ఎండీఆర్ అమలుకు దీపావళి బ్రేక్ !
యూపీఐ లావాదేవీల మీద ఎండీఆర్ ఛార్జీలను అమలు చేయాలని ఎన్ పీ సీఐ గత నెల 15న నిర్ణయిస్తూ ఫ్రేమ్ వర్క్ ప్రకటించింది.
By: Garuda Media | 13 Oct 2026 4:29 PM ISTయూపీఐ లావాదేవీల మీద ఎండీఆర్ ఛార్జీలను అమలు చేయాలని ఎన్ పీ సీఐ గత నెల 15న నిర్ణయిస్తూ ఫ్రేమ్ వర్క్ ప్రకటించింది. అక్టోబర్ 15 నుండి వసూలు చేయాలని నిర్ణయించింది. గతంలో ప్రభుత్వం ఎండీఆర్ అమలు విషయంలో సబ్సిడీ భరించేది. దీంతో అది ఉచితంగా లభించేది. ఈ నేపథ్యంలో దానిని ఈ నెల 15 నుండి అమలు చేయాలని భావించారు.
అయితే దీపావళి పండుగ సీజనల్ వ్యాపారాల మీద అదనపు భారం పడకుండా ఉండాలని వ్యాపార సంఘాలు వాయిదా వేయాలని కోరాయి దీంతో ఎన్ పీ సీఐ యొక్క యూపీఐ మరియు సర్వీసెస్ స్టీరింగ్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
ఎంపిక చేసిన పర్సన్ టు మర్చంట్ యూపీఐ లావాదేవీల మీద ఎండీఆర్ దీపావళి తర్వాత అమలు చేస్తామని, దీనికి సంబంధించి కొత్త తేదీని తర్వాత ప్రకటిస్తామని ఎన్ పీ సీఐ వెల్లడించింది.
గత సెప్టెంబర్ లో ఎన్ పీ సీఐ ప్రకటించిన ఫ్రేమ్ వర్క్ ప్రకారం వ్యక్తి నుండి వ్యక్తికి ఎంత మొత్తం లావాదేవీలు జరిగినా ఉచితంగా నిర్ణయించారు. వ్యక్తి నుంచి వ్యాపారికి రూ.2 వేల వరకు ఉచితంగా నిర్ణయించారు.
వ్యక్తి నుండి వ్యాపారికి రూ.2 వేలు మించితే 0.4 శాతం ఎండీఆర్ విధించారని నిర్ణయించారు. ఈ లెక్కన రూ.3 వేలకు రూ.12, రూ.50 వేలకు రూ.200, రూ.75 వేలకు రూ.300 క్యాప్ గా నిర్ణయించారు. నెలకు రూ.లక్ష వరకు యూపీఐ క్యూ ఆర్ ద్వారా స్వీకరించే చిన్న వ్యాపారులకు ఎండీఆర్ ఉచితంగా నిర్ణయించారు.
