Begin typing your search above and press return to search.

ట్రంప్ తీరుతో అమెరికాకు రూ.61 వేల కోట్ల ఆదాయానికి గండి

ప్రతి పనికి ప్రతి చర్య ఒకటి ఉంటుందన్న విషయాన్ని మర్చిపోలేం. అమెరికాను అగ్రభాగాన నిలపటమే లక్ష్యమని తరచూ చెప్పుకునే ట్రంప్..అగ్రరాజ్యానికి పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకొచ్చేందుకు వీలుగా కఠిన చర్యల్ని తీసుకుంటున్నట్లుగా చెప్పటం తెలిసిందే.

By:  Garuda Media   |   1 Sept 2025 6:00 PM IST
ట్రంప్ తీరుతో అమెరికాకు రూ.61 వేల కోట్ల ఆదాయానికి గండి
X

ప్రతి పనికి ప్రతి చర్య ఒకటి ఉంటుందన్న విషయాన్ని మర్చిపోలేం. అమెరికాను అగ్రభాగాన నిలపటమే లక్ష్యమని తరచూ చెప్పుకునే ట్రంప్..అగ్రరాజ్యానికి పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకొచ్చేందుకు వీలుగా కఠిన చర్యల్ని తీసుకుంటున్నట్లుగా చెప్పటం తెలిసిందే. ట్రంప్ అనుసరిస్తున్నదరిద్రపుగొట్టు విధానాలతో అమెరికాకు రావాల్సిన ఆదాయంలో భారీగా గండి పడిన వైనం వెలుగు చూసింది.

అమెరికాలో ఉన్నత విద్యను అందించేందుకు వీలుగా విదేశీ విద్యార్థులకు ఎఫ్1 వీసా అనుమతులు జారీ చేయటం తెలిసిందే. ఈ క్రమంలో వీసా జారీలో చోటు చేసుకుంటున్న విపరీతమైన జాప్యం విదేశీ విద్యార్థులు పెద్ద ఎత్తున ఇతర ఆప్షన్ల కోసం వెతకటమే కాదు.. ఆ దిశగా అడుగులు వేయటంతో ఈసారి సీజన్ లో అమెరికాకు వెళ్లాల్సిన విద్యార్థుల సంఖ్యలో భారీ గండి పడినట్లు చెబుతున్నారు.

ఈ ఏడాది జనవరి - ఏప్రిల్ మధ్య 12 శాతం మేరకు తగ్గిన ఎఫ్1 వీసాల అనుమతి.. మే చివరకు 22 శాతానికి తగ్గిన వైనం వెలుగు చూసింది. దీనికి జూన్ వివరాల్ని కలిపితే.. ఈ సీజన్ కు అమెరికాకు జరిగిన ఆర్థిక నష్టం ఎంతన్న అంశంపై కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. విదేశీ విద్యార్థులు లేక అమెరికా వర్సిటీలు బోసి పోతుంటే.. మరోవైపు విదేశీ విద్యార్థులు రాక భారీగా తగ్గటంలో అమెరికాకు రావాల్సిన ఆదాయం పెద్దఎత్తున గండి పడినట్లుగా చెబుతున్నారు.

ఒక అంచనా ప్రకారం.. అమెరికాకు విదేశీ విద్యార్థుల్లో తగ్గిన రాకతో అమెరికాకు రూ.61,703 కోట్లకు పైనే రాబడి తగ్గినట్లుగా చెబుతున్నారు. అంతేకాదు.. ఈ తీరుతో స్థానికంగా కాలేజీల ద్వారా లభించే ఉపాధి.. ఉద్యోగాలపైనా ప్రభావాన్ని చూపుతుందని చెబుతున్నారు. ఒక అంచనా ప్రకారం..విదేశీ విద్యార్థులకు జారీ చేసే వీసా జాప్యంతో దాదాపు 60 వేలకు పైగా ఉద్యోగాలు.. ఉపాధి అవకాశాలకు గండి పడినట్లుగా చెబుతున్నారు. ఇదంతా ట్రంప్ పుణ్యమేనన్న ఆగ్రహం పలువురు అమెరికాన్లలో ఉన్నట్లుగా చెబుతున్నారు.

ట్రంప్ సర్కారు తీరుతో తమ కాలేజీలు తీవ్రంగా నష్టపోతున్నట్లుగా కళాశాలల యాజమాన్యాలు వాపోతున్నాయి. ఈ పరిణామాలు కళాశాలల బడ్జెట్ ను రీరివ్యూ చేయాల్సిన పరిస్థితిని తీసుకొచ్చేలా చేసిందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. ఓవైపు ఆదాయం తగ్గిపోవటం.. మరోవైపు ఉద్యోగ అవకాశాలు పోవటంతో పాటు.. కాలేజీలు తీవ్ర నష్టాల బారిన పడుతున్నట్లు చెబుతున్నారు.

దీంతో.. విద్యా సంస్థలు ఉక్కిరిబిక్కిరికి లోనవుతున్నాయి. విదేశీ విద్యార్థుల రాకలో పడిన కోతతో కళాశాలల సిబ్బంది జీతాల్లోనూ కోత పడినట్లుగా చెబుతున్నారు. మొత్తంగా అమెరికాను అగ్రస్థానాన నిలిపేందుకు తాను కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు ట్రంప్ చెబుతున్నా.. తిరిగి అవే నిర్ణయాలు అమెరికాలోని పలు విద్యా సంస్థల్ని ఆర్థికంగా దెబ్బ తీస్తున్నట్లుగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.