అమెరికాకు పెను ముప్పు తెచ్చే దేశం అదేనా ?
అగ్ర రాజ్యం అని మిడిసిపాటుతో అమెరికా చేసే చర్యలు చాలా సార్లు బూమరాంగ్ అవుతూ ఉంటాయి. అయినా ఆ దేశం మాత్రం తన పెత్తందారీ పోకడలను వీడదని అంటారు.
By: Satya P | 21 March 2026 9:30 AM ISTఅగ్ర రాజ్యం అని మిడిసిపాటుతో అమెరికా చేసే చర్యలు చాలా సార్లు బూమరాంగ్ అవుతూ ఉంటాయి. అయినా ఆ దేశం మాత్రం తన పెత్తందారీ పోకడలను వీడదని అంటారు. అంతే కాదు శత్రువులను మిత్రులుగా చూడడం మిత్రులను దూరం చేసుకోవడం అమెరికాకు వెన్నతో పెట్టిన విద్య అని అంటారు ఇపుడు ఎవరో ఏదో చెప్పింది కాదు ఏకంగా ఇక ఇంటెలిజెన్స్ రిపోర్టు అయితే అమెరికాకు ఫ్య్హూచర్ లో భారీ అణు ముప్పు పొంచి ఉందని స్పష్టంగా చెబుతోంది. దాంతో అగ్ర రాజ్యం కకావికలు అవుతోంది. ఇంతకీ ఆ దేశం ఏ పెద్ద దేశమో కాదు అమెరికా తాను స్వయంగా పెంచి పోషిస్తున్న దేశమే. ఒక చిన్న దేశమే అమెరికా పాలిట పెను గండంగా మారబోతోంది అని ఇంటెలిజెన్స్ నివేదిక అంటోంది.
ఇరాన్ తో యుద్ధం :
నిజానికి ఇరాన్ నుంచి అణు ప్రమాదం పొంచి ఉందని చెబుతూ అమెరికా యుద్ధం చేస్తోంది. కానీ అసలైన ముప్పు తన పక్కనే ఉంది అని అమెరికా గమనించలేక పోతుంది అని అంటున్నారు. ఈ ప్రపంచంలో అతి కొద్ది దేశాలకు మాత్రమే అణు ఆయుధాలు ఉన్నాయి. అందులో చైనా రష్యాలను అమెరికా తన నిఘా నేత్రాలతో చూస్తూ ఉంటుంది. అంతే కాదు ఉత్తర కొరియా మీద అమెరికా ఫోకస్ ఉంది. అయితే ఇవేమీ కాకుండా అసలు అమెరికా ఆలోచనలో సైతం లేని ఒక దేశం ఉంది. అదే పాకిస్థాన్. అవును పాకిస్థాన్ వద్ద అణు ఆయుధాలు ఉన్నాయి. ఉంటేనేంటి మేము చెప్పినట్లుగా వింటోంది కదా మన దేశమే అని అమెరికా అనుకుంటోంది. కానీ అసలైన షాక్ ఇచ్చేది పాక్ అని అమెరికా డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ ఒక ఘాటు నివేదికను బయటపెట్టింది.
దెబ్బకు దిమ్మదిరిగేలా :
అమెరికా మీద గురి పెట్టిన దేశాలు అంటే ఠక్కున రష్యా చైనా ఉత్తర కొరియా అని ఎవరైనా చెబుతారు. ఎందుకంటే ఈ దేశాలకు అమెరికా ఆధిపత్యం గిట్టదు కాబట్టి అని. ఇది బహిరంగ రహస్యం. అమెరికా సైతం ఈ దేశాలతో అలెర్ట్ గా ఉంటుంది. కానీ అమెరికాతో మంచిగా ఉంటూ చెప్పినట్లుగా విని తోకాడించే పాక్ ఏకంగా అగ్ర రాజ్యానికే గురి పెడుతోందా అంటే అమెరికా డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ తులసీ గబ్బార్డ్ అవును అదే నిజం అని అంటున్నారు. ఆమె ఏకంగా అమెరికన్ సెనేట్ ప్యానెల్ హియరింగ్‌లో అయితే అఫీషియల్ గానే నివేదిక రూపంలో ఇచ్చారని అంటున్నారు. అమెరికాకు అసలైన డేంజర్ పాక్ తోనే అణు ముప్పు అక్కడ నుంచే ఆ నివేదికలో తులసీ గబ్బార్డ్ పేర్కొన్నారు అని అంటున్నారు.
