Begin typing your search above and press return to search.

భారీ ఫైన్ వేసి కోచింగ్ సెంటర్లకు తిక్క కుదుర్చిన సీసీసీఏ

చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవటం అనే నానుడిని వినే ఉంటారు. ఇప్పుడు చెప్పే ఉదంతం అంతకు మించింది.

By:  Garuda Media   |   2 Nov 2025 5:23 PM IST
భారీ ఫైన్ వేసి కోచింగ్ సెంటర్లకు తిక్క కుదుర్చిన సీసీసీఏ
X

చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవటం అనే నానుడిని వినే ఉంటారు. ఇప్పుడు చెప్పే ఉదంతం అంతకు మించింది. మోసం చేయటం ద్వారా వ్యాపారం చేయాలన్న దుర్మార్గ ఆలోచనలతో వ్యవహరించే కోచింగ్ సెంటర్లకు తాజాగా దిమ్మ తిరిగేలా భారీ ఫైన్ షాక్ తగిలింది. సివిల్స్ (ఐఏఎస్, ఐపీఎస్) కోచింగ్ సెంటర్లు అభ్యర్థుల్ని పెద్ద ఎత్తున ఆకర్షించేందుకు వీలుగా తప్పుడు మార్గాన్ని ఆశ్రయించాయి. ఇందుకోసం ఇప్పటికే యూపీఎస్సీలో విజయం సాధించిన అభ్యర్థుల పేరుతో కోచింగ్ సెంటర్లు ఓపెన్ చేస్తూ.. మోసం చేస్తున్నాయి.

ఆలిండియా స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన అభ్యర్థుల పేరుతో ఈ కోచింగ్ సెంటర్లను తెరుస్తున్నారు. దీంతో.. సదరు విజేత గైడెన్స్ ఉంటుందన్న తప్పుడు భావనకు పలువురు కలిగే పరిస్థితి. తీరా చూస్తే.. ఆడ్మిషన్ల కక్కుర్తితోనే ఈ తరహా తప్పుడు పనులకు పాల్పడుతున్నాయి. ఈ విషయాన్ని 2021లో ఆలిండియా స్థాయిలో 96వ ర్యాంకు సాధించిన మణిశుక్లా.. సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ)కి ఫిర్యాదు చేశారు.

మరో అకాడమీతో కలిసి ఆ సంస్థ నిర్వహించిన ఒక్క మాక్ ఇంటర్వ్యూకు హాజరైనట్లుగా మణిశుక్లా పేర్కొన్నారు. తమ కోచింగ్ కారణంగానే మణిశుక్లా సివిల్స్ ను క్రాక్ చేసినట్లుగా తప్పుడు ప్రచారాన్ని షురూ చేశారు. ఈ అంశాన్ని గుర్తించిన అతను సీసీపీఏకు కంప్లైంట్ చేశారు. 2020లో ఆలిండియా ర్యాంకర్ నటాష గోయల్ (175వ ర్యాంక్) సాధించగా..అతడి ఫోటోను కూడా అభిమన్యూ ఐఏఎస్ అకాడమీ వినియోగించింది. అంతేకాదు.. తమ సంస్థ పెట్టినప్పటి నుంచి 2200 మంది అభ్యర్థులు ఉద్యోగాలు సాధించినట్లుగా ప్రచారం చేసుకుంది.

వీరికి సంబంధించిన వివరాల్ని మాత్రం పేర్కొనలేదు. అక్కడితో ఆగని ఈ సంస్థ 2023లో కూడా 139 మంది తమ వద్ద కోచింగ్ తీసుకొని ఉద్యోగాలు సాధించినట్లుగా పేర్కొన్నారు. అందులో 88 మంది తమకు తాముగా స్వయంగా ప్రిపేర్ అయి క్రాక్ చేసనట్లుగా గుర్తించారు. ఈ రెండు ఉదంతాలతో పాటు..తమకు అందిన ఫిర్యాదులతో సదరు సంస్థలకు భారీగా ఫైన్ విధిస్తూ షాకిచ్చారని చెప్పాలి.