Begin typing your search above and press return to search.

గ‌ల్ఫ్ దేశాల్లో కుప్ప‌కూలుతున్న రియ‌ల్ ఎస్టేట్..

ఇది గ‌ల్ఫ్ దేశాల‌కు కోలుకోలేని దెబ్బ‌. దీని తీవ్ర‌త ఇంకా ఎంత ఉండ‌బోతుందో తెలియ‌దు. కానీ ఏళ్ల క‌ష్టం ఒక్క యుద్దంతో క‌నుమ‌రుగ‌వుతోంది.

By:  A.N.Kumar   |   10 March 2026 4:01 PM IST
గ‌ల్ఫ్ దేశాల్లో కుప్ప‌కూలుతున్న రియ‌ల్ ఎస్టేట్..
X

ఇరాన్ -అమెరికా యుద్ధం గ‌ల్ఫ్ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. యుద్ధానికి కార‌ణం కాక‌పోయినా.. బాధితుల‌వుతున్న ప‌రిస్థితి గ‌ల్ఫ్ దేశాల‌ది. ఎన్నో ఏళ్ల శ్ర‌మ‌తో నిర్మించుకున్న పేరు, ఖ్యాతి తుడిచిపెట్టుకుపోతోంది. బిలియ‌నీర్లు, పెట్టుబ‌డిదారులు గ‌ల్ఫ్ దేశాల‌ను వ‌ద‌లుతున్నారు. స్థిర‌మైన దేశాల వైపు ప‌య‌నిస్తున్నారు. ఇది గ‌ల్ఫ్ దేశాల‌కు కోలుకోలేని దెబ్బ‌. దీని తీవ్ర‌త ఇంకా ఎంత ఉండ‌బోతుందో తెలియ‌దు. కానీ ఏళ్ల క‌ష్టం ఒక్క యుద్దంతో క‌నుమ‌రుగ‌వుతోంది.

గ‌ల్ఫ్ దేశాలను పెట్టుబ‌డిదారులు, బిల‌య‌నీర్లు సేఫెస్ట్ ప్రాంతంగా చూస్తారు. అందుకే ఎక్కువ‌గా పెట్టుబ‌డులు పెడ‌తారు. నివాసం ఏర్ప‌రుచుకుంటారు. వాస్త‌వంగా గ‌ల్ఫ్ దేశాల ఆర్థిక‌ నిర్మాణం ఆయిల్ ద్వారా జ‌రిగింది. ఆయిల్ తో వ‌చ్చిన ఆదాయాన్ని టూరిజం అభివృద్ధికి ఖ‌ర్చు చేశారు. టూరిజాన్ని అభివృద్ధి చేశారు. ఆ త‌ర్వాత ఫైనాన్స్ ను మ‌రో ఆదాయ మార్గంగా ఎంచుకున్నారు. టూరిజం అభివృద్ధి, గ‌ల్ఫ్ దేశాల్లో విదేశీయుల‌కు ఉన్న భ‌ద్ర‌త క‌ల‌గ‌లిపి గ‌ల్ఫ్ దేశాల‌ను భ‌ద్ర‌మైన ప్రాంతంగా మార్చాయి. ఫ‌లితంగా రియ‌ల్ ఎస్టేట్ పుంజుకుంది. విదేశీయులే ముఖ్యంగా గ‌ల్ఫ్ దేశాల రియ‌ల్ ఎస్టేట్ ఎదుగుద‌ల‌కు కార‌ణం. కానీ ఇప్పుడు ఆ రియ‌ల్ ఎస్టేట్ నేల‌చూపులు చూస్తోంది.

ఇరాన్ ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపు వెయ్యి డ్రోన్లు, మిసైళ్ల‌ను గ‌ల్ఫ్ దేశాల‌పై ప్ర‌యోగించింది. ఫ‌లితంగా ప్ర‌పంచంలోనే సేఫెస్ట్ ప్రాంతం ఒక్క‌సారిగా అశాంతి, అభ‌ద్ర‌త‌తో అల్లాడుతోంది. అబుదాబిలోని అల్-జుబైల్ లో ఫోర్ బెడ్ రూమ్ ఫ్లాట్ ధ‌ర రూ. 7.3 కోట్లు త‌గ్గిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. బిలియ‌నీర్లు, పెట్టుబ‌డిదార్లు గ‌ల్ఫ్ దేశాల‌కు ప్ర‌త్యామ్నాయంగా సింగ‌పూర్ ను ఎంచుకుంటున్నారు. ఇది గ‌ల్ఫ్ దేశాల భ‌విష్య‌త్తును దెబ్బ‌తీస్తుంద‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.

దాడుల కార‌ణంగా టూరిజం త‌గ్గుముఖం ప‌డుతుంది. ఫ‌లితంగా గ‌ల్ఫ్ దేశాలు ఆదాయాన్ని కోల్పోతాయి. మ‌రోవైపు విదేశీ వ‌ర్క‌ర్ల‌ను కూడా ప‌నుల్లో కొన‌సాగించ‌లేని ప‌రిస్థితి. వారిని కూడా సొంత దేశాల‌కు పంపాల్సి ఉంటుంది. ఇది కూడా గ‌ల్ఫ్ దేశాల మీద తీవ్ర ప్ర‌భావం చూపుతుంది. మొత్తంగా ఒక‌దాని త‌ర్వాత మ‌రొక‌టి యుద్ధం కార‌ణంగా ప్ర‌భావిత‌మ‌వుతాయి. యుద్ధం ఎక్కువ కాలం జ‌ర‌గ‌క‌పోవ‌చ్చు. కానీ గ‌ల్ఫ్ దేశాల‌కున్న పేరు, ఖ్యాతి మాత్రం చెరిగిపోయింది. ఇక ఎవ‌రూ.. గల్ఫ్ దేశాల‌ను సేఫెస్ట్ ప్రాంత‌మ‌ని అన‌లేరు. ఇరాన్, అమెరికా, ఇజ్రాయిల్ మ‌ధ్య యుద్ధానికి దారితీసే ప‌రిస్థితులు స‌మ‌సిపోనంత వ‌ర‌కు గ‌ల్ఫ్ దేశాల‌కు ఇరాన్ నుంచి ముప్పు త‌ప్ప‌దు. ఇరాన్ ముప్పు ఉన్నంత కాలం సేఫెస్ట్ ప్రాంతాలు కావు. యుద్ధం చేయ‌క‌పోవ‌డం గ‌ల్ఫ్ దేశాల అడ్వాంటేజ్. అయితే యుద్ధానికి బాధితుల‌య్యి త‌మ‌కున్న రెప్యూటేష‌న్ ను గ‌ల్ఫ్ దేశాలు కోల్పోవ‌ల‌సి వ‌స్తోంది. ఒక్కోసారి అడ్వాంటేజ్ కూడా డిస్ అడ్వాంటేజ్ గా మారుతుంద‌ని చెప్ప‌డానికి గ‌ల్ఫ్ దేశాలే ఉదాహ‌ర‌ణ‌. యుద్ధానికి దూరంగా ఉండి సేఫెస్ట్ ప్రాంతంగా పేరు తెచ్చుకుని, పెట్టుబ‌డులు తీసుకొచ్చిన గ‌ల్ఫ్ దేశాల‌కు.. అదే మైన‌స్ గా మారింది.