ఆహా.. ఏం ప్లానింగ్ బ్రో.. అమెరికా ఇమ్మిగ్రేషన్ లూప్‌హోల్స్‌తో ఆడుకుంటే తాతలు దిగొస్తారు జాగ్రత్త
తాజాగా ఓ ఘనుడి ఉదంతం చూస్తే అమెరికా ఇమ్మిగ్రేషన్ లూప్‌హోల్స్‌తో ఆడుకుంటే తాతలు దిగొస్తారని అర్థమవుతోంది..
By: A.N.Kumar | 24 May 2026 5:46 PM ISTఅమెరికా.. అదొక కలల ప్రపంచం.. చేతిలో ఎఫ్-1 వీసా పడగానే బ్యాగు సర్దుకుని ఫ్లైట్ ఎక్కేసే వేలాది మంది భారతీయ విద్యార్థుల అంతిమ లక్ష్యం ఏంటి? ఎలాగోలా చదువు పూర్తి చేయడం.. ఆ పైన గ్రీన్ కార్డు కొట్టేసి సెటిల్ అయిపోవడం. కానీ, ఈ మధ్య కాలంలో మనోళ్లు చేసే కొన్ని ‘చిన్న చిన్న’ స్మార్ట్ పనులు, భవిష్యత్తులో గ్రీన్ కార్డులకి పెద్ద పెద్ద ‘స్పీడ్ బ్రేకర్లు’గా మారుతున్నాయి. తాజాగా ఓ ఘనుడి ఉదంతం చూస్తే అమెరికా ఇమ్మిగ్రేషన్ లూప్‌హోల్స్‌తో ఆడుకుంటే తాతలు దిగొస్తారని అర్థమవుతోంది..
పాపం మనోడు 2015లోనే ల్యాండ్ అయ్యాడు. బ్యాచలర్స్ అయిపోయింది.. మాస్టర్స్ కూడా చేసేశాడు. మాస్టర్స్ చదువుతుండగా కోర్సులో భాగంగా వచ్చే సీపీటీ (కల్చరల్ ప్రాక్టికల్ ట్రైనింగ్) అనుమతితో ఒక స్టార్టప్ కంపెనీలో చేరాడు. ఇక్కడి వరకు అంతా సవ్యమే. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది!
తన సీపీటీ అనుమతి గడువు ఎప్పుడో ముగిసిపోయింది. కానీ మనోడు మాత్రం ‘సౌండ్ లేకుండా’ ఉద్యోగం కానిచ్చేశాడు. అక్షరాలా రెండేళ్ల పాటు ‘అనధికారికంగా’ అంటే ఇమ్మిగ్రేషన్ భాషలో చెప్పాలంటే.. దొంగచాటుగా పని చేసేశాడు. "అయ్యో.. నా సీపీటీ అయిపోయింది కదా, కంపెనీ వాళ్లు అడగలేదేం? యూనివర్సిటీ వాళ్లు నోటీస్ పంపలేదేం?" అని మనోడు కూడా అడగలేదు. "వాళ్లు అడగలేదు.. నేను చెప్పలేదు.. జీతం పడుతోంది.. ఇంకేం?" అన్నట్టు సాగిపోయింది వ్యవహారం. దీన్నే ఇంగ్లీషులో ‘ఇగ్నోరెన్స్ ఈజ్ బ్లిస్’ అంటారు కాబోలు!
లక్ ఎప్పుడూ ఒకేలా ఉండదు బ్రో!
అయితే ఈ ఘోర తప్పిదం జరిగాక కూడా మనోడికి గ్రహాలు అనుకూలించాయో ఏమో.. తర్వాత ఓపీటీ వచ్చింది. ఆ పైన స్టెమ్ ఓపీటీ కూడా మంజూరయ్యాయి. అంటే అమెరికా ప్రభుత్వం పాత తప్పును గమనించకుండానే తదుపరి పర్మిషన్లు ఇచ్చుకుంటూ పోయింది. దాంతో మనోడు, "అబ్బా.. గండం గడిచింది, ఇమ్మిగ్రేషన్ వాళ్లు నాకంటే వీక్ ఉన్నారబ్బా!" అని ఫిక్స్ అయిపోయి ఉంటాడు.
ప్రస్తుతం మన హీరో, ఒక అమెరికా పౌరురాలిని పెళ్లాడి, ఆమె ద్వారా మ్యారేజ్ బేస్డ్ గ్రీన్ కార్డ్ (అడ్జస్ట్ మెంట్ ఆఫ్ స్టేటస్) కోసం దరఖాస్తు చేసుకోవడానికి రెడీ అవుతున్నాడు. ఇక్కడే పాత ‘సీపీటీ దొంగతనం’ గుర్తొచ్చి ఇప్పుడు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
ఇమ్మిగ్రేషన్ ఫోరమ్స్‌లో ఇప్పుడిదే హాట్ టాపిక్. అక్కడ నిపుణులు ఇచ్చే సలహాలు ఎలా ఉన్నాయంటే "లైట్ తీస్కో బ్రో.. అమెరికా పౌరుడి జీవిత భాగస్వామివి కాబట్టి, ఇలాంటి 'ఆన్ ఆథరైజ్డ్ ఎంప్లాయిమెంట్ ' తప్పులను యూఎస్.సీఐఎస్ క్షమించేస్తుందిలే!" అని సర్దిచెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో యూఎస్.సీఐఎస్ ప్రతి పేపర్‌ను మైక్రోస్కోప్ పెట్టి చూస్తోంది. నువ్వు రెండేళ్ల పాటు పన్నులు కట్టావా? డాలర్లు ఎలా వచ్చాయి? అని లాగితే డొంకంతా కదులుతుంది" అని హెచ్చరిస్తున్నారు.
అమెరికాలో ఉన్న విద్యార్థులకు ఇమ్మిగ్రేషన్ నిపుణులు ఇచ్చే ఉచిత సలహా ఏంటంటే "అమెరికా చట్టాలతో ఆటలొద్దు!" అని.. సీపీటీ, ఓపీటీ, స్టెమ్ ఓపీటల గడువులు, యూనివర్సిటీ రికార్డులను క్షుణ్ణంగా చూసుకోవడం మన బాధ్యత. "యూనివర్సిటీ వాడు గుర్తు చేయలేదు కంపెనీ హెచ్ఆర్ నిద్రపోతోంది" అని మనం కూడా ముసుగేసి పడుకుంటే.. రేపు పొద్దున గ్రీన్ కార్డు ఇంటర్వ్యూలో యూఎస్.సీఐఎస్ ఆఫీసర్ మనకు ఇండియాకు రిటర్న్ టికెట్ ఇచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి, రూల్స్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి బాస్.. లేదంటే అమెరికా కల కాస్తా.. 'గ్రీన్ కార్డ్ టెన్షన్' గా మారిపోతుంది.
