Begin typing your search above and press return to search.

ట్రంప్ మీద భార్య కోపం.. అందుకే ఎంక్వైరీ వేశాడా?

అందుకే భార్య కోపానికి కారణమైన ఐక్యరాజ్యసమితి వివాడంపై ట్రంప్ ఎంక్వైరీ వేసినట్టున్నట్టున్నాడు అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

By:  A.N.Kumar   |   25 Sept 2025 3:02 PM IST
ట్రంప్ మీద భార్య కోపం.. అందుకే ఎంక్వైరీ వేశాడా?
X

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఐక్యరాజ్యసమితి (UN) జనరల్ అసెంబ్లీ సమావేశానికి హాజరైనప్పుడు ఎదురైన సాంకేతిక సమస్యలు, వాటిపై ఆయన స్పందన ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ట్రూత్ సోషల్‌ వేదికగా ట్రంప్ స్వయంగా ఈ 'దురదృష్టకర' సంఘటనలను పంచుకున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై ఆయన దర్యాప్తు కోరడం వెనుక అసలు కారణం ఏమిటి? ఇది కేవలం సాంకేతిక లోపమా, లేక ఉద్దేశపూర్వక చర్యగా ట్రంప్ భావిస్తున్నారా? ట్రంప్ భార్య దీని మీద కోపంగా ఉరిమిచూసింది. అందుకే భార్య కోపానికి కారణమైన ఐక్యరాజ్యసమితి వివాడంపై ట్రంప్ ఎంక్వైరీ వేసినట్టున్నట్టున్నాడు అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

* సాంకేతిక వైఫల్యాల పరంపర

ట్రంప్ పర్యటనలో ఆయనకు ఎదురైన సంఘటనలు ఒక్కటి కాదు, మూడు. అనుకున్న ప్రణాళిక ప్రకారం, ఆయన భార్య మెలానియాతో కలిసి సభకు హాజరయ్యారు. సభ ప్రాంగణంలోకి వెళ్తున్నప్పుడు ఎస్కలేటర్ ఉన్నట్టుండి ఆగిపోయింది. దీనిపై ట్రంప్ స్పందిస్తూ మెలానియా కొంచెం ముందుకు వెళ్లిన తర్వాత, తాను ఆమె పక్కన అడుగులు వేస్తూ సీరియస్ గా వెళ్లిపోయాడు.. అయితే ఐక్యరాజ్యసమితి ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్‌ మాత్రం, అమెరికా అధ్యక్షుడి బృందంలోని ఒక వీడియో గ్రాఫర్ తప్పిదం వల్లే ఇది జరిగి ఉండొచ్చని వ్యాఖ్యానించారు.

టెలిప్రాంప్టర్ మొరాయించడం:

ట్రంప్ ప్రసంగించే సమయంలో టెలిప్రాంప్టర్ కూడా పనిచేయలేదు. దీనిపై ట్రంప్ తనదైన శైలిలో వ్యంగ్యంగా స్పందించారు. టెలిప్రాంప్టర్ లేకుండా కూడా 'హృదయం లోతుల నుంచి' మాట్లాడగలుగుతానని చెప్పి సభలో నవ్వులు పూయించారు.

సౌండ్ సిస్టమ్ సమస్యలు: ఆడిటోరియంలో సౌండ్ సిస్టమ్ సరిగ్గా లేకపోవడం కూడా ఆయన అసౌకర్యానికి గురి కావడానికి మరో కారణంగా తెలిపారు.

* ట్రంప్ విచారణ కోరిక వెనుక...

ఈ మూడు సంఘటనలను ట్రంప్ కేవలం యాదృచ్ఛిక సాంకేతిక లోపాలుగా భావించలేదు. వీటిని ఉద్దేశపూర్వకంగా జరిగినవని ఆయన అనుమానిస్తున్నారు. అందుకే, ఈ ఘటనలపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టాలని కోరుతూ ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌కు లేఖ రాయాలని నిర్ణయించారు. తన భార్య కోపం వల్లనే ట్రంప్ ఇలా చేశాడని అంటున్నారు.

ఇక్కడ తలెత్తే ప్రశ్న... 'భార్య కోపం' అంశం నిజంగానే దీనికి కారణమా?

ట్రంప్ పంచుకున్న వివరాల ప్రకారం, ఎస్కలేటర్ ఆగిపోయినప్పుడు మెలానియా కొంచెం ముందుకు వెళ్లడం, ఆయన పక్కన అడుగులు వేయడం అనే అంశాలను బట్టి చూస్తే, ఈ ఆకస్మిక ఘటనతో మెలానియా అసౌకర్యానికి గురై ఉండవచ్చు లేదా కొద్దిపాటి ఆందోళన చెంది ఉండవచ్చు. దీనిపై మెలానియా ట్రంప్ కోపగించుకోవడం సహజమే. ట్రంప్ వంటి వ్యక్తికి, ముఖ్యంగా ప్రజల దృష్టిలో ఉన్నప్పుడు, తన భార్యకు ఎదురైన అసౌకర్యం లేదా ఇబ్బంది పట్ల తీవ్రంగా స్పందించడం, దానికి బాధ్యులను గుర్తించాలని భావించడం అసాధారణం కాదు.

అయితే, మొత్తం మూడు వేర్వేరు సాంకేతిక సమస్యలు ఒకేసారి, ఒకే వ్యక్తికి ఎదురైనప్పుడు, దాని వెనుక ఏదైనా 'కుట్ర' ఉందేమోనని ట్రంప్ లాంటి వివాదాస్పద రాజకీయ నాయకుడు అనుమానించడం కూడా సహజమే. కాబట్టి, ఎస్కలేటర్ సంఘటనతో మెలానియాకు కలిగిన అసౌకర్యం, ఇతర రెండు వైఫల్యాలన్నీ కలిపి, ఇది కేవలం లోపం కాదనే అభిప్రాయానికి ఆయన వచ్చి ఉండవచ్చు. వ్యక్తిగత అసౌకర్యం మెలానియా ఇబ్బంది , రాజకీయపరమైన అనుమానం (కుట్ర) రెండూ కలిసి దర్యాప్తు కోరడానికి దారితీసి ఉండవచ్చు.

వ్యంగ్యంతో కూడిన నిరసన

ట్రంప్ ఈ సంఘటనలను సీరియస్‌గా తీసుకున్నప్పటికీ, వాటిని వివరించడంలో మాత్రం తనదైన శైలిలో హాస్యాన్ని జోడించారు. టెలిప్రాంప్టర్ పనిచేయకపోవడంపై ఆయన చేసిన వ్యాఖ్యలు సభలో నవ్వులు పూయించాయి. సభలో ప్రశాంత వాతావరణం నెలకొనేలా ఆయన వ్యవహరించారు. అయినప్పటికీ, అంతర్జాతీయ వేదికపై ఒక దేశాధ్యక్షుడికి వరుసగా సాంకేతిక సమస్యలు ఎదురవడం అనేది ఆ వేదిక నిర్వహణ లోపాలను స్పష్టంగా తెలియజేస్తోంది. దర్యాప్తు ఫలితం ఏమైనప్పటికీ, భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.