యాంటీ ఏజింగ్ ఎక్స్‌పెరిమెంట్ సక్సెస్..సైన్స్ కూడా షాక్.. ఎలాగంటే?
యవ్వనంగా కనిపించాలని ఎవరికి ఉండదు? కానీ వయసు పెరగడం అనేది ప్రకృతి నియమం.
By: Madhu Reddy | 28 May 2026 10:55 AM ISTయవ్వనంగా కనిపించాలని ఎవరికి ఉండదు? కానీ వయసు పెరగడం అనేది ప్రకృతి నియమం. అయితే, సైన్స్ ఈ నియమాన్ని తిరగరాస్తోంది. తాజాగా బ్రిటన్ శాస్త్రవేత్తలు 53 ఏళ్ల మహిళ చర్మ కణాలను ఏకంగా 30 ఏళ్లు వెనక్కి నెట్టి, 23 ఏళ్ల యువతి కణాల్లా మార్చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. ముసలితనాన్ని జయించే దిశగా పడిన ఈ అడుగు, మెడికల్ హిస్టరీలోనే ఒక మైలురాయిగా మారబోతోంది. ఆ అద్భుత విశేషాలు మీకోసం...
జస్ట్ 13 రోజుల్లో మ్యాజిక్:
యూకేలోని బాబ్రహమ్ ఇన్‌స్టిట్యూట్ పరిశోధకులు ఈ అద్భుతాన్ని చేసి చూపించారు. ఇందుకోసం వారు 'యమనక ఫ్యాక్టర్స్' అనే ప్రత్యేక ప్రోటీన్లను ఉపయోగించారు. చర్మ కణాలు వాటి అసలు రూపాన్ని కోల్పోకుండా, కేవలం వాటి వయస్సును మాత్రమే రీసెట్ చేయడానికి ఈ రసాయనాలను కేవలం 13 రోజుల పాటు కణాలకు అందించారు. దీనినే సైన్స్ భాషలో 'పార్షియల్ సెల్యులార్ రీప్రోగ్రామింగ్' అంటున్నారు.
రిజల్ట్ చూసి సైంటిస్టులే షాక్:
ఇక ఈ ప్రయోగం తర్వాత ఆ కణాలు 23 ఏళ్ల యువతి కణాల వలె పనిచేయడం స్టార్ట్ చేశాయి. యవ్వనంలో ఉన్నట్లే చర్మాన్ని మెరిపించే 'కొల్లాజెన్'ను ఇవి విపరీతంగా ఉత్పత్తి చేశాయి. అంతేకాదు, చర్మంపై పడిన గాయాలను కూడా చాలా వేగంగా నయం చేశాయి.
ఇది టెంపరరీ కాదు.. పర్మనెంట్:
చాలామంది ఇది తాత్కాలికంగా వచ్చే మార్పు అనుకోవచ్చు. కానీ కొన్ని వారాల తర్వాత చూసినా ఆ కణాలు యంగ్ గానే బిహేవ్ చేశాయి. అంటే ఇది ఒక రకమైన 'బయోలాజికల్ రీసెట్'. ముఖానికి వేసుకునే క్రీములు, ఇంజెక్షన్ల లాంటి తాత్కాలిక సొల్యూషన్ కాదిది.
మరో డాక్టర్ అద్భుతం :
సైంటిస్టులు ల్యాబ్‌లో కణాల వయసును తగ్గిస్తుంటే.. లండన్‌కు చెందిన 53 ఏళ్ల డాక్టర్ అల్కా పటేల్ అనే డాక్టర్ మరో అడుగు ముందుకు వేశారు. ఆమె తన రోజువారీ విధానంలో మార్పులు చేసుకోవడం ద్వారా, తన శారీరక వయస్సును ఏకంగా 23 ఏళ్లకు తగ్గించుకున్నట్లు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. సరైన ఆహారం, జీవనశైలితో కూడా మన వయసును రివర్స్ చేసుకోవచ్చని ఆమె నిరూపించారు.
రోగాలకూ చెక్ పెట్టొచ్చు:
ఇది కేవలం అందం కోసం మాత్రమే కాదు.. భవిష్యత్తులో వృద్ధాప్యం వల్ల వచ్చే ఆర్థరైటిస్, అల్జీమర్స్, డయాబెటిస్ మరియు గుండె జబ్బులను నయం చేయడానికి కూడా ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు గట్టిగా నమ్ముతున్నారు.
ఇకపై ఏజ్ పెరగడం అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే కాబోతోంది. ముసలితనాన్ని తగ్గించే ఈ కొత్త సైన్స్ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే, మనుషులు మరింత కాలం ఆరోగ్యంగా, యంగ్ గా జీవించే రోజులు ఎంతో దూరంలో లేవని ఈ ఘటన సూచిస్తోంది.
