Begin typing your search above and press return to search.

కోటి. 20 లక్షలు పలికిన నాణెం.. ఇది ఎక్కడంటే..?

నాణేల సేకరణ ఎంతటి విలువైన వ్యాపారమో చెప్పడానికి ఈ ‘యూనా అండ్ ది లయన్’ గోల్డ్ కాయిన్ నిలువెత్తు సాక్ష్యం.

By:  Tupaki Political Desk   |   13 April 2026 2:25 PM IST
కోటి. 20 లక్షలు పలికిన నాణెం.. ఇది ఎక్కడంటే..?
X

పాత సామాన్లలోనో లేదంటే పాత ఇళ్ల అటకల పైనో నిధులు దొరుకుతాయని కథల్లో వింటుంటాం కానీ, బ్రిటన్‌లో జరిగిన ఈ చూస్తుంటే అక్షరాలా నిజమనిపిస్తోంది. ఒక పాత ఇంట్లో అల్మారా మూలనో, పెట్టెలోనో పడి ఉన్న ఒక చిన్న నాణెం ఒక వ్యక్తి తల రాతను మార్చేసింది. నాణేల సేకరణ ఎంతటి విలువైన వ్యాపారమో చెప్పడానికి ఈ ‘యూనా అండ్ ది లయన్’ గోల్డ్ కాయిన్ నిలువెత్తు సాక్ష్యం.

వేలంలో ₹1.2 కోట్లు!

కేవలం ఐదు పౌండ్ల విలువ గల నాణేనికి రూ. కోటి ధర పలకడం అంటే అది మామూలు విషయం కాదు.. బ్రిటన్‌కు చెందిన ఒక వ్యక్తి తన పాత ఇంటిని శుభ్రం చేస్తున్న సమయంలో దొరికిన బంగారు నాణెం, అతడిని రాత్రికి రాత్రే కోటీశ్వరుడిని చేసింది. వేల్స్‌లో వెలుగు చూసిన ఈ అరుదైన నాణెం, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కాయిన్ కలెక్టర్ల దృష్టిని ఆకర్షించింది. చివరకు వేలంలో ఇది £110,000 (సుమారు ₹1.2 కోట్లు) పలికి అందరినీ ఆశ్చర్యపరిచింది.

నాణేల ప్రపంచంలో ఒక అద్భుతం

బ్రిటిష్ చరిత్రలోనే అత్యంత అందమైన నాణెంగా దీనికి గుర్తింపు ఉంది. ఈ నాణేన్ని 1839లో క్వీన్ విక్టోరియా పట్టాభిషేక జ్ఞాపకార్థం ప్రత్యేకంగా ముద్రించారు. నాణెం ఒక వైపు క్వీన్ విక్టోరియా ముఖచిత్రం ఉంటే, మరోవైపు ఆమె సింహాన్ని నడిపిస్తున్నట్లు (యూనా పాత్రలో) అద్భుతమైన కళాఖండం చెక్కబడి ఉంటుంది. దీనిని అప్పటి ప్రసిద్ధ కళాకారుడు విలియం వైన్ రూపొందించారు.

ఎందుకింత ధర..?

సాధారణంగా నాణేల విలువ వాటి లోహం కంటే వాటి ‘అరుదైన’ (Rarity) తనంపై ఆధారపడి ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి నాణేలు కేవలం 300 మాత్రమే ముద్రించబడ్డాయి. నాణేల సేకరణ చేసేవారు దీనిని ‘హోలీ గ్రెయిల్’ (అత్యంత అరుదైన, పవిత్రమైన నిధి)గా భావిస్తారు. ఇలాంటిది తమ దగ్గర ఉండడం ఒక గౌరవంగా ఫీలవుతారు. అందుకే వేలంలో దీనిని దక్కించుకోవడానికి పోటీ పడ్డారు.

ఈ ఘటన విన్న తర్వాత చాలా మంది తమ పాత పెట్టెలను, తాతల కాలం నాటి సంచులను వెతకడం మొదలుపెట్టారు. మన వద్ద కూడా పాత కాలం నాటి నాణేలు, స్టాంపులు ఉంటే వాటిని అజాగ్రత్తగా పారేయవద్దు.. చరిత్రను దాచుకున్న ప్రతి వస్తువుకూ ఏదో ఒక రోజు విలువ పెరుగుతుందనడానికి ఈ బ్రిటన్ నాణేమే ఉదాహరణ. ఆ పాత ఇంటి యజమానికి ఇది ఒక అద్భుతమైన బహుమతి. ఒక చిన్న బంగారు ముక్కకు అంతర్జాతీయ స్థాయిలో అంత గుర్తింపు లభించడం ఆశ్చర్యకరం. భౌతిక విలువ కంటే ఆ నాణెం వెనుక ఉన్న చరిత్ర, కళ దానికి అంతటి ధరను తెచ్చిపెట్టాయి.