Begin typing your search above and press return to search.

తోటలో తాత తప్పుడు పనులు... పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు!

కొంతమందికి వయసు పెరిగా బుద్ది పెరగదని అంటారు. ఆ కోవకే చెందిన ఓ వ్యక్తి సుమారు ఆమె మనవరాలి వయసున్న ఓ మైనర్ బాలిక పట్ల ప్రవర్తించిన తీరు తీవ్ర వివాదాస్పదమైంది.

By:  Raja Ch   |   22 Oct 2025 5:43 PM IST
తోటలో తాత తప్పుడు పనులు... పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు!
X

కొంతమందికి వయసు పెరిగా బుద్ది పెరగదని అంటారు. ఆ కోవకే చెందిన ఓ వ్యక్తి సుమారు ఆమె మనవరాలి వయసున్న ఓ మైనర్ బాలిక పట్ల ప్రవర్తించిన తీరు తీవ్ర వివాదాస్పదమైంది. ఎనిమిదో తరగతి చదువుతున్న మైనర్ బాలికను సమీపంలోని తోటల్లోకి తీసుకెళ్లడం, అది జనం చూసి నిలదీయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇది స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

అవును... కాకినాడ జిల్లా తునిలో తాత వయసున్న ఓ వ్యకతి కీచక పర్వం వెలుగులోకి వచ్చి తీవ్ర సంచలనంగా మారింది. ఓ మైనర్‌ పట్ల సదరు నేత అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆయన బాగోతాన్ని గుర్తించిన స్థానికులు సదరు బాలికను రక్షించారు. ఆ సమయంలో స్థానికులతో సదరు వ్యక్తి తీవ్ర వాగ్వాదానికి దిగారు, ఆమెను మూత్ర విసర్జన కోసం తీసుకెళ్లానంటూ వాదించాడు.

వివరాళ్లోకి వెళ్తే... తునిలో ఓ వ్యక్తి.. తుని రూరల్‌ గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న మైనర్‌ పట్ల దారుణంగా ప్రవర్తించాడు! మైనర్‌ బాలికనును హస్టల్ నుండి తీసుకుని వెళ్ళి హంసవరం సపోటా తోటల్లో ఆమెను అసభ్యంగా తాకినట్లు చెబుతున్నారు. ఇంతలో ఇతడి బాగోతాన్ని స్థానికులు గుర్తించారు.

వెంటనే అతడిని పట్టుకుని, మైనర్‌ బాలికనును రక్షించారు. ఈ క్రమంలో అతడిని నిలదీయగా.. మూత్ర విసర్జన కోసం అక్కడికి బాలికను తీసుకువచ్చానని చెబుతూ.. దురుసుగా ప్రవర్తించాడు! అయితే, హాస్టల్ నుంచి బాలికను బయటకు తీసుకువెళ్లడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ ఘటనపై పెద్దాపురం డీఎస్పీ శ్రీహరి రాజు స్పందించారు. తుని రూరల్ లో మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తిపై పోక్సో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. సదరు బాలికకు మాయమాటలు చెప్పి వేధించినట్లు పేర్కొన్నారు. ఈ విషయంపై స్కూల్ కి వెళ్లి విచారించినట్లు తెలిపిన డీఎస్పీ.. పోక్సో తో పాటు కిడ్నాప్ కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. బాధిత బాలికను మెడికల్‌ పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు!

బాలిక తండ్రి ఇప్పటికే మృతి చెందగా.. తల్లి రోజువారీ కూలీగా పని చేస్తూ జీవనం సాగిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఆ కుటుంబాన్ని ఆర్థికంగా సహాయం చేస్తాననే పేరుతో.. అతడు తరచుగా బాలిక ఇంటికి వస్తుండేవాడని.. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఒకరోజు బాలికను తోటలోకి తీసుకెళ్లి.. అఘాయిత్యానికి ప్రయత్నించాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి!

స్పందించిన మంత్రి నారా లోకేష్!:

ఈ ఘటనపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఇందులో భాగంగా... తుని రూరల్ గురుకుల పాఠశాల విద్యార్థినిపై తాటిక నారాయణరావు అనే కామాంధుడు అత్యాచార యత్నానికి పాల్పడినట్లు తెలుసుకొని షాక్ కు గురైనట్లు చెప్పిన లోకేష్.. సంఘటన వివరాలు తెలిసిన వెంటనే పోలీసులు అతడిపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు.

ఇటువంటి ఘటనలకు పాల్పడే వాడెవరైనా ఉక్కుపాదంతో అణచివేస్తామని.. బాధితురాలు ధైర్యంగా ఉండేలా కౌన్సిలింగ్ ఇచ్చి, అన్నివిధాలా సహాయ, సహకారాలు అందిస్తామని తెలిపారు. ఇదే క్రమంలో... గురుకుల పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలో చదువుకునే విద్యార్థినులకు పటిష్టమైన భద్రత కల్పించాల్సిందిగా అధికార యంత్రాంగానికి ఆదేశాలు ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు.