Begin typing your search above and press return to search.

ట్రంప్‌కు మైండ్ దొబ్బిందా? బలోచిస్తాన్ పై అమెరికా నిర్ణయం వివాదం

అమెరికా ప్రభుత్వం తాజాగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) , దాని మిలిటెంట్ విభాగం మజీద్ బ్రిగేడ్‌ను విదేశీ ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించింది.

By:  A.N.Kumar   |   12 Aug 2025 10:00 PM IST
ట్రంప్‌కు మైండ్ దొబ్బిందా?   బలోచిస్తాన్ పై అమెరికా నిర్ణయం వివాదం
X

అమెరికా ప్రభుత్వం తాజాగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) , దాని మిలిటెంట్ విభాగం మజీద్ బ్రిగేడ్‌ను విదేశీ ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించింది. ఈ నిర్ణయం అంతర్జాతీయంగా చర్చనీయాంశమవ్వడమే కాకుండా.. తీవ్ర విమర్శల పాలైంది. కారణం ఉగ్రవాదానికి ప్రధాన కేంద్రంగా ఉన్న పాకిస్తాన్‌ను పట్టించుకోకుండా.. దాని చేతిలో ఏళ్లుగా అణచివేతకు గురవుతున్న బలూచ్ స్వాతంత్ర్య సమరయోధులపై అమెరికా ఉగ్రవాద ముద్ర వేయడమే.

-బలూచ్ పోరాటం.. స్వాతంత్ర్యం కోసం...

బలూచిస్తాన్‌లో దశాబ్దాలుగా పాకిస్తాన్ సైన్యం, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు బలూచ్ జాతిని అణగదొక్కుతున్నాయి. మానవహక్కుల ఉల్లంఘనలు, అదృశ్యాలు, టార్చర్, నిర్బంధాలు అక్కడ నిత్యకృత్యంగా మారాయి. ఈ నేపథ్యంలోనే BLA వంటి గుంపులు స్వాతంత్ర్య పోరాటం ప్రారంభించాయి. కానీ పాకిస్తాన్ వీరిని “ఉగ్రవాదులు”గా చిత్రీకరిస్తూ, అంతర్జాతీయ వేదికల్లో మద్దతు కోసం ప్రయత్నిస్తోంది.

-అమెరికా నిర్ణయం వెనుక రాజకీయ లెక్కలు

ట్రంప్ ప్రభుత్వం ఈ ప్రకటన చేయడం యాదృచ్ఛికం కాదు. గత కొన్నేళ్లుగా అమెరికా–పాకిస్తాన్ సంబంధాలు చల్లబడినా ఆఫ్ఘానిస్తాన్, చైనా, ఇరాన్ వంటి భౌగోళిక రాజకీయ అంశాల కారణంగా మళ్లీ సమీపం కావాల్సిన అవసరం వచ్చింది. పాకిస్తాన్‌ అనుకూల నిర్ణయాలు తీసుకోవడం, ఇస్లామాబాద్‌ కోపం తెప్పించకుండా చూడడం ఈ వ్యూహంలో భాగం కావచ్చు.

-బలూచ్ మద్దతుదారుల ఆగ్రహం

బలూచ్ ఉద్యమానికి మద్దతు ఇచ్చే అంతర్జాతీయ మానవహక్కుల సంస్థలు ఈ నిర్ణయాన్ని “అమెరికా పతనానికి పరాకాష్ట”గా అభివర్ణించాయి. పాకిస్తాన్ సైనిక దమనకాండను నిర్లక్ష్యం చేసి, దాని బలులైన బలూచ్‌లను ఉగ్రవాదులుగా ముద్ర వేయడం అన్యాయం అని వారు చెబుతున్నారు.

- ఇది ఎవరికీ లాభం?

పాకిస్తాన్‌కు తమ అంతర్గత సమస్యను అంతర్జాతీయంగా “టెర్రరిజం”గా ముద్ర వేయించుకోవడం పెద్ద విజయమే. కానీ అమెరికాకు తాత్కాలికంగా పాకిస్తాన్‌ సహకారం పొందవచ్చు కానీ, విశ్వసనీయతపై గీత పడుతుంది. బలూచ్ ఉద్యమానికి అంతర్జాతీయ వేదికల్లో వారి న్యాయమైన డిమాండ్ మరింత కష్టతరం అవుతుంది.

ఉగ్రవాదం అనే పదాన్ని రాజకీయ అవసరాలకు అనుగుణంగా వాడితే, అది న్యాయం కాదు. అమెరికా ఈ నిర్ణయంతో పాకిస్తాన్ అణచివేతకు మౌనంగా మద్దతు తెలిపినట్లే. ట్రంప్ ప్రభుత్వానికి ఇది వ్యూహాత్మక గణాంకాల్లో లాభం కావచ్చు కానీ, నైతికంగా మాత్రం ఇది అంతర్జాతీయ న్యాయం మీదే దెబ్బ.