ఎన్డీయే పొత్తు...తేల్చేసిన విజయ్
తమిళనాడులో ఎన్డీయే కూటమితో పొత్తు ఎట్టి పరిస్థితుల్లో ఉండదని టీవీకే అధిపతి విజయ్ స్పష్టం చేశారు.
By: Satya P | 14 March 2026 10:00 PM ISTతమిళనాడులో ఎన్డీయే కూటమితో పొత్తు ఎట్టి పరిస్థితుల్లో ఉండదని టీవీకే అధిపతి విజయ్ స్పష్టం చేశారు. త్వరలో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆయన చెబుతున్నారు. ఒక పొత్తుల విషయం వస్తే ఎన్డీయేతో కలిసే ప్రసక్తి ఉండదని కూడా క్లారిటీగా చెప్పేస్తున్నారు. అంటే పొత్తులు ఎవరితోనూ ఉండవని ఒక వైపు చెబుతూనే ఎన్డీయేతో అసలు ఉండదని కచ్చితంగా విజయ్ తేల్చేశారు అన్న మాట అని విశ్లేషిస్తున్నారు.
అవన్నీ పుకార్లు :
విజయ్ పార్టీ ఎన్డీయేలో చేరుతుందని ఈ మేరకు చర్చలు రాయబారాలు అన్నీ జరుగుతున్నాయని వస్తునన్వి ఒట్టి పుకార్లుగా టీవీకే పేర్కొంది. ఎన్డీయే తో పొత్తు మీద జరుగుతున్న ప్రచారం అంతా ఊహాగానాలు అని టీవీకే పార్టీ జనరల్ సెక్రటరీ నిర్మల్ కుమార్ ప్రకటించారు. అంతే కాదు తాము ఈ విషయాన్ని గతంలోనే స్పష్టంగా చెప్పామని ఆయన గుర్తు చేస్తున్నారు.
బీజేపీతో దూరం అందుకే :
బీజేపీతో టీవీకే పార్టీ దూరం పాటించడం ఎందుకు అన్న దానికి కూడా టీవీకే వివరణ ఇచ్చింది. తమ పార్టీకి టీవీకే సైద్ధాంతిక శత్రువు అని కూడా క్లియర్ కట్ గా చెప్పేస్తోంది. అందుకే ఆ పార్టీతో దూరం పాటిస్తున్నామని నిర్మల్ కుమార్ చెప్పారు. ఇక టీవీకే పార్టీ క్యాడర్ కానీ నాయకులు పార్టీ నుంచి అధికారిక ప్రకటన వస్తేనే నమ్మాలి కానీ ఈ తరహా ప్రచారాలను నమ్మరాదని ఆయన సూచించారు. దాంతో ఎన్డీయేతో విజయ్ పార్టీ జట్టు కడుతుందని వస్తున్న వార్తలను ఆ పార్టీ ఈ విధంగా క్లారిటీ ఇచ్చింది అని అంటున్నారు.
దీర్ఘకాలం వ్యూహాలు :
ఇదిలా ఉంటే విజయ్ పార్టీ టీవీకే ఎన్డీయేతో ఎందుకు చేతులు కలపడం లేదు అంటే దీర్ఘ కాల రాజకీయ వ్యూహాలే కారణం అని అంటున్నారు. ద్రవిడ వాదాన్ని నమ్ముకుని టీవీకేని ఏర్పాటు చేసినట్లుగా విజయ్ తొలి రోజులో చెప్పారు. దానికి పూర్తి వ్యతిరేక భావజాలం అయిన బీజేపీతో కలిస్తే టీవీకే ఇబ్బందుల్లో పడుతుందని ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. పైగా డీఎంకే సహా ప్రత్యర్ధుల నుంచి విమర్శలు వస్తాయని భావిస్తున్నారు అని అంటున్నారు.
అది తమకే లాభం అని :
మరో వైపు హంగ్ వచ్చేలా పరిస్థితులు ఉంటే అది తమకే లాభం అని కూడా అంచనా కడుతున్నారని అంటున్నారు. అందువల్ల పొత్తులు ఇపుడు కాకుండా ఎన్నికల అనతరం ఉంటే అపుడు చూసుకోవచ్చు అని ముందస్తు వ్యూహంలో భాగంగానే ఇలా చేస్తున్నారు అని అంటున్నారు. అయితే రాజకీయాల్లో చాలా జరుగుతూ ఉంటాయి. ఏవీ కొట్టి పారేయడానికి లేదని అంటారు. అందువల్ల ఈ ప్రకటన వెనక అసలు వ్యూహాలు ఏమిటి అన్నది కూడా వేచి చూడాల్సి ఉందని విశ్లేషణలు ఉన్నాయి.
