ట్రంప్ టారిఫ్‌లు: వాల్ స్ట్రీట్‌కు ‘స్లో బర్న్’.. అమెరికా ఆర్థిక వ్యవస్థకు గట్టి దెబ్బ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న పరస్పర టారిఫ్‌లు అమెరికా ఆర్థిక వ్యవస్థపై దీర్ఘకాలిక ప్రభావం చూపే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
By: A.N.Kumar | 10 Aug 2025 7:00 PM ISTఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న పరస్పర టారిఫ్‌లు అమెరికా ఆర్థిక వ్యవస్థపై దీర్ఘకాలిక ప్రభావం చూపే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ విధానాలు తక్షణమే వాల్ స్ట్రీట్‌పై పెద్దగా ప్రభావం చూపకపోయినా.. రాబోయే కాలంలో ఆర్థిక వ్యవస్థకు గట్టి దెబ్బ తగిలే అవకాశం ఉందని వన్ వరల్డ్ అవుట్‌లుక్‌లో జోయా నజీబ్ అభిప్రాయపడ్డారు.
-టారిఫ్‌లు అంటే వేరే పేరుతో పన్నులే
వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ క్యారోలిన్ లెవిట్ ప్రకారం.. కేవలం జూలై నెలలోనే టారిఫ్‌ల ద్వారా సుమారు $29 బిలియన్ల ఆదాయం సమకూరింది. వాణిజ్య కార్యదర్శి హోవర్డ్ లుట్నిక్ ఈ ఆదాయం త్వరలోనే నెలకు $50 బిలియన్లకు చేరవచ్చని అంచనా వేశారు. అయితే ఈ టారిఫ్‌లు అంతిమంగా ప్రజలపై పన్నుల భారాన్ని పెంచుతాయి. ముఖ్యంగా తక్కువ ఆదాయం గల వర్గాలకు ఇది మరింత ఆర్థిక ఇబ్బందులు సృష్టిస్తుంది.
-వాల్ స్ట్రీట్ VS మెయిన్ స్ట్రీట్
ప్రస్తుతం స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయిలో ఉన్నప్పటికీ, ఇది మొత్తం ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యానికి ప్రతీక కాదు. అమెరికాకు చెందిన ప్రముఖ నిర్మాణ, మైనింగ్ పరికరాల తయారీ సంస్థ క్యాటర్పిల్లర్ ఇన్‌క్ ఈ కొత్త టారిఫ్‌ల వల్ల ఈ ఏడాది $1.5 బిలియన్ల నష్టాన్ని అంచనా వేసింది. అయినప్పటికీ కంపెనీ షేర్ ధరలు పెద్దగా తగ్గలేదు. దీనికి ప్రధాన కారణం, AI డేటా సెంటర్లు , ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాలపై పెట్టుబడిదారుల విశ్వాసం. దీనివల్ల అమెరికాలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. వాల్ స్ట్రీట్‌లోని షేర్లు పెరుగుతుంటే.. సాధారణ ప్రజలు (మెయిన్ స్ట్రీట్) నిత్యావసర వస్తువుల ధరలు, జీవన వ్యయాలతో తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు.
-పెట్టుబడిదారుల భవిష్యత్తు అంచనాలు
ప్రముఖ పెట్టుబడిదారుడు వారెన్ బఫెట్ గత 11 త్రైమాసికాలుగా నిరంతరంగా షేర్లను అమ్ముతూ $344 బిలియన్ల నగదు నిల్వలను పోగు చేసుకున్నారు. ఇది రాబోయే ఆర్థిక మాంద్యం కోసం ఆయన సన్నద్ధమవుతున్నారని సూచిస్తుంది. ధరలు పడిపోయినప్పుడు తిరిగి పెట్టుబడి పెట్టాలనేది ఆయన వ్యూహం. ఇది భవిష్యత్తులో ఆర్థిక అస్థిరతకు సంకేతంగా నిపుణులు భావిస్తున్నారు.
-చట్టపరమైన సవాళ్లు - భవిష్యత్తు హెచ్చరికలు
అమెరికా మాజీ ప్రతినిధుల సభ స్పీకర్ పాల్ రయన్ ప్రకారం.. ఈ టారిఫ్‌లు త్వరలో న్యాయపరమైన సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థలో మరింత అస్తవ్యస్త పరిస్థితులను సృష్టించవచ్చు. ఈ సమస్యలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే, టారిఫ్‌లు అమెరికా ఆర్థిక వ్యవస్థకు నెమ్మదిగా, కానీ గట్టి దెబ్బ కొట్టే అవకాశం ఉంది.
