అగ్రరాజ్యం ఇండిపెండెన్స్ డే.. ట్రంప్‌కు సెగ
250 ఏళ్ల కిందట ఈ రాష్ట్రాలను ఏకం చేసి.. అమెరికా సంయుక్త రాష్ట్రాలుగా ఏర్పరిచి.. బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా గళం వినిపించారు. దీంతో బ్రిటన్ పాలకులు.. అమెరికన్‌లకు దేశాన్ని అప్పగించి వెళ్లిపోయారు.
By: Garuda Media | 4 July 2026 12:18 PM ISTఅగ్రరాజ్యం అమెరికాకు స్వాతంత్రం వచ్చి శనివారం(జూలై 4) 250 సంవత్సరాలు అయింది. వాస్తవానికి అమెరికా కు స్వాతంత్రం రావడం ఏంటని కొందరు ఆశ్చర్యపోవచ్చు. అమెరికా సంయుక్త రాష్ట్రాలుగా ఏర్పడ ముందు.. పలు రాష్ట్రాల్లో బ్రిటీష్ పాలన కొనసాగింది. 250 ఏళ్ల కిందట ఈ రాష్ట్రాలను ఏకం చేసి.. అమెరికా సంయుక్త రాష్ట్రాలుగా ఏర్పరిచి.. బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా గళం వినిపించారు. దీంతో బ్రిటన్ పాలకులు.. అమెరికన్‌లకు దేశాన్ని అప్పగించి వెళ్లిపోయారు.
ఇక, అప్పటి నుంచి జూలై నాలుగున స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అయితే.. ఏటా ఎంతో ఘనంగా నిర్వహించే ఈ జాతీయ పండుగ తాజాగా బోసిపోయే పరిస్థితి ఏర్పడింది. ఎక్కడో కొన్ని కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే అమెరికా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. దీనికి కారణం.. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న వైఖరేనని అంటున్నారు పరిశీలకులు. ఇటీవల కాలంలో ట్రంప్ తీసుకుంటున్న ద్వంద్వ వైఖరి.. పెద్ద ఎత్తున ప్రజలను ఆగ్రహానికి గురి చేస్తోంది.
ముఖ్యంగా ఇరాన్ విషయంలో ట్రంప్ వైఖరి ఇంకా కొలిక్కి రాలేదు. ఒకవైపు శాంతి ఒప్పందం జరిగిందని చెబుతు న్నా.. మరోవైపు.. ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇది ఎలా ఉన్నా.. దేశంలో ద్రవ్యోల్బణం ఓ రేంజ్‌లో కొనసా గుతోంది. ఇక, పేదలకు ఇచ్చే ఫుడ్ స్టంట్స్(మన దగ్గర ఉచిత బియ్యం మాదిరిగా) సబ్సిడీని ట్రంప్ తీసేయడంతో దేశంలో బెగ్గర్ల సంఖ్య పెరిగిపోయిందని వైట్ హౌస్ పేర్కొనడం గమనార్హం. దీంతో పాటు పానీయాల నుంచి ఇతర నిత్యావసర వస్తువుల వరకు కూడా ధరలు మండుతున్నాయి.
ఇవన్నీ ట్రంప్ సర్కారుకు మంట పెడుతున్న పరిణామాలే కావడం గమనార్హం. దీనికితోడు.. వలస విధానం, వీసా సహా.. అనేక అంశాల్లో ట్రంప్ వైఖరిని న్యాయస్థానాలు కూడా తప్పుబడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ట్రంప్ కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు పెరుగుతున్నాయి. తాజాగా స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ పర్వదినంగా సెవలు ప్రకటించారు. కానీ, పలు రాష్ట్రాల్లో ప్రజలు సెలవు తమకు అవసరం లేదని.. సెలవు తీసుకుని విందులు చేసుకునే పరిస్థితిని ట్రంప్ పోగొట్టారని ఆగ్రహం వ్యక్తం చేయడం పరిస్థితిని కళ్లకు కడుతోంది.
