Begin typing your search above and press return to search.

ఇండియాకి గుడ్ న్యూస్.. సగానికి తగ్గనున్న ట్రంప్ సుంకాలు..

రష్యా నుండి చమరును కొనుగోలు చేస్తున్నందుకు భారత్ పై డోనాల్డ్ ట్రంప్ గతంలో ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా దీనికి ప్రతిచర్యగా భారత్ నుంచి అమెరికాకు వెళ్లే వస్తువులపై ఏకంగా 25 శాతం సుఖం విధించారు.

By:  Madhu Reddy   |   24 Jan 2026 5:48 PM IST
ఇండియాకి గుడ్ న్యూస్.. సగానికి తగ్గనున్న ట్రంప్ సుంకాలు..
X

అత్యాశ అనర్ధాలకు దారితీస్తుంది అంటారు.. ఇది సామాన్యులకే కాదు దేశ అధ్యక్షులకు కూడా వర్తిస్తుందని తాజాగా జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే అర్థమవుతుంది. ఇన్ని రోజులు భారతదేశంతో శత్రుత్వం పెంచుకునే ప్రయత్నం చేస్తున్న ట్రంప్.. తాజాగా భారతదేశానికి శుభవార్త చెప్పడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ముఖ్యంగా సుంకాలను సగానికి తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయంపై భారతీయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

అమెరికాకి డోనాల్డ్ ట్రంప్ రెండవసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. సుంకాలు భారీగా పెంచేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా భారత ఎగుమతులపై విధించిన ఈ భారీ సుంకాలను ఇప్పుడు సగానికి తగ్గించే దిశగా అమెరికా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనికి కారణం రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు విషయంలో నెలకొన్న వివాదం కాస్త సద్దుమనగడంతోనే ఈ సానుకూల పరిణామం చోటు చేసుకున్నట్లు సమాచారం.

ఇకపోతే రష్యా - ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో.. రష్యా నుండి చమరును కొనుగోలు చేస్తున్నందుకు భారత్ పై డోనాల్డ్ ట్రంప్ గతంలో ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా దీనికి ప్రతిచర్యగా భారత్ నుంచి అమెరికాకు వెళ్లే వస్తువులపై ఏకంగా 25 శాతం సుఖం విధించారు. దీనికి తోడు ప్రతీకార సుంకాలు మరో 25% కలపడంతో మొత్తం పన్ను భారం 50 శాతానికి చేరుకుంది. ఇది భారతీయ ఎగుమతి దారులపై తీవ్రమైన ప్రభావాన్ని చూపింది. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి భారతదేశం నుండి చమరు కొనుగోలును గణనీయంగా తగ్గించడంతో అమెరికా ప్రభుత్వం సంతృప్తి చెంది, భారత్ పై విధించిన 50 శాతం సుంకాలను సగానికి తగ్గించే ఆలోచనలో ఉన్నట్లు అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ ఒక ఇంటర్వ్యూలో హింట్ ఇచ్చారు.

ఇక ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎగుమతిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల అమెరికాకు ఎగుమతి అయ్యే భారతీయ వస్తువుల ధరలు తగ్గి భారత వ్యాపారులకు భారీ లబ్ది చేకూరనుంది.అంటే ఈ నిర్ణయం కనుక అమలులోకి వస్తే ఐటీ, ఫార్మా, దుస్తుల తో పాటు ఇతర తయారీ రంగాలకు భారీగా ఊరట లభించనున్నట్లు చెప్పవచ్చు. అంతేకాదు వీటి ధరలు కూడా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికైతే అమెరికాతో భారత్ దౌత్యపరమైన సంబంధాలు మరింత బలపడుతున్నాయి అనడానికి ఇది సంకేతంగా మారుతోందని విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. అయితే ఈ నిర్ణయం ఎప్పటి నుంచి అమలులోకి రానుంది అనే విషయంపై ఇంకా అమెరికా ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు.