2 కోట్ల మందిపై 'ఆధార్' పిడుగు.. కార్డుల రద్దు
ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా దేశవ్యాప్తంగా 2 కోట్ల మందికి పైగా ప్రజల ఆధార్ కార్డులను రద్దు చేస్తు న్నట్టు యూనిఫైడ్ ఐడెంటిఫికేషన్ అధారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) తాజాగా సంచలన ప్రకటన చేసింది.
By: Garuda Media | 27 Nov 2025 12:05 PM ISTఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా దేశవ్యాప్తంగా 2 కోట్ల మందికి పైగా ప్రజల ఆధార్ కార్డులను రద్దు చేస్తు న్నట్టు యూనిఫైడ్ ఐడెంటిఫికేషన్ అధారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) తాజాగా సంచలన ప్రకటన చేసింది. దీంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ఈ వ్యవహారం చర్చకు వచ్చింది. దాదాపు 2.3 కోట్ల మంది ఆధార్ కార్డులను రద్దు చేస్తున్నట్టు వెల్లడించింది. వాస్తవానికి ఇప్పుడు ఏ అధికారిక కార్యక్రమానికైనా.. ఆధారే కీలక. పుట్టుక నుంచి మరణం వరకు.. అన్ని చోట్లా ఆధార్ అవసరం.
అలాంటి ఆధార్ కార్డులను ఏకమొత్తంగా 2.3 కోట్ల మందివి రద్దు చేస్తామని ప్రకటించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. దేశంలోని ఆధార్ డేటా బేస్.. ప్రపంచంలోనే అతి పెద్ద డేటా బేస్. అయితే.. దానిలో గత నాలుగేళ్లుగా అనేక అవకతవకలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో అనేక ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. ఇటీవల ఎన్నికల సమయంలోనూ ఒకే ఆధార్ నెంబరును పది మంది వరకు కలిగి ఉన్నారన్న విమర్శలు వచ్చాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ విషయాన్ని బలంగా చెప్పుకొచ్చారు.
ఈ క్రమంలో అలెర్ట్ అయిన యూఐడీఏఐ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో దాదాపు రెండు కోట్ల మందికి పైగా వ్యక్తుల ఆధార్‌లను రద్దు చేయాలని నిర్ణయించింది. దీనిలో ఎక్కువగా చనిపోయిన వ్యక్తులవే ఉన్నాయని యూఐడీఏఐ వెల్లడించింది. ఇదేసమయంలో ఒకే వ్యక్తికి రెండు ఆధార్ నెంబరు ఇచ్చినవి కూడా.. వేలల్లోనే ఉన్నట్టు సందేహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో సమాచారం పక్కాగా ఉన్నవారి ఆధార్‌పై క్లీన్-అప్ కార్యాక్రమానికి శ్రీకారం చుట్టింది.
ఏం చేస్తారు?
+ చనిపోయిన వారి ఆధార్ నెంబర్లను రద్దు చేస్తారు.
+ ఒకసారి రద్దు చేసిన ఆధార్ నంబర్‌ను ఇంకెవరికీ కేటాయించరు.
+ ఒక నెంబరును ఇద్దరికి కేటాయించిన వైనంపై ఆరా తీస్తారు.
+ సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటారు.
+ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా, రాష్ట్రాలు-కేంద్రపాలిత ప్రాంతాలు, ప్రజా పంపిణీ వ్యవస్థ, జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం వంటి కేంద్ర ప్రభుత్వ విభాగాల నుంచి ఆధార వినియోగంపై సమాచారం తీసుకుంటారు. దీని ప్రచారం చర్యలు చేపడతారు.
+ అయితే.అన్ని వివరాలు బాగున్నవారికి ఎలాంటి ఇబ్బందీ లేదని యూఐడీఏఐ స్పష్టం చేసింది.