నమ్మిస్తూనే మోహరిస్తూ :
ఇక అమెరికా మిత్రురాలిగా ఉంటూ పాక్ తెగ నమ్మిస్తోంది అని ఆ నివేదిక చెబుతోంది. అదే సమయంలో అమెరికా చుట్టూ ఉన్న దేశాలలో చైనా తన సైన్యాన్ని మోహరిస్తోంది అని నివేదిక సంచలన విషయాలను వెల్లడిస్తోంది. ఇరాన్ వద్ద అణు సామర్థ్యం లేకపోయినా ఉందని యుద్ధానికి దిగిన అమెరికా అణ్వస్త్ర దేశం అయిన పాక్ ని విస్మరించడమే పెద్ద పొరపాటు అని నివేదిక హెచ్చరిస్తోంది అంటున్నారు.
పంచ్ ఇచ్చే పంచ దేశాలు :
ఇక అమెరికాకు భవిష్యత్తులో గట్టి షాక్ ఇచ్చే దేశాలుగా చూస్తే రష్యా చైనా ఉత్తర కొరియా, ఇరాన్, పాకిస్థా అని చెబుతున్నారు. ఇక వీటిలో అమెరికా పట్టించుకోని దేశం పాక్ గా ఉంది అయితే పాక్ వద్ద ఉన్న అణు సామర్థ్యం మామూలుగా లేదు, ఏకంగా మూడు వేలకు పైగా అణు క్షిపణులు ఉన్నాయి. ఇక వీటి సామర్థ్యం ఏకంగా 16 వెల కిలోమీటర్ల లక్ష్యానికి చేరుకునే విధంగా పాక్ ప్రయోగాలు చేస్తోంది. పూర్తి ఆధునాతన సాంకేతికతతో పాక్ అణు ఆయుధాలను లాంచ్ చేసే వ్యవస్థలను డెవలప్ చేస్తోంది అని అంటున్నారు. ఈ నివేదికలో సారాంశం చూశాక పాక్ తో భారీ షాక్ అని అమెరికా గట్టిగానే నమ్మేలా ఉంది అంటున్నారు.
పాక్ ని వాడుకుంటూ :
అమెరికా పాక్ ని వాడుకుంటూ తన శత్రువుల మీద ఆధిపత్యం చేయిస్తుంది ఆనాడు రష్యాని దెబ్బ తీయడానికి తాలిబాన్ లను ఆల్ ఖైదాలను ఉపయోగించుకుంది. ఇక భారత్ వంటి మిత్ర పక్షాన్ని పక్కన పెట్టి అనేక సందర్భాలలో పాక్ ని అమెరికా వెనకేసుకుని వచ్చింది పాక్ ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్న వేళ భారీగా అంతర్జాతీయ సంస్థల నుంచి అప్పులు ఇప్పించి ఆదుకుంది. అమెరికా వ్యూహం ఏంటి అంటే చైనాని దెబ్బ తీయడానికి పాక్ అవసరం అనుకుంటోంది. కానీ పాక్ అయితే చైనాకూ సన్నిహితంగానూ ఉంటోంది.
శేత సౌధం తీవ్రంగా మధనం :
అంతే కాదు పాక్ లో ఉగ్ర మూకలు పెద్ద ఎత్తున ఉన్నాయి. అక్కడ అణు ఆయుధాలు ఉండడం అంటే పిచ్చోడి చేతిలో రాయి లాంటిది అని అంటారు ఇరాన్ నే శత్రువు అని అమెరికా భావిస్తోంది కానీ పాక్ వైపు నుంచి ముప్పు ఉందని భావించడం లేదని అంటున్నారు. మొత్తానికి అమెరికా చేస్తున్న ఈ విచిత్ర వింత స్నేహాలను పాక్ ఆసరాగా తీసుకుని అణు ఆయుధాలతో కనుక రేపటి రోజున ఎవరికి గురి పెడుతుందో అన్న చర్చ ఉంది. మొత్తానికి తులసీ గబ్బార్డ్ ఇచ్చిన నివేదిక మీద అయితే అమెరికా శేత సౌధం తీవ్రంగా మధనం చేస్తోంది అని అంటున్నారు.
