అమెరికా అధ్యక్షుడికి ఇష్టమైన ఇంగ్లిష్ వర్డ్ ఏమిటో తెలుసా?
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచీ తనదైన నిర్ణయాలతో చెలరేగిపోతున్నారు ట్రంప్.
By: Raja Ch | 1 Oct 2025 12:23 PM ISTఅమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచీ తనదైన నిర్ణయాలతో చెలరేగిపోతున్నారు ట్రంప్. సుంకాలతో ప్రపంచ దేశాలపై విరుచుకుపడుతున్నారు. ప్రధానంగా 'సుంకాల రాజు' అని పిలుస్తూ భారత్ ను లక్ష్యంగా చేసుకుని నియంతృత్వాన్ని చాటుతున్నారని అంటున్నారు. ఈ సమయంలో తనకు ఇష్టమైన ఇంగ్లిష్ పదాన్ని వెల్లడించారు ట్రంప్.
అవును... అరిజోనాలోని మెరైన్ కార్ప్స్ బేస్ క్వాంటికోలో ప్రసంగిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... తనకు ఇష్టమైన ఇంగ్లిష్ వర్డ్ ను వెల్లడించారు. ఇందులో భాగంగా... తనకు ఇష్టమైన ఆంగ్ల భాషా పదం 'టారిఫ్స్' అని ప్రకటించారు. దీనిని 'అత్యంత అందమైనది' అని పిలిచారు.
ఆగస్టు 2025 నుండి 50%గా నిర్ణయించబడిన అత్యంత తీవ్రమైన అమెరికా సుంకాలను ఎదుర్కొంటున్న రెండు దేశాలైన భారత్, బ్రెజిల్ లతో వాణిజ్య ఉద్రిక్తతల మధ్య ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ సందర్భంగా... టారిఫ్ తనకు ఇష్టమైన పదం అని.. మనం అంతా ధనవంతులు అవుతున్నామని తెలిపారు.
ఇతర దేశాలు సంవత్సరాలుగా మనల్ని ఉపయోగించుకుంటున్నాయని.. ఇతర దేశాలు చాలా కాలంగా అమెరికా ఆర్థిక వ్యవస్థను దోపిడీ చేస్తున్నాయని అన్నారు. అయితే ఇప్పుడు మనం వారితో న్యాయంగా వ్యవహరిస్తున్నామని ట్రంప్ చెప్పుకొచ్చారు. అమెరికా సైనిక జనరల్స్, అధికారులను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇదే సమయంలో ఫార్మాస్యూటికల్స్ కంపెనీలకు బిగ్ షాకిస్తూ ట్రంప్ సోషల్ మీడియా ద్వారా తన వైఖరిని నొక్కి చెప్పారు. ఇందులో భాగంగా... అక్టోబర్ 1, 2025 నుండి, ఏదైనా బ్రాండెడ్ లేదా పేటెంట్ పొందిన ఫార్మాస్యూటికల్ ఉత్పత్తిపై తాము 100% సుంకం విధిస్తామని అన్నారు. అయితే... అమెరికాలో వారి ఫార్మాస్యూటికల్ తయారీ కర్మాగారాన్ని నిర్మిస్తే ఇది ఉండదని తెలిపారు.
ఇదే సమయంలో... అమెరికా ఆదాయాలు 'మునుపెన్నడూ చూడని స్థాయికి' చేరుకున్నాయని వెల్లడించిన ట్రంప్... ఇప్పటికే అన్ని విదేశీ నిర్మిత సినిమాలపై 100% సుంకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.
