Begin typing your search above and press return to search.

తుర్కియే డెవలప్ చేసిన తాజా బాంబ్ లెక్క తెలిస్తే ఒళ్లు గగుర్పాటే

అందరికి సుపరిచితమైన పేరు టర్కీ. కానీ.. కొన్నేళ్లుగా ఆ దేశాన్ని తుర్కియే అన్న పేరుతో పిలవటం తెలిసిందే.

By:  Garuda Media   |   30 July 2025 10:35 AM IST
తుర్కియే డెవలప్ చేసిన తాజా బాంబ్ లెక్క తెలిస్తే ఒళ్లు గగుర్పాటే
X

అందరికి సుపరిచితమైన పేరు టర్కీ. కానీ.. కొన్నేళ్లుగా ఆ దేశాన్ని తుర్కియే అన్న పేరుతో పిలవటం తెలిసిందే. ఈ దేశం గురించి ఈ మధ్య వరకు భారతీయులకు ఒకలాంటి ఇమేజ్ ఉండేది. ఎప్పుడైతే ఆపరేషన్ సిందూర్ వేళ.. ఆ దేశం పాకిస్తాన్ కు దన్నుగా నిలవటమే కాదు.. ఓపెన్ గా భారత వ్యతిరేక విధానాల్ని చెప్పేందుకు వెనుకాడని తెంపరితనం చూసిన తర్వాత.. ఆ దేశం విషయంలో ఎంత అప్రమత్తంగా ఉండాలన్న విషయం అర్థమవుతుంది. శత్రువుకు అత్యంత సన్నిహితుడు మనకు అంతకు మించిన శత్రువు అన్న విషయం తెలిసిందే. ఈ లెక్కన టర్కీ సాధించే కొన్ని విజయాలు.. శాస్త్రీయ ఆవిష్కరణలు మన దేశ భద్రతకు ముప్పుగా మారే ప్రమాదం ఉంటుంది.

ఈ లెక్కన చూస్తే..

తాజాగా ఆ దేశం తాను డెవలప్ చేసిన ఒక బాంబ్ శక్తి సామర్థ్యాల్ని చూసినప్పుడు.. మనం వెంటనే అప్రమత్తం అవ్వాల్సిన అవసరాన్ని సూచిస్తాయని చెప్పాలి. అత్యంత శక్తివంతమైన నాన్ న్యూక్లియర్ బాంబ్ ను తాము డెవలప్ చేసిన విషయాన్ని తుర్కియే తాజాగా ప్రకటించింది. 970 కేజీల బరువు ఉండే ఈ బాంబ్ క్రియేట్ చేసే విధ్వంసం భారీగా ఉంటుంది.

ఆ దేశం

తమ 17వ అంతర్జాతీయ డిఫెన్స్ ఇండస్ట్రీ ఫెయిర్ లో భాగంగా ఈ సరికొత్త బాంబ్ గురించిన సమాచారాన్ని ప్రపంచానికి అధికారికంగా అందజేసింది. నాన్ న్యూక్లియర్ బాంబ్ గా చెప్పే దీనికి ‘గాజాప్’ అనే పేరు పెట్టారు. దీని బరువు ఇంతకు ముందే చెప్పినట్లు 970 కేజీలు (అంటే ఒక టన్ను కంటే తక్కువ) అయినప్పటికి.. అది క్రియేట్ చేసే విధ్వంసం 10 వేల ఫ్రాగ్మెంట్లుగా ఉంటుందని చెబుతున్నారు. ఈ బాంబ్ ను ప్రయోగించిన చోట సుమారు కిలోమీటర్ వరకు విధ్వంసాన్ని క్రియేట్ చేసే వీలు ఉంటుందని చెబుతున్నారు.

ఈ బాంబ్ ఎంత పవర్ఫుల్ అంటే

ఈ బాంబ్ ఫ్రాగ్మెంటేషన్ డెన్సిటీ సాధారణ ఎంకే బాంబ్ కంటే మూడు రెట్లు అధికమని.. దీన్ని ఫైటర్ జెట్లలో వాడే వీలుందని చెబుతున్నారు. సమీప భవిష్యత్తులో దీన్ని డ్రోన్ల ద్వారా కూడా ప్రయోగించే అవకాశం ఉందని చెప్పొచ్చు. తాను తయారు చేసిన విధ్వంసకర గాజాప్ బాంబ్ తో పాటు..అత్యంత శక్తివంతమైన బంకర్ బస్టర్ ను కూడా తయారు చేసిన విషయాన్ని టర్కీ వెల్లడించింది. ఈ బంకర్ బస్టర్ పేరు ‘‘హయాలెట్’’.

బంకర్ ని కూడా

బంకర్ లాంటి భూగర్భంలో లోతైన లక్ష్యాల్ని సైతం చొచ్చుకుపోయేలా రూపొందించారని చెబుతున్నారు. హయాలెట్ ను ఎన్ ఈబీ1, ఎన్ఈబీ 2గా కూడా పిలుస్తారు. దీని శక్తి ఎంతంటే ఉక్కుగోడల్లాంటి నిర్మాణాల్ని సైతం విధ్వంసం చేస్తుంది. ఇవన్నీ చూసిన తర్వాత రానున్న రోజుల్లో భారత్ కు పొంచి ఉన్న ముప్పు ఎంతన్న విషయంపై స్పష్టత మాత్రమే కాదు.. సరికొత్త ఆయుధాల్ని క్రియేట్ చేసుకోవటంతో పాటు.. అత్యంత శక్తివంతమైన ఆయుధాల అవసరం ఎంతన్నది ఇట్టే అర్థమవుతుంది. టర్కీ అమ్ములపొదిలోకి వస్తున్న సరికొత్త ఆయుధాలకు భారత్ కచ్ఛితంగా అలెర్టు కావాల్సిందే.