వివేక్ రామస్వామిని లేపుతోన్న ట్రంప్... రీజన్ ఇదే!
అవును... భారతీయ అమెరికన్ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి ఓహియో గవర్నర్ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన సంగతి తెలిసిందే.
By: Raja Ch | 8 Nov 2025 4:19 PM ISTగత ఏడాది జరిగిన ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరుపున అధ్యక్షుడి రేసులో ట్రంప్ తో పోటీ పడిన భారతీయ అమెరికన్ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి.. ఆ తర్వాత పోటీని విరమించుకుని, ట్రంప్ విజయం కోసం తీవ్రంగా శ్రమించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఆయనను ట్రంప్ ఆకాశానికెత్తేస్తున్నారు అతడు యంగ్, స్ట్రాంగ్, స్మార్ట్ అంటూ ప్రశంసించారు.
అవును... భారతీయ అమెరికన్ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి ఓహియో గవర్నర్ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన సంగతి తెలిసిందే. ప్రతిష్టాత్మకమైన డిపార్ట్ మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (డోజ్) బాధ్యతల నుంచి ఆయన తప్పుకోవడం వెనుక ఇదే అసలు కారణం అంటూ అప్పట్లో కథనాలొచ్చాయి. ఈ సమయంలో వివేక్ కు మద్దతుగా ట్రంప్ తాజాగా ఓ పోస్ట్ పెట్టారు.
ఇందులో భాగంగా... వివేక్ రామస్వామి ఓ ప్రత్యేకమైన వ్యక్తి అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియా పోస్ట్ లో పేర్కొన్నారు. 2026 ఓహియో గవర్నర్ రేసులో ఉన్న ఆయనకు తన మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా... ఓహియో గొప్ప రాష్ట్రమని చెప్పిన ట్రంప్.. రామస్వామి ఎన్నికైతే గొప్ప గవర్నర్ అవుతారని నొక్కి చెప్పారు.
ఇదే సమయంలో... వివేక్ రామస్వామి గ్రేట్ స్టేట్ ఆఫ్ ఓహియో గవర్నర్ పదవికి పోటీ చేస్తున్నారని.. తాను చాలా ఇష్టపడే ఈ ప్రాంతం నుంచి 2016, 2020, 2024లో మూడుసార్లు గొప్పగా గెలిచినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఈ రిపబ్లికన్ నాయకుడికి తన పూర్తి మద్దతు అందిస్తున్నట్లు ప్రకటించారు. రామస్వామి యంగ్, స్ట్రాంగ్ అండ్ స్మార్ట్ అని ట్రంప్ అభివర్ణించారు.
ఇదే క్రమంలో... మీ తదుపరి గవర్నర్ గా వివేక్... ఆర్ధిక వ్యవస్థను వృద్ధి చేయడానికి.. పన్నులు తగ్గించడానికి.. మేడ్ ఇన్ ది యూఎస్ ను ప్రోత్సహించడానికి.. సరిహద్దును సురక్షితంగా ఉంచడానికి.. వలస నేరాలు ఆపడానికి.. ఎన్నికల సమగ్రతను ముందుకు తీసుకెళ్లడానికి అవిశ్రాంతంగా పోరడతారని.. మిమ్మల్ని ఎప్పటికీ నిరాశపరచరని ట్రంప్ అన్నారు.
అయితే.... ఇటీవలి సంవత్సరాలలో సంప్రదాయవాద శిబిరం వైపు మొగ్గు చూపుతున్న రాష్ట్రంలో రామస్వామికి ట్రంప్ మద్దతు ఒక ప్రధాన ఆస్తిగా చెప్పవచ్చు. కాకపోతే.. ఇటీవలి పోల్ ప్రకారం డెమొక్రాట్ అభ్యర్థి, మాజీ రాష్ట్ర ఆరోగ్య డైరెక్టర్ అమీ ఆక్టన్ స్వల్ప తేడాతో ముందంజలో ఉన్నారు.
