Begin typing your search above and press return to search.

ఒక్క రోజు మాత్రమే.. విజయ్ సీఎం అవుతారా ?

తమిళనాడులో రాజకీయ పరిణామాలు చూస్తే వేగంగా మారిపోతున్నాయి. అతి పెద్ద పార్టీగా అవతరించిన టీవీకేని గవర్నర్ ఆహ్వానించలేదు.

By:  Satya P   |   7 May 2026 10:30 AM IST
ఒక్క రోజు మాత్రమే.. విజయ్ సీఎం అవుతారా ?
X

తమిళనాడులో రాజకీయ పరిణామాలు చూస్తే వేగంగా మారిపోతున్నాయి. అతి పెద్ద పార్టీగా అవతరించిన టీవీకేని గవర్నర్ ఆహ్వానించలేదు. అయితే ఆ పార్టీ అధినేతగా విజయ్ తానే గవర్నర్ ని వెళ్ళి కలిసారు. కానీ మ్యాజిక్ ఫిగర్ అయిన 118 నంబర్ కి సరిపడా విజయ్ కి ఎమ్మెల్యేల బలం లేనందువల్ల గవర్నర్ సంతృప్తి చెందలేదని వార్తలు వినిపిస్తున్నాయి. దాంతో మే 7న విజయ్ సీఎం గా ప్రమాణం చేస్తారు అని పెద్ద ఎత్తున జరిగిన ప్రచారం ఆగిపోయింది. అదే సమయంలో విజయ్ ప్రమాణ స్వీకారానికి జరుగుతున్న ఏర్పాట్లు కూడా నిలిచిపోయాయి. మొత్తం మీద తమిళనాడు రాజకీయ వాతావరణంలో ఒక అనిశ్చితి అయితే ఏర్పాడింది.

డెడ్ లైన్ పెట్టారా :

ఇక గవర్నర్ ని లోక్ భవన్ లో విజయ్ కలసిన సందర్భంగా ఆయనకు గవర్నర్ ఏమైనా డెడ్ లైన్ పెట్టారా అన్న దాని మీద కూడా చర్చ సాగుతోంది విజయ్ కి 118 మంది ఎమ్మెల్యేలతో మెజారిటీ నిరూపించుకునేందుకు ఒక్క రోజు మాత్రమే గవర్నర్ వ్యవధి ఇచ్చారని ప్రచారం సాగుతోంది. అంటే మే 7వ తేదీ మాత్రమే అన్న మాట. ఈ డేట్ మారితే విజయ్ ఫేట్ ఏ విధంగా మారుతుంది అన్నది కూడా ఊహించలేని విధంగా ఉంది అని అంటున్నారు. విజయ్ కి అచ్చంగా మరో ఆరుగురు ఎమ్మెల్యేల మద్దతు కావాలి చిన్న పార్టీలని తన వైపునకు తిప్పుకుని మద్దతు తెచ్చుకోవడం అంటే డెడ్ లైన్ లోగా కుదురుతుందా అన్నదే అతి పెద్ద ప్రశ్నగా ఉంది.

అతి పెద్ద పార్టీ అయినా :

ఇక అతి పెద్ద పార్టీలని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ పిలవడం ఒక సంప్రదాయంగా ఉన్నా గతంలో చాలా సందర్భాలలో అలా అధికారం చేపట్టిన వారు మూడు నాళ్ల ముచ్చటగా తమ బలాన్ని అసెంబ్లీలో నిరూపించుకోలేక రాజీనామా చేశారు. దాంతో అటువంటి పరిస్థితి ఎందుకు అన్న భావనతోనే తమిళనాడు గవర్నర్ ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. ఎక్కడైనా ప్రభుత్వం ఏర్పాటు విషయంలో గవర్నర్ కే పూర్తి అధికారాలు ఉంటాయి. గవర్నర్ సంతృప్తి చెందితేనే ఎవరైనానా ప్రభుత్వం ఏర్పాటు చేయమని కోరుతారు. అందువల్ల విజయ్ మెజారిటీ విషయంలో గవర్నర్ ఆలోచిస్తున్నారు అన్నది కూడా ఉంది. అయితే మెజారిటీ సంపాదించడానికి ముందు ప్రభుత్వం ఏర్పాటు చేయిస్తే ఆటేమేటిక్ గా అంతా మారుతుందని అంటున్న వారు ఉన్నారు. అయితే అది రాయబేరాలకు దారి తీస్తుంది అన్న చర్చ కూడా ఉంది.

స్వచ్చందంగానే :

దీంతోనే స్వచ్చందంగా విజయ్ టీవీకేకు ఎంత మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తున్నారు అన్నది చూడాల్సి ఉందని అంటున్నారు. కాంగ్రెస్ అయితే తానుగా వచ్చి మద్దతు ఇచ్చింది. అలా మిగిలిన పార్టీలు కూడా వచ్చి మ్యాజిక్ ఫిగర్ కి చేరువ అయితే ఏ ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ఏర్పాటుకు గవనర్ ఆహ్వానించవచ్చు. అయితే బొత్తిగా మరీ ఒక్క రోజే డెడ్ లైన్ పెడితే మాత్రం అతి కొద్ది సమయంలో మెజారిటీకి సరిపడ ఎమ్మెల్యేలను విజయ్ సమకూర్చుకోగలరా అన్నదే పెద్ద ప్రశ్న. ఏది ఏమైనా విజయ్ గవర్నర్ ఇచ్చిన గడువులోగా తన బలాన్ని నిరూపించుకోకపోతే ఏమవుతుంది అన్నది మరో చర్చ. అపుడు మిగిలిన పక్షాలు గవర్నర్ ని కలసి తమ బలాన్ని చూపించి ప్రభుత్వం ఏర్పాటుకు కోరవచ్చు. లేదా గవర్నర్ కేంద్రానికి పరిస్థితి నివేదించి రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయవచ్చు అని అంటున్నారు.