Begin typing your search above and press return to search.

మీడియా బ్యాన్ చేస్తే ఊరుకుంటాడా? ట్రంప్ టీవీ షురూ..అట్లుంటదీ ట్రంప్ తోని..

పేరు చూసి కేబుల్ వైర్ల కోసం వెతుక్కోకండి.. ఇది పక్కా డిజిటల్ స్ట్రీమింగ్. వైట్‌హౌస్ యూట్యూబ్, సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా రోజంతా ప్రసారమవుతుంది.

By:  A.N.Kumar   |   22 Sept 2026 4:45 PM IST
మీడియా బ్యాన్ చేస్తే ఊరుకుంటాడా?  ట్రంప్ టీవీ షురూ..అట్లుంటదీ ట్రంప్ తోని..
X

అమెరికా రాజకీయాల్లో డ్రామాకి ఎప్పుడూ కొదవే లేదు. కానీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి, మెయిన్‌స్ట్రీమ్ మీడియాకి మధ్య జరుగుతున్న ఈ 'క్యాట్ అండ్ మౌస్' గేమ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. సీఎన్ఎన్ , ఎంఎస్ నౌ, పొలిటికో లాంటి పెద్ద పెద్ద నెట్‌వర్క్‌లను వైట్‌హౌస్ ప్రెస్ రూమ్ బయట నిలబెట్టేసరికి.. కోపమొచ్చిన మీడియా చానెల్స్ అన్నీ కలిసి "మేమూ మీ ప్రెస్‌మీట్‌లను కవర్ చేయం పో!" అంటూ పూల్ కవరేజీని బాయ్‌కాట్ చేశాయి.

అయితే ఎదురుగా ఉంది ట్రంప్ కదా.. "మీరు కవర్ చేయకపోతే మాకేంటి బ్రో.. మేమే సొంతంగా కెమెరాలు కొనుక్కుంటాం" అంటూ మైండ్ బ్లాక్ అయ్యేలా "ట్రంప్ టీవీ: ద ఎసెన్షియల్స్ స్టేషన్’’ పేరుతో ఏకంగా 24/7 డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ను మార్కెట్లోకి వదిలేశారు. అట్లుంటది మరి ట్రంప్‌తోటి..

అసలు ఏమిటీ 'ట్రంప్ టీవీ' వింత?

పేరు చూసి కేబుల్ వైర్ల కోసం వెతుక్కోకండి.. ఇది పక్కా డిజిటల్ స్ట్రీమింగ్. వైట్‌హౌస్ యూట్యూబ్, సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా రోజంతా ప్రసారమవుతుంది. ఇందులో ఏం చూపిస్తారో తెలుసా? ట్రంప్ స్పీచ్‌లు, ప్రభుత్వ అప్‌డేట్‌లు, మధ్యమధ్యలో ఆయన పాత హిట్‌ వీడియోలు.. అవును ఆయన ప్రమాణస్వీకారం, మౌంట్ రష్‌మోర్ దగ్గర ఇచ్చిన 'మాస్' ప్రసంగాలు మళ్లీ మళ్లీ రీ-టెలికాస్ట్ చేస్తూ సబ్‌స్క్రైబర్లకు వినోదాన్ని పంచుతున్నారు. అంటే జర్నలిస్టులు అడిగే తిక్క ప్రశ్నలు ఉండవు.. కేవలం ట్రంప్ మార్క్ భజన మాత్రమే అందుబాటులో ఉంటుందన్నమాట..

కోర్టు మెట్లెక్కిన 'ఫేక్ న్యూస్' వార్

తమ ప్రెస్ కార్డులు గుంజేసి, లోపలికి రాకుండా గేట్లు మూసేసరికి సదరు మీడియా సంస్థలు తట్టుకోలేక ఫెడరల్ కోర్టు తలుపు తట్టాయి. "మా ఫస్ట్ అమెండ్‌మెంట్ పత్రికా స్వేచ్ఛ హక్కులను హరిస్తున్నారు " అని మీడియా రోదిస్తుంటే.. "పత్రికా స్వేచ్ఛ ఉంటే వార్తలు రాసుకోండి.. అంతేకానీ మా వైట్‌హౌస్ హాలులోనే కూర్చుంటామంటే కుదరదు.. పైగా మీరు రాసేవన్నీ ఫేక్ న్యూస్" అని వైట్‌హౌస్ అంతే గట్టిగా కౌంటర్ ఇస్తోంది.

మొత్తానికి కథ ఎక్కడికి వచ్చిందంటే.. మీడియా కెమెరాలు బంద్ చేస్తే వైట్‌హౌస్ సొంత రింగ్ లైట్లు, కెమెరాలతో లైవ్ పెట్టేస్తోంది. ఒకవైపు కోర్టులో "మాకు ప్రవేశం కావాలి" అని మీడియా పోరాటం చేస్తుంటే.. మరోవైపు ట్రంప్ మాత్రం "మీరు ప్రసారం చేయకపోతే ఏంటి.. మా ఛానెల్ సబ్‌స్క్రైబ్ చేసుకోండి.. బెల్ ఐకాన్ నొక్కండి" అని ప్రజలకు డైరెక్ట్‌గా కనెక్ట్ అయిపోతున్నారు. భవిష్యత్తులో ఈ 'డైరెక్ట్ టు పబ్లిక్' షో ఎటు దారితీస్తుందో చూడాలి.