Begin typing your search above and press return to search.

కొన్నిసార్లే బ్యాలెన్స్ చెక్, షెడ్యూల్డ్ చెల్లింపులు.. ఈరోజు నుంచి ఎన్నో మార్పులు

దేశవ్యాప్తంగా పెరుగుతున్న డిజిటల్ లావాదేవీల దృష్ట్యా, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) UPI వ్యవస్థలో కీలక మార్పులను తీసుకొస్తోంది.

By:  A.N.Kumar   |   1 Aug 2025 10:50 AM IST
UPI New Rules 2025
X

దేశవ్యాప్తంగా పెరుగుతున్న డిజిటల్ లావాదేవీల దృష్ట్యా, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) UPI వ్యవస్థలో కీలక మార్పులను తీసుకొస్తోంది. ఇవి ఆగస్టు 1, 2025 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ కొత్త నిబంధనలు గూగుల్ పే, ఫోన్ పే , పేటీఎం వంటి యాప్‌లను ఉపయోగించే వినియోగదారులపై నేరుగా ప్రభావం చూపనున్నాయి. ముఖ్యంగా బ్యాంకులు, యాప్‌లకు బరువు తగ్గించడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకుంటున్నారు.

-వినియోగదారులపై ప్రభావం చూపే ప్రధాన మార్పులు:

* బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేయడంపై పరిమితి: ఒక యాప్ ద్వారా రోజుకు గరిష్ఠంగా 50 సార్లు మాత్రమే బ్యాలెన్స్ చెక్ చేయగలుగుతారు. అయితే, మీరు వేరే యాప్‌లలో కూడా చెక్ చేయొచ్చు. అంటే, ప్రతి యాప్‌కు వేర్వేరు పరిమితి.

* షెడ్యూల్డ్ ఆటో-పేమెంట్ సమయ పరిమితి: ఆటోమేటిక్ చెల్లింపులు (AutoPay) కేవలం నిర్దేశిత సమయాల్లో మాత్రమే ప్రాసెస్ చేయబడతాయి. ఉదయం 10 గంటల లోపు, మధ్యాహ్నం 1 నుండి సాయంత్రం 5 వరకు, రాత్రి 9:30 తర్వాత చెల్లించాలి.

- త్వరిత లావాదేవీ ఫలితాలు:

ఒక లావాదేవీ ఫెయిల్ అయినా లేదా సక్సెస్ అయినా.. ఫైనల్ స్టేటస్ కొన్ని సెకన్లలో యాప్‌లో కనిపించాలి. ఆలస్యం ఇక ఉండదు.

* లావాదేవీ స్టేటస్ చెక్ పరిమితి: పెండింగ్ లో ఉన్న లావాదేవీని గరిష్ఠంగా మూడు సార్లు మాత్రమే చెక్ చేయొచ్చు. ఒక్కో చెకింగ్ మధ్యన కనీసం 90 సెకన్ల గ్యాప్ ఉండాలి.

* లింక్ చేసిన ఖాతాల వీక్షణ పరిమితి: రోజుకు 25 సార్లు మాత్రమే మీరు మీ యాప్‌లో లింక్ చేసిన బ్యాంక్ ఖాతాల లిస్టును చూడగలుగుతారు.

* రివర్సల్ రిక్వెస్ట్ పరిమితి: ఒక నెలలో 10 రివర్సల్ (పేమెంట్ తిరిగి అడగటం) రిక్వెస్ట్‌లు మాత్రమే పెట్టగలరు. ఒక సెండర్‌కు గరిష్ఠంగా 5 వరకే అవకాశం.

- లావాదేవీకి ముందు రిసీవర్ వివరాలు స్పష్టత:

పేమెంట్ చేయించే ముందు, రిసీవర్ బ్యాంక్ పేరు స్క్రీన్‌పై చూపించాల్సి ఉంటుంది. ఇది మోసాలు, పొరపాట్లు తగ్గించేందుకు ఉపయోగపడుతుంది.

* బ్యాంకులు, యాప్‌లపై కూడా పక్కాగా నియంత్రణ

NPCI జారీ చేసిన మరో నోటీసు ప్రకారం.. యూపీఐలను అదుపులో లేకుండా ఎక్కువగా వాడితే, లేదా తప్పుగా వాడితే, దానికి సంబంధించి కఠినంగా పర్యవేక్షణ ఉంటుంది. అవసరమైతే శిక్షలు విధించవచ్చు, యూపీఐ యాక్సెస్‌కే ఆంక్షలు పెట్టే అవకాశం ఉంది.

UPI సేవలను మరింత వేగంగా మెలుకువగా నిర్వహించేందుకు NPCI ఈ కొత్త మార్గదర్శకాలు తీసుకొస్తోంది. వినియోగదారుల భద్రతను పెంచడం, వ్యవస్థ పనితీరును మెరుగుపరచడం ఈ మార్పుల ప్రధాన ఉద్దేశ్యం.