Begin typing your search above and press return to search.

గ్లోబల్ ఎయిర్ పవర్ ర్యాంకింగ్ : ఏ దేశం తోపు అంటే?

కేవలం విమానాల సంఖ్యతో కాకుండా.. వాటి రకాలు, వినియోగ సామర్థ్యాలు, స్పెషల్ మిషన్ యూనిట్లు, బాంబర్ ఫోర్స్, శిక్షణా యూనిట్లతో పాటు.. కొత్తగా ఆర్డర్‌లో ఉన్న విమానాలకు కూడా ప్రాధాన్యతనిస్తారు.

By:  A.N.Kumar   |   17 Oct 2025 5:00 AM IST
గ్లోబల్ ఎయిర్ పవర్ ర్యాంకింగ్ : ఏ దేశం తోపు అంటే?
X

ప్రపంచ దేశాల వైమానిక శక్తిలో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది అనే చర్చకు తెరదించుతూ.. WDMMA (వర్డ్ డైరెక్టరీ ఆఫ్ మోడర్న్ మిలటరీ ఎయిర్ క్రాఫ్ట్ ) తన తాజా వార్షిక ర్యాంకింగ్‌ను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైనిక విమాన దళాలను అంచనా వేసే ఈ ర్యాంకింగ్‌లో అమెరికా వైమానిక దళం (USAF) మరోసారి తిరుగులేని అగ్రస్థానాన్ని దక్కించుకుంది.

* WDMMA ర్యాంకింగ్ కీలకాంశాలు

ఈ ర్యాంకింగ్ కేవలం విమానాల సంఖ్య ఆధారంగా కాకుండా.. వాటి నాణ్యత, ఆధునికీకరణ, వ్యూహాత్మక సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకుంటుంది. WDMMA ఉపయోగించే ప్రత్యేక కొలమానం ‘TruVal Rating (TVR)’ పద్ధతి ప్రకారం.. యుద్ధ సామర్థ్యం, లాజిస్టికల్ సపోర్ట్, దాడి-రక్షణ బలం, అలాగే స్థానిక విమాన తయారీ పరిశ్రమ వంటి అంశాలకు అధిక ప్రాధాన్యం ఇస్తారు.

* TVR పద్ధతి

కేవలం విమానాల సంఖ్యతో కాకుండా.. వాటి రకాలు, వినియోగ సామర్థ్యాలు, స్పెషల్ మిషన్ యూనిట్లు, బాంబర్ ఫోర్స్, శిక్షణా యూనిట్లతో పాటు.. కొత్తగా ఆర్డర్‌లో ఉన్న విమానాలకు కూడా ప్రాధాన్యతనిస్తారు.

* అమెరికా అగ్రస్థానం వెనుక కారణం

2025 ర్యాంకింగ్‌లో అమెరికా వైమానిక దళం అత్యధిక TVR స్కోరు 242.9తో అగ్రస్థానంలో నిలిచింది. దీనికి ప్రధాన కారణాలు.. అమెరికా వద్ద ఫైటర్లు, బాంబర్లు, ట్రాన్స్‌పోర్ట్, ట్యాంకర్‌లు, స్పెషల్ మిషన్ యూనిట్లు, హెలికాప్టర్లతో కూడిన విస్తృతమైన ఫ్లీట్ ఉంది.

* అత్యున్నత సాంకేతికత

B-2 స్పిరిట్ (స్టీల్త్ బాంబర్), F-22 రాప్టర్ (ప్రపంచంలోనే అత్యుత్తమ ఫైటర్‌లలో ఒకటి), F-35 లైట్నింగ్ II (ఐదవ తరం మల్టీ-రోల్ ఫైటర్), A-10 థండర్బోల్ట్ వంటి అత్యాధునిక విమానాలు USAF సొంతం. C-17 , C-130 వంటి ట్రాన్స్‌పోర్ట్ ఫ్లీట్ (రవాణా విమానాలు) కారణంగా.. ప్రపంచంలో ఏ ప్రాంతానికైనా అత్యవసరంగా యుద్ధ సామర్థ్యాన్ని తక్షణమే మోహరించగల సత్తా అమెరికాకు ఉంది.

* దేశీయ తయారీ బలం

ఈ విమానాలలో ఎక్కువ భాగం దేశీయంగా తయారు చేయబడటం అమెరికా పారిశ్రామిక బలాన్ని, సాంకేతిక ఆధిపత్యాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది.

*భవిష్యత్ అంచనాలు

శిక్షణా, రీఫ్యూయెలింగ్ యూనిట్ల విస్తృత నెట్‌వర్క్ అమెరికా వైమానిక శక్తికి మరింత బలం చేకూరుస్తోంది. భవిష్యత్తులో మరిన్ని వందల అత్యాధునిక విమానాలు సర్వీస్‌లో చేరనున్నందున, ప్రపంచ వైమానిక దళాలపై అమెరికా ఆధిపత్యం మరింత బలపడే అవకాశం ఉంది.

అమెరికా తన అగ్రస్థానాన్ని కొనసాగిస్తుండగా... చైనా, రష్యా, భారత్ వంటి దేశాలు సైతం తమ వైమానిక దళాల ఆధునికీకరణను వేగవంతం చేస్తూ పోటీని పెంచుతున్నాయి.