Begin typing your search above and press return to search.

టీవీలో ఎక్కువ‌గా చూసిన ఇండియ‌న్ సినిమాలివే!

సినీ అభిమానుల‌కు ఎవ‌రికైనా సినిమాను బిగ్ స్క్రీన్ పై చూడ‌ట‌మే ఇష్టం. కానీ అన్ని సినిమాల‌నూ థియేట‌ర్ల‌లో చూడ‌లేం.

By:  Sravani Lakshmi Srungarapu   |   20 Jan 2026 3:41 PM IST
టీవీలో ఎక్కువ‌గా చూసిన ఇండియ‌న్ సినిమాలివే!
X

సినీ అభిమానుల‌కు ఎవ‌రికైనా సినిమాను బిగ్ స్క్రీన్ పై చూడ‌ట‌మే ఇష్టం. కానీ అన్ని సినిమాల‌నూ థియేట‌ర్ల‌లో చూడ‌లేం. అలాంటి సిట్యుయేష‌న్స్ లో ఓటీటీలు మూవీ ల‌వ‌ర్స్ కు సాధార‌ణ మాధ్య‌మంలా మారింది. ఇప్పుడైతే ఓటీటీలు వ‌చ్చాయి కానీ ఒక‌ప్పుడు ప‌రిస్థితులు వేరేగా ఉండేవి. అప్ప‌ట్లో ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌లో చూడ‌ని సినిమాల‌ను కేవ‌లం టీవీల్లోనే చూడ‌టానికి వీలుండేది.

ఈ నేప‌థ్యంలోనే కొన్ని సినిమాల‌కు వ‌ర‌ల్డ్ టీవీ ప్రీమియ‌ర్ డేట్ ను అనౌన్స్ చేసిన‌ప్పుడు ఆడియ‌న్స్ దాని కోసం ఎంత‌గానో వెయిట్ చేసేవారు. ఏదైనా పెద్ద సినిమా వ‌స్తుందంటే ఆ ఉత్సాహం ఇంకాస్త ఎక్కువ‌గా ఉండేది. అలాంటి టైమ్ లో ఆ సినిమా హిట్టా ఫ్లాపా అనేది కూడా ఆడియ‌న్స్ ప‌ట్టించుకోరు. ఓటీటీలు వ‌చ్చిన‌ప్ప‌టికీ ఇప్పుడు కూడా ఈ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. ఓటీటీ స‌బ్‌స్క్రిప్ష‌న్ కొనుక్కోలేని వాళ్లు, త‌క్కువ ఖ‌ర్చులో త‌మ ఇంట్లో ఉండే టీవీలో సినిమాలు చూడ్డానికి ఆస‌క్తి చూపిస్తున్నారు. అలా టీవీ ప్రీమియ‌ర్స్లో పాపుల‌ర్ అయిన సినిమాలేంటో చూద్దాం.

అమితాబ్ బ‌చ్చ‌న్ హీరోగా ర‌మేష్ సిప్పీ ద‌ర్శ‌కత్వంలో వ‌చ్చిన క‌ల్ట్ యాక్ష‌న్ సినిమా షోలే మూవీకి ఆడియ‌న్స్ బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. షోలే మూవీ అంద‌రిలోనూ చాలా ప్ర‌జాదర‌ణ పొందింది. హ‌మ్ ఆప్కే హై కౌన్ సినిమాను కూడా ఆడియ‌న్స్ విప‌రీతంగా చూశారు. కంటెంట్ బావుంటే విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ఏమీ చేయ‌లేవ‌ని నిరూపించిన ఈ మూవీ, ఇప్ప‌టికీ టీవీలో వ‌స్తే ఆడియ‌న్స్ నాలుగు గంట‌ల పాటూ టీవీ ముందు కూర్చోవ‌డానికి రెడీ అవుతారు. ఇక ఎన్నో ప్రేమ‌క‌థ‌ల‌కు స్పూర్తిగా నిలిచిన‌ దిల్‌వాలే దుల్హ‌నియా లేజాయేంగే సినిమాను ముంబైలోని మ‌రాఠా మందిర్ లో ఎంతో మంది ఆడియ‌న్స్ ను ఎట్రాక్ట్ చేస్తూనే ఉంది.

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన బాహుబ‌లి సినిమాను కూడా ఆడియ‌న్స్ టీవీల్లో తెగ చూస్తున్నారు. రాజ్‌కుమార్ హిరానీ ద‌ర్శ‌క‌త్వంలో వచ్చిన 3 ఇడియ‌ట్స్ సినిమాను చూడ్డానికి కూడా ప్రేక్ష‌కులు చాలా ఉత్సాహంగా ఉంటారు. ఈ సినిమాకు మంచి ప్రేక్ష‌కాద‌ర‌ణ ద‌క్క‌డంతో పాటూ ఆడియ‌న్స్ ఈ మూవీలోని ప్ర‌తీ సీన్ ను గుర్తుంచుకుంటారు. ఇక మ‌సాలా సినిమాల‌కే బాగా డిమాండ్ ఉన్న రోజుల్లో రాకేష్ రోషన్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన క‌ర‌ణ్ అర్జున్ సినిమా పున‌ర్జ‌న్మ అనే అంశంపై తెర‌కెక్కింది. ఈ సినిమాలోని స్క్రీన్ ప్లే కు ఆడియ‌న్స్ ఫిదా అయ్యారు. అందుకే ఇప్ప‌టికీ టీవీలో ఎక్కువ మంది ఈ సినిమాను చూస్తున్నారు.

