టారిఫ్ ఆయుధం.. అమెరికా ఫస్ట్: ట్రంప్ దూకుడు వెనుక అసలు వ్యూహం ఇదేనా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన రాజకీయ శైలికి తగ్గట్లుగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
By: A.N.Kumar | 18 Dec 2025 1:36 PM ISTడొనాల్డ్ ట్రంప్ అంటేనే తిక్కలోడు. ఎప్పుడు ఏం చేస్తాడో కూడా తెలియదు. అలాంటి ట్రంప్ ప్రపంచదేశాలను ఇబ్బంది పెట్టడమే పనిగా పెట్టుకున్నాడు. తలతిక్క టారిఫ్ లతో ప్రపంచంలోని దేశాలను ఆడుకుంటున్నాడు. ఇప్పుడు ట్రంప్ టారిఫ్ ల దెబ్బకు ప్రపంచదేశాలన్నీ భయపడుతున్నాయి. టారిఫ్ లపై నీ ఓపినియన్ ఏంటని ట్రంప్ ను అడిగితే ఆసక్తికర సమాధానం ఇచ్చాడు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన రాజకీయ శైలికి తగ్గట్లుగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా ప్రజలను ఉద్దేశించి చేసిన తాజా ప్రసంగంలో దేశ ఆర్థిక వ్యవస్థ , సరిహద్దు భద్రత, వలస విధానాలు, అంతర్జాతీయ రాజకీయాలు, ముఖ్యంగా టారిఫ్ ల ప్రాధాన్యతపై విస్తృతంగా మాట్లాడారు. ‘టారిఫ్ అనే పదమంటే నాకు చాలా ఇష్టం’ అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి.
తన పదవీకాలంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ గణనీయంగా మెరుగుపడిందని ట్రంప్ పేర్కొన్నారు. టారిఫ్ ల విధానం వల్లే అమెరికాలోకి 18 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గతంలో అనేక దశాబ్ధాల పాటు ఇతర దేశాలు అమెరికాపై టారిఫ్ లను ఆయుధంలా ఉపయోగించాయని..కానీ ఇకపై ఆ పరిస్థితి ఉండబోదని స్పష్టం చేశారు. అమెరికాలో తయారయ్యే ఉత్పత్తులపై సుంకాలు లేకపోవడం వల్లే అనేక అంతర్జాతీయ కంపెనీలు తిరిగి అమెరికాకు వస్తున్నాయని ట్రంప్ తెలిపారు.
అంతర్జాతీయ రాజకీయాల విషయానికి వస్తే.. ‘10 నెలల్లో ఎనిమిది యుద్ధాలు ఆపాను’ అంటూ ట్రంప్ మరోసారి తనదైన శైలిలో చాటింపు వేశారు. ఇరాన్ అణుముప్పును అడ్డుకున్నానని.. గాజా యుద్ధాన్ని ఆపి పశ్చిమాసియాలో తొలిసారిగా శాంతి నెలకొల్పానని పేర్కొన్నారు. భారత్-పాక్ సహా పలు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడంలో తన పాత్ర ఉందని చెప్పుకొచ్చారు.
ఇదే ప్రసంగంలో అమెరికా సైనికుల కోసం కీలక ప్రకటన చేశారు ట్రంప్. క్రిస్మస్ సందర్భంగా ప్రతి అమెరికన్ సైనికుడికి 1776 డాలర్ల నగదు బహుమతి ఇవ్వనున్నట్లు ప్రకటించారు. సాయుధ దళాల సేవలు, త్యాగాలకు గుర్తుగా దీనికి ‘వారియర్ డివిడెండ్’ అనే పేరు పెట్టారు. 1.45 మిలియన్లకు పైగా ఉన్న సైనిక సిబ్బందికి క్రిస్మస్ కు ముందే ఈ నగదు బహుమతి అందించనున్నట్లు తెలిపారు.
మొత్తంగా చూస్తే.. ట్రంప్ ప్రసంగం మరోసారి ఆయన రాజకీయ దృక్పథాన్ని స్పష్టంగా చూపించింది. టారిఫ్ లను ఆర్థిక ఆయుధంగా మలుచుకోవడం.. అమెరికా ఫస్ట్ నినాదాన్ని మరింత బలంగా ముందుకు తీసుకెళ్లడమే తన లక్ష్యమని ట్రంప్ మరోసారి స్పష్టం చేసినట్టైంది.
