Begin typing your search above and press return to search.

రష్యాతో యాపరం వద్దనే అమెరికా.. ఆ దేశంతో చేసే బిజినెస్ ఎంతంటే?

రష్యాతో వాళ్లు అసలు యాపారమే చేయట్లేదా? ఎదుటోడికి చెప్పేందుకే నీతులు ఉన్నాయన్నట్లుగా అగ్రరాజ్య తీరు చూస్తే..ట్రంప్ ముదురుతనం ఎంతన్నది ఇట్టే అర్థమవుతుంది.

By:  Garuda Media   |   6 Aug 2025 10:06 AM IST
రష్యాతో యాపరం వద్దనే అమెరికా.. ఆ దేశంతో చేసే బిజినెస్ ఎంతంటే?
X

రష్యా నుంచి కొనుగోలు చేస్తున్న ముడి చమురు కొనుగోళ్లను భారతదేశం తక్షణమే ఆపేయాలంటూ అమెరికా అదే పనిగా డిమాండ్ చేయటం.. తాజాగా ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ భారీ వార్నింగ్ ఇవ్వటం తెలిసిందే. రష్యా దగ్గర భారత్ చమురు కొంటే అగ్రరాజ్యానికి కలిగే నొప్పేంటి? ట్రంప్ చేసే వ్యాఖ్యల్లో పస ఉందా? అయినా.. భారత్ లాంటి సర్వసత్తాక ప్రజాస్వామ్య దేశాన్ని.. భారత సారభౌమత్వాన్ని సవాలు చేసేలా ట్రంప్ చేస్తున్ వ్యాఖ్యలు సరైనవేనా? అన్న సందేహం కలుగుతుంది. అదే సమయంలో భారత్ ను యాపారం.. ముఖ్యంగా ముడి చమురు కొనుగోలు చేయొద్దని చెప్పే అమెరికా అధ్యక్షుడు.. రష్యాతో వాళ్లు అసలు యాపారమే చేయట్లేదా? ఎదుటోడికి చెప్పేందుకే నీతులు ఉన్నాయన్నట్లుగా అగ్రరాజ్య తీరు చూస్తే..ట్రంప్ ముదురుతనం ఎంతన్నది ఇట్టే అర్థమవుతుంది.

ఉక్రెయిన్ తో రష్యా చేస్తున్న యుద్ధానికి భారత్ సహకరిస్తోందని.. ఆ దేశం వద్ద కొనే భారీ చమురుకొనుగోలు డబ్బులతో ఉక్రెయిన్ మీద విరుచుకుపడుతుందన్నది అగ్రరాజ్య అధినేత విశ్లేషణ. అందుకే.. భారత్ తక్షణమే రష్యా నుంచి చమురు కొనుగోళ్లు ఆపేస్తే.. రష్యా తమ దారికి వస్తుందన్నది ఆయన ఆలోచన. అయితే.. ట్రంప్ చెప్పారనో.. అగ్రరాజ్యం బెదిరింపులకు దిగిందనో చమురు దిగుమతుల్నిఆపేస్తే భారత్ కు జరిగే నష్టం భారీగా ఉంటుంది. అసలు.. రష్యా దగ్గర భారత్ ఏం కొనాలి? ఏం కొనకూడదన్న మాటను చెప్పేందుకు ట్రంప్ ఎవరన్న ప్రశ్న తరచూ తెర మీదకు వస్తోంది. ఆ అంశాన్ని పక్కన పెడితే.. భారత్ ను బెదిరిస్తున్న అగ్రరాజ్యం.. రష్యా నుంచి ఎలాంటి యాపారం చేయట్లేదా? అన్నది మరో ప్రశ్న.

ఈ అంశంపై మరింత లోతుకు వెళితే.. అమెరికా ద్వంద వైఖరి కనిపిస్తుంది. రష్యా నుంచి అమెరికా ఎరువులు.. పరిశ్రమల్లో వినియోగించే విలువైన పల్లాడియం ఖనిజమే కాదు.. యూరేనియం భారీగా కొనుగోలు చేస్తూ ఉంటుంది. వీటితో పాటు అల్యూమినియం లోహాన్ని కూడా భారీగానే కొనుగోలు చేస్తోంది. రష్యా నుంచి చౌకధరకు భారత్ భారీ ఎత్తున ముడి చమురుకొనుగోలు చేస్తోంది ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు చూస్తే.. 1.75 మిలియన్ బ్యారెల్స్ క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేసింది.గత ఏడాదితో పోలిస్తే ఇది కేవలం ఒక శాతం మాత్రమే ఎక్కువ.

రష్యా నుంచి భారత్ కు 2024లో దిగుమతి అయిన చమురు విలువ దగ్గర దగ్గర 51 బిలియన్ డాలర్లుగా చెప్పొచ్చు. మరోవైపు అగ్రరాజ్యం రష్యా నుంచి కొనుగోలు చేస్తున్న లోహాల విలువ దగ్గర దగ్గరగా ఆరు బిలియన్ డాలర్లుగాచప్పాలి. 2024తో పోలిస్తే 2025 మొదటి ఆర్నెల్లలో రష్యా నుంచి అమెరికా కొనుగోళ్ల పెరుగుదల 23 శాతం ఉండటం గమనార్హం. రష్యా నుంచి అమెరికా కొనుగోలు చేసే లోహాల విలువ సుమారు రూ.5 లక్షల కోట్ల వరకు ఉంటుంది. చెప్పేందుకే మాటలు అన్న చందంగా అగ్రరాజ్యం మాటలుఉంటాయని చెప్పొచ్చు. ప్రపంచ దేశాలకు నీతులు చెప్పే అమెరికా.. తన వరకు వచ్చేటప్పటికి మాత్రం.. తన ప్రయోజనాల కోసం రష్యా ఏంటి.. ఏ దేశంతో అయినా వ్యాపారం చేయటం కనిపిస్తుంది.