Begin typing your search above and press return to search.

పాక్ కు వింటర్ లో ముచ్చెమటలు... షాకింగ్ విషయం చెప్పిన టీటీపీ!

ఈ నేపథ్యంలో తాజాగా వారి నుంచి షాకింగ్ విషయం తెరపైకి వచ్చింది. ఇది వింటర్ లో పాక్ కు ముచ్చెమటలు పట్టించే విషయం అని పరిశీలకులు అంటున్నారు.

By:  Raja Ch   |   26 Dec 2025 5:00 PM IST
పాక్  కు వింటర్  లో ముచ్చెమటలు... షాకింగ్  విషయం చెప్పిన  టీటీపీ!
X

కత్తి పట్టినవాడు కత్తితోనే పొతాడు అన్నట్లుగా.. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ, భారత్ పైకి ఉసిగొల్పుతూ రాక్షసానందం పొందుతున్న పాకిస్థాన్ కు తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) అనే సంస్థ నుంచి నిత్యం థ్రెట్ ఉంటూనే ఉన్న సంగతి తెలిసిందే. రోజు రోజుకీ తొండ ముదిరి ఊసరవిల్లు అయినట్లు అన్నట్లుగా ఈ సంస్థ అభివృద్ధి చెందుతుంది! ఈ సమయంలో పాక్ కు ముచ్చెమటలు పట్టించే విషయం వెల్లడించింది!

అవును... ఓ పక్క భారత్ ను గిల్లుతూ, గట్టి దెబ్బలు తింటూ.. మరో పక్క ఆఫ్ఘన్ తోనూ కయ్యం పెట్టుకుని కంటి మీద కునుకు లేకుండా బ్రతుకుతున్న పాకిస్థాన్ కు పక్కలో బల్లెంలా తయారయ్యింది తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) సంస్థ. ఇటీవల ఈ సంస్థకు చెందిన కమాండర్ కాజిమ్... పాక్ ఆర్మీ చీఫ్ కు ఛాలెంజ్ విసిరిన సంగతి తెలిసిందే. నువ్వు మగాడివైతే, నీకు నిజంగా ధమ్ముంటే.. అంటూ వార్నింగ్ ఇచ్చారు.

ఇందులో భాగంగా... 'మాతో పోరాటం చేయడానికి పాకిస్తాన్‌ సైన్యం ఎందుకు?.. వారికి బదులుగా పాక్‌ సైన్యంలోని ఉన్నతాధికారులు యుద్ధభూమికి రావాలి. ప్రధానంగా... పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌ మునీర్‌ కు నిజంగా దమ్ముంటే, మాగాడే అయితే మమ్మల్ని ఎదుర్కోవాలి' అని ఆ వీడియోలో పేర్కొననారు. అక్కడితో ఆగని ఆ కమాండర్... మునీర్ నిజంగా తల్లి పాలే తాగి ఉంటే మాతో యుద్ధం చేయాలని సవాల్‌ విసిరారు.

ఈ స్థాయిలో పాకిస్థాన్ సైన్యానికి - తెహ్రీక్-ఇ-తాలిబన్ లకు మధ్య వార్ పీక్స్ కి చేరుతుంది. ఇది కేవలం మాటల వరకే కాదు సుమా.. ఇప్పటికే పాక్ సైన్యాన్ని పలు మార్లు గట్టి దెబ్బలు కొట్టింది టీటీపీ బ్యాచ్! దీంతో... ఎప్పటికైనా పాక్ ను ముక్కలు చేసేది ఈ గుంపే అనే కామెంట్లు వినిపిస్తుంటాయి. ఈ నేపథ్యంలో తాజాగా వారి నుంచి షాకింగ్ విషయం తెరపైకి వచ్చింది. ఇది వింటర్ లో పాక్ కు ముచ్చెమటలు పట్టించే విషయం అని పరిశీలకులు అంటున్నారు.

ఇందులో భాగంగా... వచ్చే ఏడాదిలో టీటీపీ వైమానిక దళాన్ని ఏర్పాటు చేసుకోబోతుందంటూ వెలిసిన సోషల్ మీడియా పోస్టులు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. 2026లో ఏర్పాటు చేసే వైమానిక దళానికి సలీం హక్కానీ నాయకత్వం వహిస్తారని వెల్లడించింది. దీంతోపాటు.. ప్రావిన్సుల వారీగా మొహరింపులు, సైనిక విభాగాలు సైతం ఏర్పాటు చేసే యోచనలో ఉందని అంటున్నారు. కొత్త పర్య్వేక్షణ జోన్ లను ఏర్పాటు చేయనున్నట్లు చెబుతున్నారు.

తద్వారా.. కశ్మీర్, గిల్గి-బాల్టిస్థాన్ సహా పలు ప్రావిన్సులను తమ ఆధీనంలోకి తీసుకోవాలని టీటీపీ ప్లాన్ చేస్తోందని చెబుతున్నారు. కాగా... పాకిస్థాన్ సైన్యంపై ఇప్పటికే పలుమార్లు టీటీపీ ఉగ్రవాదులు దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా స్పందించిన పాక్.. టీటీపీ ఆఫ్ఘాన్ నుంచి ఆపరేట్ అవుతుందని ఆరోపిస్తుంది. అయితే.. ఈ ఆరోపణలను ఆఫ్గాన్ ఖండిస్తుంది!