Begin typing your search above and press return to search.

దళపతి విజయ్ అరెస్ట్ ఖాయం ?

ఇంతకు ముందు విజయ్ నిర్వహించిన మధురై సభ ఉదందం కళ్ళ ముందే ఉంది. ఆనాడు కూడా ఈ విధంగానే కిక్కిరిసిన విధంగా జనాలు వచ్చారు.

By:  Satya P   |   28 Sept 2025 9:08 AM IST
దళపతి విజయ్ అరెస్ట్ ఖాయం ?
X

తమిళనాడు రాజకీయాల్లో సునామీలా దూసుకుని వస్తున్న టీవీకే అధ్యక్షుడు దళపతి విజయ్ అరెస్ట్ ఖాయమా అంటే అవును అని అంటున్నారు. ఆయన కరూర్ లో నిర్వహించిన భారీ సభ లక్షలాది జనాల మధ్య సాగింది. ఈ సభకు నేల ఈనిందా ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా జనాలు తరలి వచ్చారు. దాంతో ఈ సభ జన ప్రభంజనాన్నే సృష్టించింది. ఇక విజయ్ భారీ ర్యాలీగా వచ్చి కరూర్ సభకు హాజరయ్యారు. ఆయన సభలోకి ప్రవేశించి ప్రసంగిస్తూండగానే ఒక్కసారిగా తొక్కిసలాట ఏర్పడింది. దాంతో ఒకరి మీద ఒకరు పడిపోయి ఊపిరాడని పరిస్థితుల నేపధ్యంలో పదుల సంఖ్యలో ఒక్కసారిగా ప్రాణాలు కోల్పోయారు. ఒకరూ ఇద్దరూ కాదు ఏకంగా 39 మంది మరణించడం మరింత మంది పరిస్థితి విషమంగా ఉండడంతో మరణాల సంఖ్య పెరుగుతుంది అని భావిస్తున్నారు.

మధురై ఉదంతం ఉండగానే :

ఇంతకు ముందు విజయ్ నిర్వహించిన మధురై సభ ఉదందం కళ్ళ ముందే ఉంది. ఆనాడు కూడా ఈ విధంగానే కిక్కిరిసిన విధంగా జనాలు వచ్చారు. ఆనాటి సభలో ఒకరు మృతి చెందారు. మరి దానిని గమనంలోకి తీసుకుని భారీగా ఏర్పాట్లు చేసుకోవాల్సింది అని అంటున్నారు. అంతే కాదు జనాలను కంట్రోల్ చేయలేకపోతే అతి పెద్ద సభా ప్రాంగణాన్ని అయినా ఎంచుకోవాల్సి ఉందని అంటున్నారు. కానీ ఇరుకు ప్రాంతంలో మీటింగులు పెట్టడం వల్లనే ఇలాండి దురాగతాలు జరుగుతున్నాయని అంటున్నారు.

అరెస్టు చేస్తారా :

ఇదిలా ఉంటే టీవీకే అధ్యక్షుడుగా ఉన్న విజయ్ ని బాధుడిగా చేస్తూ ఈ మరణాల మీద అరెస్ట్ చేసే అవకాశం ఉందా అన్న చర్చ అయితే సాగుతోంది. దానికి ఒక కారణం ఉంది. గత ఏడాది డిసెంబర్ లో వచ్చిన పుష్ప 2 సినిమా ప్రీమియం షో కోసం ర్యాలీగా సినీ హీరో అల్లు అర్జున్ వచ్చారని ఆ కారణంగా జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మరణించింది అని హీరోను అరెస్ట్ చేశారు ఇక్కడ చూస్తే ఏకంగా 34 మంది దాకా మృత్యు వాత పడ్డారు. దాంతో విజయ్ ని అరెస్ట్ చేస్తారు అని అంటున్నారు.

విచార వదనంతోనే :

ఇక కరూర్ సభను మధ్యలోనే ముగించించుకుని చెన్నై వచ్చేందుకు విజయ్ విమానాశ్రయానికి వచ్చారని చెబుతున్నారు. అయితే ఆయనను మీడియా ఇదే విషయం మీద ప్రశ్నించగా ఆయన నుంచి మౌనమే జవాబుగా వచ్చింది. తీవ్ర విచారంలో ఉన్న విజయ్ తన నివాసానికి చేరుకున్నారు అని అంటున్నారు. అయితే ఈ ఘటన మీద ప్రాధమిక నివేదిక కోరిన స్టాలిన్ ప్రభుత్వం ఆ నివేదిక వచ్చిన తరువాతనే తగిన చర్యలు తీసుకుంటుంది అని అంటున్నారు.

అన్నీ ఆలోచించాకనే :

విజయ్ ని అరెస్ట్ చేయడం అన్నది పెద్ద అంశంగా ఉంటుందని అంటున్నారు. ఆయన వెండి తెర మీద దళపతి, రాజకీయంగా చూస్తే జనాల్లో ప్రజా నాయాకుడిగా ఉన్నారు. ఆయనను అరెస్ట్ చేస్తే వచ్చే సానుభూతి కూడా ఒక సునామీలాగానే ఉంటుంది. అందువల్ల రాజకీయంగా చాణక్యుడు అయిన స్టాలిన్ ఈ విషయంలో తొందర పడరని అంటున్నారు. టీవీకేకి చెందిన స్థానిక బాధ్యులను అరెస్ట్ చేసి టీవీకే సభల మీద పూర్తి నియంత్రణ పెట్టే అవకాశాలు సైతం ఉంటాయని అంటున్నారు. ఇక విజయ్ ఇప్పటిదాకా ఒంటరిగానే రాజకీయం చేస్తున్నారు. ఈ ఘటన తరువాత అధికార డీఎంకే విజయ్ పార్టీకి యాంటీగా ఏ నిర్ణయం తీసుకున్నా విపక్షాలు నుంచి ఆయనకు మద్దతు వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. అది ఆ మీదట తమిళనాడులో కొత్త రాజకీయ సమీకరణలకు సైతం దారి తీయవచ్చు అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.