Begin typing your search above and press return to search.

ఇండియాపై ఇంకా కోపం తగ్గలేదా ట్రంప్

పనిలేనోడు రోజంతా ఎప్పుడు ఎవరో ఒకరి మీద పడి ఏడుస్తూనే ఉంటాడట.. ఇప్పుడు మన డొనాల్డ్ ట్రంప్ పరిస్థితి అలానే తయారైంది.

By:  A.N.Kumar   |   9 Dec 2025 11:56 AM IST
ఇండియాపై ఇంకా కోపం తగ్గలేదా ట్రంప్
X

పనిలేనోడు రోజంతా ఎప్పుడు ఎవరో ఒకరి మీద పడి ఏడుస్తూనే ఉంటాడట.. ఇప్పుడు మన డొనాల్డ్ ట్రంప్ పరిస్థితి అలానే తయారైంది. అవును.. తన దేశంలో తనపై వ్యతిరేకతను తగ్గించుకోక ఇతర దేశాలపై పడి ఏడుస్తున్నాడు. ఇండియాపై ఇప్పటికే ప్రపంచంలోనే అత్యధిక ట్రారిఫ్ లు వేసిన పెద్దమనిషి ఇప్పుడు ఇంకా ఆ కసి తీరనట్టు మరిన్ని ప్లాన్ చేస్తున్నాడు.

ఇండియా, అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు ప్రారంభించడానికి సిద్ధమవుతున్న వేళ ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత్ నుంచి దిగుమతయ్యే బియ్యంపై అదనపు సుంకాలు విధించాలని అమెరికా అధ్యక్షుడు యోచిస్తున్నట్టు సమాచారం.

చౌకైన విదేశీ వస్తువుల దిగుమతి తమ ఉత్పత్తిదారులను దెబ్బతీస్తోందని అక్కడి రైతులు చేసిన ఫిర్యాదుల నేపథ్యంలో ట్రంప్ ఈ అంశాన్ని పరిశీలిస్తున్నారు.

అమెరికా రైతుల కోసం 12 బిలియన్ డాలర్ల బెయిల్ అవుట్ ప్యాకేజీని ప్రారంభించేందుకు వైట్ హౌస్ లో జరిగిన ఓరౌండ్ టేబుల్ సమావేశంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. పలుదేశాలు చౌక ధరలకే బియ్యాన్ని అమెరికా మార్కెట్ లోకి ‘డంప్’ చేస్తున్నాయనే వాదనలను తమ ప్రభుత్వం పరిశీలిస్తోందని ట్రంప్ పేర్కొన్నారు. సమావేశంలో పాల్గొన్న రైతులు, సబ్సిడీ పొందిన బియ్యం దిగుమతులు తమ మార్కెట్ లను దెబ్బతీస్తున్నాయని.. దేశీయ ధరలను తగ్గిస్తున్నాయని వాదించారు. పలు దేశాలు మోసం చేస్తున్నాయని.. అందుకే సుంకాల విధింపు చేపడుతున్నట్టు ట్రంప్ పేర్కొన్నారు.

ఇక ఈ సమావేశంలోనే ఓ రైస్ మిల్ సీఈవో మెరిల్ కెన్నడీ మాట్లాడుతూ అమెరికా మార్కెట్ లోకి తమ ఉత్పత్తులను డంప్ చేస్తోన్న దేశాల్లో భారత్, థాయిలాండ్, చైనాలు ప్రధానంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. గతంలో ప్యూర్టోరికోకు తామే బియ్యం ఎగుమతి చేసేవాళ్లమని.. కానీ ఇప్పుడు చైనా వస్తువులు అక్కడికి కూడా వెళుతున్నాయని ఆయన వాపోయారు. దక్షిణాది రాష్ట్రాల్లో తాము అనేక ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు.

ఈ క్రమంలోనే ట్రంప్ సీరియస్ చర్యల దిశగా అడుగుల వేస్తున్నారు. అమెరికా రైతుల ఉత్పత్తులన దెబ్బతీసేలా ఉన్న దేశాల జాబితాను సమర్పించాలని అధ్యక్షుడు ట్రంప్ వాణిజ్య కార్యదర్శి బెసెంట్ ను ఆదేశించారు. బెసెంట్ ఈ జాబితాలో భారత్, థాయ్ లాండ్, చైనాలు ముందున్నాయని తెలిపార. వీటిపై సత్వరం చర్యలు తీసకంటామని ట్రంప్ రైతులకు హామీ ఇచ్చార. ఈ పరిణామం భారత్ తో వాణిజ్య చర్చలకు ముందు చోట చేసుకోవడం గమనార్హం.

ట్రేడ్ డీల్ కు సంబంధించిన చర్చల ఈనెల 10 నుంచి ఢిల్లీలో జరుగనున్నాయి. ఈ చర్చల్లో పాల్గొనేందుక అమెరికా డిప్యూటీ వాణిజ్య ప్రతినిధి రిక్ స్విట్జర్ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం మన దేశంలో పర్యటించనుంది. భారత్ తరుఫున వాణిజ్య కార్యదర్శి రాజేశ్ అగర్వాల్ చర్చల్లో పాల్గొననన్నారు. రేపటి నుంచి జరుగబోయే వాణిజ్య చర్చలు మరింత ఉత్కంఠగా మారే అవకాశం ఉంది.