నం పాలు కొనుగోలు చేస్తున్న‌మాట వాస్త‌వం. మ‌నం ఇత‌ర ద‌క్షిణాఫ్రికా దేశాల‌కు పాల‌ను ఎగుమ‌తి చేస్తూ.. బ్రెజిల్ నుంచి పాలు దిగుమ‌తి చేసుకుంటున్నారు. అయితే.. బ్రెజిల్ పాలు కాదు.. అమెరికా పాలు కొనుగోలు చేయాల‌న్న ది ట్రంప్ చెబుతున్న మ‌రో మాట‌. కానీ.. ఈ విష‌యంలో భార‌త్ స‌సేమిరా అంటోంది. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. అవి `రెడ్ మిల్క్‌`. ఔను.. అమెరికా ఉత్ప‌త్తి ఏసే పాల‌పై `రెడ్‌` మార్కు ఉంటుంది.

దీనికి కార‌ణం.. అక్క‌డి ప‌శువుల‌కు చికెన్‌, బీఫ్ స‌హా.. ఇత‌ర జంతు క‌ళేబ‌రాల‌ను అధిక దాణాగా వినియో గిస్తారు. దీంతో అమెరికా పాల‌ను మాంసాహారంగానే అక్క‌డి ప్ర‌భుత్వం పేర్కొంటుంది. కానీ, భార‌త్‌లో మాత్రం పాలు వెజిటేరియ‌న్‌. పైగా ప‌విత్ర వ‌స్తువు. పూజ‌ల‌కు, అభిషేకాల‌కు కూడా పాల‌ను వినియోగి స్తాం. ఈ విష‌యానే చెబుతూ.. ఇటీవ‌ల ప్ర‌ధానిమోడీ.. మ‌న సంప్ర‌దాయాల‌ను. సంస్కృతిని విడ‌నాడేది లేద‌న్నారు. సో... అమెరికా పెట్టిన కండిష‌న్ల‌లో కేవ‌లం చ‌మురు, న్యూక్లియ‌ర్ రియాక్ట‌ర్ల ఇంధ‌నం మాత్ర‌మే కాదు.. పాలు కూడా ఉండ‌డం గ‌మ‌నార్హం.