ఆమెకు 35.. అతడికి 75.. పెళ్లైన పక్క రోజే చనిపోయాడు.. కారణం తెలిస్తే షాక్
అతడికి 75 ఏళ్లు. ఆమెకు 35 ఏళ్లు. పెద్ద వయసులో తోడు ఉండాలనుకోవటం సహజం. అయితే.. అంత వయసు గ్యాప్ ఉన్న మహిళతో పెళ్లా? అని కొందరు అనుకోవచ్చు
By: Garuda Media | 5 Oct 2025 11:30 AM ISTఅతడికి 75 ఏళ్లు. ఆమెకు 35 ఏళ్లు. పెద్ద వయసులో తోడు ఉండాలనుకోవటం సహజం. అయితే.. అంత వయసు గ్యాప్ ఉన్న మహిళతో పెళ్లా? అని కొందరు అనుకోవచ్చు. అయితే.. ఎవరి కారణాలు వారివి అన్నట్లుగా ఉండే పరిస్థితి. అయితే.. అలా పెళ్లి చేసుకున్న వారి సంఖ్య ఇటీవల వెలుగు చూస్తున్నాయి. ఇప్పుడు చెప్పే ఉదంతం రోటీన్ కు భిన్నమైనది. అంతేకాదు.. పోలీసుల విచారణలో వెలుగు చూసిన అసలు కారణం తెలిస్తే.. అవాక్కు అవ్వాల్సిందే.
ఉత్తరప్రదేశ్ కు చెందిన 75 ఏళ్ల పెద్ద మనిషి.. తన వయసు కంటే సగం కంటే తక్కువ అయిన 35 ఏళ్ల మహిళను పెళ్లాడాడు. వీరి పెళ్లి స్థానికంగా ఒక హాట్ టాపిక్ అయితే.. పెళ్లైన తర్వాతి రోజునే నవ వరుడు కన్నుమూయిటం మరింత షాక్ కు గురి చేసింది. మరింత వివరంగా చెప్పాల్సి వస్తే.. యూపీలోని జౌన్ పుర్ లోని కుచ్ ముఖ్ గ్రామానికి చెందిన 75 ఏళ్ల సంగ్రూ రామ్ మొదటి భార్య ఏడాది క్రితం మరణించింది.
వీరికి పిల్లలు లేకపోవటంతో ఒంటరిగా జీవిస్తున్నాడు. పొలం పనులు చేసుకుంటూ కాలం గడుపుతున్న ఆయనకు.. ఎవరో ఒక తోడు ఉండాలని భావించి అతడి కుటుంబ సభ్యులు 35 ఏళ్ల మన్ భువిని అనే మహిళతోఒక గుడిలో పెళ్లి చేశారు. ఇదంతా సెప్టెంబరు 29న జరిగింది. పెళ్లి చేసుకున్న తర్వాతి రోజున సంగ్రూ రామ్ ఆరోగ్యం క్షీణించటమేకాదు.. మరణించటం షాక్ కు గురి చేసింది.
తీవ్ర అనారోగ్యానికి గురి కావటంతో హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే చనిపోయినట్లుగా వైద్యులు చెప్పారు. దీంతో.. అతడి మరణంపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. సంగ్రూ రామ్ డెడ్ బాడీని పోస్టుమార్టంకు పంపారు. దీనికి సంబంధించిన రిపోర్టు తాజాగా వెలుగు చూడటంతో అసలు విషయం బయటకు వచ్చింది.
సెరిబ్రోవాస్కులర్ యాక్సిడెంట్ వల్ల మెదడులో రక్తస్రావం జరిగి మరణించినట్లుగా పోస్టుమార్టం రిపోర్టు తేల్చింది. ఇంతకూ ఇదేమంటారా? అక్కడికే వస్తున్నాం. మద్యం సేవించిన తర్వాత సెక్సు సామర్థ్యం పెంచే మందులు తీసుకోవటం వల్ల ఇలా జరుగుతుందని వైద్యులు వెల్లడించారు. సెక్సు సామర్థ్యాన్ని పెంచే మందుల్ని ఆల్కహాల్ తో తీసుకుంటే ఇలానే జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. దీంతో.. సంగ్రూ మరణంపై అనుమానం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యలు అసలు విషయం తెలుసుకొని ముక్కున వేలేసుకున్న పరిస్థితి. ఈ ఉదంతం ఇప్పుడు వైరల్ గా మారింది.
