Begin typing your search above and press return to search.

పిచ్చి మదురో...చెప్పినా వినలేదు !

ఎవరీ మదురో...అంతర్జాతీయ సమాజంలో ఒక్కసారిగా పాపులర్ అయిపోయాడు, ఏమిటి ఈయన కధ అంటే అదే ఇపుడు వరల్డ్ వైడ్ హాట్ టాపిక్.

By:  Satya P   |   4 Jan 2026 2:00 PM IST
పిచ్చి మదురో...చెప్పినా వినలేదు !
X

ఎవరీ మదురో...అంతర్జాతీయ సమాజంలో ఒక్కసారిగా పాపులర్ అయిపోయాడు, ఏమిటి ఈయన కధ అంటే అదే ఇపుడు వరల్డ్ వైడ్ హాట్ టాపిక్. వెనిజులా దేశానికి అధ్యక్షుడిగా ఉన్న నికోలస్ మదురో ఆయన భార్యను అమెరికా సైన్యాలు అరెస్ట్ చేసి మరీ న్యూయార్క్ కి తీసుకుని వచ్చాయి. అమెరికా చట్ట అమలు సంస్థలతో కలిసి నిర్వహించిన సైనిక చర్యలో మదురోను పట్టుకున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెబుతున్నారు. ఇక ఈ దంపతుల మీద మాదకద్రవ్యాలు ఆయుధ నేరాల అభియోగాలు మోపారు. దాంతో అమెరికా చట్టం ప్రకారం విచారించి కఠిన శిక్షలు అమలు చేస్తారు అని అంటున్నారు.

చెప్పినా వినలేదు :

ఇదిలా ఉంటే నికోలస్ మదురో ఎన్నో ఆఫర్లు ఇచ్చామని వైట్ హౌస్ వర్గాలు అంటున్నాయి. ఆయనను దేశం విడిచి పారిపోమని గత ఏడాది నవంబర్ లోనే హెచ్చరించామని చెబుతున్నాయి. ప్రాణాలతో బయటపడేందుకు అది ఒక మార్గంగా చెప్పామని అంటున్నారు. అంతే కాదు మరెన్నో బంపర్ ఆఫర్లు డీల్స్ కూడా ఆయన ముందు పెట్టామని అయితే వేటికీ ఆయన స్పందించలేదని పట్టనట్లుగా ఉండడం వల్లనే ఈ రోజు పట్టుబడి అమెరికా చట్టాల ముందు బంధీ అయ్యారని అంటున్నారు.

ప్రకంపనలు రేపింది :

ఇదిలా ఉంటే శనివారం తెల్లవారుజామున రాజధాని కారకాస్‌లో అమెరికా సైనిక దళ భారీ ఎత్తున పేలుళ్లు నిర్వహించింది. ఆ తరువాత మదురో కాంపౌండ్‌లోకి అమెరికన్ సైన్యం ప్రవేశించింది అక్కడ మదురో ఒక కోట లాంటి ఇంట్లో ఉంటున్నాడు. అర్ధరాతి కారకాస్‌లోని లైట్లు మొత్తం అమెరికన్ సైన్యం ఆపివేశారు. చీకట్లోనే మదురో ఇంట్లోకి నట్టింట్లోకి ఏకంగా మదురో బెడ్ రూం లోకి ప్రవేశించి మరీ ఆయనను భార్యను అక్కడే పట్టుకుని తమ వెంట తీసుకుని పోయారు.

వేల కిలోమీటర్లు :

ఇక బంధీగా పట్టుకున్న నికోలస్ మదురో ని ఆయన భార్యను ఏకంగా మూడు వేల 200 కిలోమీటర్ల దూరమంతా తిప్పారని అంతర్జాతీయ వార్తలు చెబుతున్నాయి. ఇక ఆ సమయంలో మదురో కళ్ళకు గంతలు కట్టి మరీ బయటకు తెచ్చి ఈ విధంగా తిప్పారు అని అంటున్నారు. నికోలస్ మదురో ఈ విధంగా పట్టు బడడానికి కారణం వెనిజులా ప్రభుత్వంలోని సిఐఎ అని చెబుతున్నారు. ఇది అమెరికా విస్తృతమైన నిఘా నెట్‌వర్క్‌లో విభాగంగా ఉంది. అలా అమెరికాకు మదురో ఎక్కడ ఉంటారో ఆయన సురక్షితమైన స్థావరం ఏమిటి ఎలా ప్రవేశించాలి అన్నది పూర్తిగా ట్రాక్ చేయడంలో సహాయపడింది అని అంటున్నారు. ఈ మొత్తం ఆపరేషన్ లో ఏకంగా 150 కి పైగా విమానాలను ఉపయోగించారని తెలుస్తోంది.

జస్ట్ మిస్ అయింది :

ఇదిలా ఉంటే ఇంత పకడ్బందీగా నికోలస్ మదురోని అమెరికా సైన్యం పట్టుకున్నప్పటికీ వెనిజులా అధ్యక్షుడు చివరి దాకా తన ప్రయత్నాలు తాను చేస్తూ వచ్చాడని అంటున్నారు. దాంతో మదురో ఉక్కుతో రూపొందించిన బలమైన సురక్షిత ప్రదేశంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించాడని చెబుతున్నారు. అయితే ఆయన ఆ సేఫ్ జోన్ లోని తలుపు వద్దకు చేరుకున్నాడని కానీ దానిని మూసివేయలేకపోయాడని అంటున్నారు. అక్కడే అమెరికా సైన్యం సక్సెస్ అయింది. దాంతో నికోలస్ మదురో అడ్డంగా దొరికిపోయాడని తెలుస్తోంది. ఇపుడు నికోలస్ మదురో జీవితం ఏమిటి అన్నది ట్రంప్ చేతులలో ఉందని అంటున్నారు. ఆయన ప్రాణాలకు ముప్పు ఉందని చెబుతున్నారు. మరి అమెరికాను ఎదిరించాలని ఒక దశలో అనుకున్నా అదే ట్రంప్ తో డీల్ చేసుకుని తాను అధ్యక్షుడుగా కొనసాగడానికి సైతం నికోలస్ మదురో చివరి దశలో ప్రయత్నాలు చేశారని అంటున్నారు. అయితే ట్రంప్ కి అమెరికాకు ఆయన అధ్యక్ష పదవిలో ఉండడం ఇష్టం లేదని అందుకే పారిపోవాలని చెప్పారని అంటున్నారు.