Begin typing your search above and press return to search.

ఏనుగుతో ఎలుక ఢీ.. ట్రంప్ సుంకాలపై షాకింగ్ వ్యాఖ్యలు.. ఎవరంటే?

అయితే.. ఈ సుంకాల షాక్ కారణంగా భారత్ కు జరిగే నష్టం కంటే లాభమే ఎక్కువన్న వాదన ఇప్పుడు వినిపిస్తోంది.

By:  Garuda Media   |   29 Aug 2025 10:38 AM IST
ఏనుగుతో ఎలుక ఢీ.. ట్రంప్ సుంకాలపై షాకింగ్ వ్యాఖ్యలు.. ఎవరంటే?
X

ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనవైపు మాత్రమే చూసి ఆందోళన చెందుతాం. అయితే.. సమస్యను సమస్యగా చూస్తూ.. దాని కారణంగా ఎదురయ్యే సమస్యల్ని సాపేక్షంగా చూసినప్పుడు.. ప్రతికూల అంశాలే కాదు అనుకూల అంశాలు కూడా కనిపిస్తాయి. సమస్య ఏదైనా.. ఒత్తిడిని తీసుకురావటమే కాదు.. సదరు సమస్యను ఎదుర్కొనే బలాన్ని అందిస్తుందన్న విషయాన్ని మర్చిపోకూడదు. రష్యా నుంచి ముడిచమురు కొంటున్న కారణంగా భారత్ మీద 50 శాతం సుంకాల షాక్ విధించిన ట్రంప్ నిర్ణయంతో భారత స్టాక్ మార్కెట్ తో పాటు.. ఆయా రంగాలకు చెందిన వారు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.

అయితే.. ఈ సుంకాల షాక్ కారణంగా భారత్ కు జరిగే నష్టం కంటే లాభమే ఎక్కువన్న వాదన ఇప్పుడు వినిపిస్తోంది. అంతేకాదు.. ఈ నిర్ణయం ద్వారా ట్రంప్ తన దేశానికి నష్టం వాటిల్లేలా చేస్తున్నట్లుగా ఆ దేశానికి చెందిన ప్రముఖ ఆర్థిక వేత్త చేసిన విశ్లేషణ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ట్రంప్ టారిఫ్ లపై అమెరికా ఆర్థికవేత్త రిచర్డ్ వోల్ఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన విశ్లేషణ ట్రంప్ కు హెచ్చరికగా మాత్రమే కాదు.. అమెరికా ప్రయోజనాలు ఎంత దారుణంగా దెబ్బ తింటాయన్న విషయాన్ని తెలియజేయటం గమనార్హం.

ఒక ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరిని ఆకర్షిస్తున్నాయి. ట్రంప్ సుంకాల షాక ప్రాథమిక దశలో నష్టపోయేలా చేసినా.. దాని ప్రత్యామ్నాయాలు మాత్రం దీర్ఘకాలంలో అగ్రరాజ్యం మీద ఆధారపడకుండా ఉండేలా చేస్తాయని చెప్పకతప్పదు. న్యూఢిల్లీకి వ్యతిరేకంగా యూఎస్ తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు రానున్న రోజుల్లో అగ్రరాజ్యానికే తలనొప్పులు తెచ్చి పెడతాయని చెబుతున్నారు. ఇంతకూ ఆయనేమన్నారంటే..

- ప్రస్తుతం భారతదేశం అతి పెద్ద దేశం. ఆ దేశంపై అమెరికా చర్యలు ఎలుక ఏనుగును ఢీ కొంటున్నట్లే ఉన్నాయి.

- సుంకాల వేళ యూఎస్ తో సంబంధాలు తెగిపోతే.. భారత్ తన ఎగుమతులను ఇతర దేశాలకు అమ్మే ప్రయత్నాలు చేస్తుంది. ఈ చర్య బ్రిక్స్ దేశాల్ని బలోపేతం చేస్తుంది.

- రష్యా ఇతర దేశాలకు అమ్ముతున్నట్లే.. భారత్ కూడా తన వస్తువుల్ని అమెరికాకు కాకుండా మిగిలిన బ్రిక్స్ దేశాలకు అమ్ముతుంది.

- అదే జరిగితే అమెరికా ప్రయోజనాలకు నష్టం వాటిల్లేలా చేస్తుంది.

- ప్రపంచ ఉత్పత్తుల్లో చైనా.. భారత్.. రష్యాలతో పాటు బ్రిక్స్ దేశాల వాటా 35 శాతం. అదే సమయంలో జీ7 దేశాల వాటా 28 శాతానికి తగ్గింది.

- ట్రంప్ సుంకాలు బ్రిక్స్ కూటమి దేశాల్ని పోషిస్తున్నాయి. ట్రంప్ నిర్ణయాలు బ్రిక్స్ ను మరింత బలోపేతం చేసేలా చేస్తున్నాయి. పశ్చిమ దేశాలకు అవి ఆర్థిక ప్రత్యమ్నాయంగా మారుతుంది.

- సోవియెట్ కాలం నుంచి భారత్ - అమెరికాల మధ్య దీర్ఘకాల సంబంధాలు ఉన్నాయి. ప్రస్తుతం న్యూఢిల్లీపై అమెరికా తీసుకుంటున్న చర్యలు కఠినంగా ఉన్నాయి. ఇవి అమెరికా తనను తాను దెబ్బ తీసుకుంటోంది.