Begin typing your search above and press return to search.

‘హ్యాపీ క్రిస్మస్ టు ఆల్’... వైమానిక దాడులు మొదలుపెట్టిన అమెరికా!

నైజీరియా అధికారుల అభ్యర్థన మేరకు ఈ దాడులు నిర్వహించామని.. ఈ దాడిలో బహుళ ఐసిస్ ఉగ్రవాదులు మరణించారని రక్షణ శాఖ తెలిపింది.

By:  Raja Ch   |   26 Dec 2025 9:29 AM IST
‘హ్యాపీ క్రిస్మస్  టు ఆల్’... వైమానిక దాడులు మొదలుపెట్టిన అమెరికా!
X

నైజీరియాలోని క్రైస్తవులను లక్ష్యంగా చేసుకుని అక్కడ ఉన్న ఐసిస్ ఉగ్రవాదులు చంపేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలుమార్లు స్పందిస్తూ హెచ్చరికలు జారీ చేశారు. అయినప్పటికీ ఉగ్రవాదుల్లో మార్పు రాకపోవడంతో మాటలు కట్టిపెట్టి చేతలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా... నైజీరియాలో ఉగ్రవాదులే లక్ష్యంగా వైమానిక దాడులు మొదలుపెట్టారు.

అవును... నైజీరియాలో క్రైస్తవులను లక్ష్యంగా చేసుకుని ఐసిస్ ఉగ్రవాదులు ఇటీవల దాడులకు పాల్పడుతూ, వారిని హత్యమారుస్తున్నారు! ఈ నేపథ్యంలో.. నైజీరియాలోని ఐసిసి ఉగ్రవాదులపై అమెరికన్ దళాలు అనేక ఘోరమైన వైమానిక దాడులు నిర్వహించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. నైజీరియా వాయువ్య ప్రాంతంలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులపై ఈ దాడులు కొనసాగుతాయని తెలిపారు.

నైజీరియా అధికారుల అభ్యర్థన మేరకు ఈ దాడులు నిర్వహించామని.. ఈ దాడిలో బహుళ ఐసిస్ ఉగ్రవాదులు మరణించారని రక్షణ శాఖ తెలిపింది. క్రిస్మస్ రోజున ఈ దాడులు జరిగాయి. ఈ సందర్భంగా స్పందించిన పెంటగాన్ చీఫ్ పీట్ హెగ్సేత్.. నైజీరియా ప్రభుత్వ మద్దతు, సహకారానికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పరు. నైజీరియాలో ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవడానికి సహకరించారని అభినందించారు.

ఈ సందర్భంగా తన ట్రూత్ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లో స్పందించిన డొనాల్డ్ ట్రంప్... తన ఆదేశాల మేరకే ఈ దాడులు ప్రారంభించబడ్డాయని.. వాయువ్య నైజీరియాలో పనిచేస్తున్న ఐసిస్ ఉగ్రవాదులపై దాడి చేశామని.. కమాండర్ ఇన్ చీఫ్ గా తన ఆదేశాల మేరకు నైజీరియాలోని ఐసిస్ ఉగ్రవాద మురికివాడపై శక్తివంతమైన, ప్రాణాంతకమైన దాడిని యునైటెడ్ స్టేట్స్ వైమానిక దళం మొదలుపెట్టిందని తెలిపారు.

ప్రధానంగా అమాయక క్రైస్తవులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు వారిని దారుణంగా చంపేస్తున్నరని పెర్కొన్న ట్రంప్.. చాలా సంవత్సరాలుగా, శతాబ్ధాలుగా కూడా చూడని స్థాయికి అక్కడ హింస చేరుకుందని అన్నారు. అయితే.. దాడులు ఆపమని తాను గతంలో ఉగ్రవాద సంస్థలను హెచ్చరించానని.. క్రైస్తవులపై ఊచకోత ఆపకపోతే నరకం అనుభవించాల్సి వస్తుందని తాను హెచ్చరించానని.. ఈ రాత్రి అదే జరిగిందని అన్నారు.

ఈ చర్య ఉగ్రవాదంపై తన విస్తృత వైఖరిని ప్రతిబింబిస్తుందని చెప్పిన ట్రంప్.. తన నాయకత్వంలో, మన దేశం రాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాదం అభివృద్ధి చెందడానికి అనుమతించదని తెలిపారు. ఈ నేపథ్యంలోనే.. అమెరికా దళాలను ప్రశంసిస్తూ... మన సైన్యాన్ని దేవుడు ఆశీర్వదించుగాక.. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అని ట్రంప్ జోడించారు.

స్పందించిన నైజీరియా అధ్యక్షుడు!:

ఈ విషయంపై స్పందించిన నైజీరియా అధ్యక్షుడు బోలా టినుబు.. మీ అధ్యక్షుడిగా నైజీరియాలో మత స్వేచ్ఛను కాపాడటానికి, హింస నుంచి విభిన్న విశ్వాల ప్రజలందరినీ రక్షించడానికి నా శక్తి మేరకు ప్రతీదీ చేయడానికి కట్టుబడి ఉన్నానని ఒక ప్రకటనలో తెలిపారు. దేశ ఐక్యత, భద్రత, స్థిరత్వాన్ని కాపాడటానికి తన అచంచలమైన నిబద్దత గురించి నైజీరియన్లకు హామీ ఇస్తున్నట్లు చెప్పుకొచ్చారు.