ఫ్లాప్ సినిమా అయిన‌ప్ప‌టికీ సూర్య‌వంశం సినిమాకు కూడా మంచి వ్యూయ‌ర్‌షిప్ ఉంది. సోనీ మ్యాక్స్ లో ప‌దే ప‌దే ఈ సినిమా రావ‌డంతో ఆడియ‌న్స్ ఈ సినిమాకు అల‌వాటు ప‌డిపోయారు. పైగా ఈ మూవీలోని క్యారెక్ట‌ర్లు బాగా ఫేమ‌స్ కూడా అయ్యాయి. రాజ్‌కుమార్ హిరానీ ద‌ర్శ‌క‌త్వంలో ఆమిర్ ఖాన్ హీరోగా వ‌చ్చిన పీకే సినిమాకు కూడా టీవీల్లో మంచి ఆద‌ర‌ణే ఉంది. ఈ సినిమాను కొంద‌రు విమ‌ర్శించినా, ఆమిర్ ఖాన్ ను ట్రోల్ చేసినా, టెలివిజ‌న్ లో మాత్రం వ్యూయ‌ర్‌షిప్ పెరుగుతూనే ఉంది. నాగార్జున డాన్ నెం.1 సినిమాకు కూడా టీవీల్లో మంచి ఆద‌రణ ద‌క్కింది. ఈ సినిమా నాగ్ స్క్రీన్ ప్రెజెన్స్, పంచ్ డైలాగులు అంద‌రినీ ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి.

స‌న్నీ డియోల్, అనిల్ శ‌ర్మ కాంబినేష‌న్ లో వ‌చ్చిన గ‌ద‌ర్ సినిమాకు కూడా టెలివిజ‌న్ లో మంచి ఫేమ్ ద‌క్కింది. ఈ మూవీలోని హ్యాండ్ పంప్ సీన్ కు ఉన్న క్రేజ్ ఇప్ప‌టికీ సినీ ఇండ‌స్ట్రీలో డిస్క‌ష‌న్ పాయింటే. ఇక నాగార్జున మ‌రో సినిమా మేరీ జంగ్ మూవీని కూడా ప్రేక్ష‌కులు విప‌రీతంగా చూశారు. డ‌బ్బింగ్ సినిమా అయిన‌ప్ప‌టికీ ఈ మూవీలోని ఎమోష‌న్స్, మాస్ ఎలిమెంట్స్ కార‌ణంగా ఆడియ‌న్స్ మేరీ జంగ్ ను తెగ చూశారు. అనిల్ క‌పూర్, నానా ప‌టేక‌ర్ న‌టించిన వెల్‌క‌మ్ సినిమా కూడా టెలివిజ‌న్ లో బాగా పాపుల‌రైన సినిమా. ఇప్ప‌టికీ ఆ సినిమాలోని సీన్స్ ను మీమ్స్ గా వాడుతున్నారు.

బాగ్బ‌న్ సినిమాపై ఎన్నో విమ‌ర్శ‌లు వ‌చ్చిన‌ప్ప‌టికీ ఈ సినిమాలోని మ్యూజిక్ మ‌రియు అమితాబ్, హేమ మాలిని ఫోన్ సంభాష‌ణ వ‌ల్ల ఈ మూవీని ఆడియ‌న్స్ ఎక్కువ‌గా చూశారు. జాయింట్ ఫ్యామిలీ ప్ర‌ధానాంశంగా ఎలాంటి వ‌ల్గారిటీ లేకుండా క్లీన్ ఎంట‌ర్టైన‌ర్ గా తెర‌కెక్కిన హ‌మ్ సాత్ సాత్ హై మూవీని ఆడియ‌న్స్ బాగా ఆద‌రించారు. ఇక యాక్ష‌న్, గ్లామ‌ర్ సినిమాలు అప్పుడ‌ప్పుడే ఫేమస్ అవుతున్న టైమ్ లో వ‌చ్చిన వివాహ్ మూవీని కూడా టీవీల్లో ఎక్కువ‌గానే చూశారు. చెన్నై ఎక్స్‌ప్రెస్ మూవీకి కూడా టెలివిజ‌న్ లో విప‌రీత‌మైన ప్రేక్ష‌కాద‌ర‌ణ ఉంది. అయితే ఒక‌ప్పుడు లాగా ఇప్పుడు టెలివిజ‌న్ ప్ర‌జాద‌ర‌ణ లేక‌పోయినా, ఇప్ప‌టికీ ఓ వ‌ర్గం ఆడియ‌న్స్ టీవీ ప్రీమియ‌ర్ల కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు.