Begin typing your search above and press return to search.

ఎన్నో వివాదాలు.. ఆఖరికి డిజాస్టర్ గా నిలిచిన ఉదయపూర్ ఫైల్స్!

ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనంగా మారిన ఉదయపూర్ ఫైల్స్ సినిమా ఎట్టకేలకు థియేటర్లలో విడుదలైంది. కానీ ఈ సినిమాకి పెద్దగా ప్రేక్షకులు రాలేదు.

By:  Madhu Reddy   |   10 Aug 2025 2:27 PM IST
ఎన్నో వివాదాలు.. ఆఖరికి డిజాస్టర్ గా నిలిచిన ఉదయపూర్ ఫైల్స్!
X

ఉదయపూర్ ఫైల్స్.. ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పుడో విడుదల అవ్వాల్సిన ఈ సినిమా పలు కారణాలవల్ల వాయిదా పడుతూనే వస్తోంది. సెన్సార్ బోర్డు ఈ సినిమా నుండి 150 సీన్లను కట్ చేయడంతో.. ఈ విషయం కాస్త హాట్ టాపిక్ గా మారింది. దీనికి తోడు ముస్లిం సంఘాల నేతలు, సమాజ్ వాదీ పార్టీ అధినేతలు ఈ సినిమా విడుదలను ఆపివేయాలి అని డిమాండ్ చేశారు. ఈ సినిమాను విడుదల చేస్తే.. సమాజంలో శాంతిభద్రతలకు లోటు ఏర్పడుతుందని, ద్వేషాన్ని వ్యాప్తి చేసినట్లు అవుతుందని హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఇక అటు నిర్మాత అమిత్ జానీ కూడా పెద్ద ఎత్తున పోరాటం చేసి.. ఎట్టకేలకు 2025 ఆగస్టు 8న థియేటర్లలో రిలీజ్ చేశారు. ఎన్నో అవరోధాలు.. మరెన్నో వివాదాల మధ్య థియేటర్లలోకి వచ్చిన ఈ ఉదయపూర్ ఫైల్స్ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో ఇప్పుడు చూద్దాం..

ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనంగా మారిన ఉదయపూర్ ఫైల్స్ సినిమా ఎట్టకేలకు థియేటర్లలో విడుదలైంది. కానీ ఈ సినిమాకి పెద్దగా ప్రేక్షకులు రాలేదు. దీనికి తోడు పరిమిత ప్రదర్శనలు మాత్రమే లభించాయి. అలా మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద కేవలం రూ.25 లక్షల లోపే కలెక్షన్స్ వసూలు చేసింది అని నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా చూడడానికి ప్రేక్షకులు రాకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయని చెప్పాలి. ప్రమోషన్స్ లేకపోవడంతో చాలామందికి ఈ సినిమా విడుదలవుతోంది అనే విషయం కూడా తెలియలేదు. దీనికి తోడు వివాదాల మధ్య నలిగిపోయిన ఈ సినిమాను చూడడానికి చాలామంది ఆసక్తి కనబరచలేదు అనే వార్తలు వినిపిస్తున్నాయి.

అలాగే టైలర్ కన్హయ్యలాల్ తొలి కేస్ వివరాలు చాలా మందికి తెలియదు. అందుకే ఈ సినిమా చూడడానికి చాలామంది థియేటర్ కు వెళ్లలేదని వార్తలు వినిపిస్తున్నాయి.ఇకపోతే ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడానికి మరో కారణం కూడా ఉంది. ఇప్పటికే పాజిటివ్ టాక్ తో సన్నాఫ్ సర్దార్ 2, ధడక్ 2, సైయారా సినిమాలు దూసుకుపోతున్నాయి. అటు హాలీవుడ్ చిత్రాలు కూడా బాగానే కలెక్షన్లు వసూలు చేస్తున్నయి. వచ్చేవారం వార్ 2, కూలీ చిత్రాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం పోటీ అలాగే థియేటర్ పరిస్థితిని పరిగణలోకి తీసుకొని నిర్మాతలు కాస్త ఆలస్యంగా విడుదల చేసి ఉంటే బాగుండేదని, అనవసరంగా ఇన్ని మంచి చిత్రాల మధ్య ఈ సినిమాను రిలీజ్ చేసి డిజాస్టర్ మూటగట్టుకున్నారని పలువురు కామెంట్లు చేస్తున్నారు.

ఇదిలా ఉండగా ఈ సినిమా సామాజిక సామరస్యతను, దెబ్బతీస్తుంది అని మానసిక వేదనకు గురిచేస్తుంది అని బాధితుడి కుటుంబం కూడా అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఇటు విడుదల ఆలస్యమైంది. ఇక వీరు ఈ విషయాన్ని రాజస్థాన్ హైకోర్టు వరకు కూడా తీసుకెళ్లారు నిర్మాతలు స్టేను వ్యతిరేకించినప్పటికీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ వివాదాలను తగ్గించడానికి దాదాపు 150 కోతలు విధించింది. తర్వాత సుప్రీంకోర్టు గత నెలలో స్టే ఎత్తి వేస్తూ నిజమైన సంఘటనపై సినిమా తీయడం చట్ట విరుద్ధం కాదు అని తీర్పు చెప్పింది. ఇక మీడియా దృష్టిని విపరీతంగా ఆకర్షించిన ఈ ఉదయపూర్ ఫైల్స్ మూవీ మొదటి రోజు భారీ కలెక్షన్స్ వసూలు చేస్తుందని ఈ వివాదం కూడా సినిమా కలెక్షన్లకు దోహదపడుతుందని నిర్మాతలు భావించారు. కానీ ఈ సినిమా డిజాస్టర్ టాక్ ను తెచ్చుకోవడం గమనార్హం