ట్రంప్ మారడు.. ఆ బుద్దీ మారదు..
అమెరికా ఎన్నికలు అంటే విధానాలు.. ఆర్థిక వ్యవస్థ.. ప్రజా సంక్షేమం గురించి ఆస్కార్ రేంజ్ డిబేట్లు ఉంటాయని అమాయకంగా అనుకుంటే పొరపాటే.
By: A.N.Kumar | 31 Oct 2026 6:15 PM ISTఅమెరికా ఎన్నికలు అంటే విధానాలు.. ఆర్థిక వ్యవస్థ.. ప్రజా సంక్షేమం గురించి ఆస్కార్ రేంజ్ డిబేట్లు ఉంటాయని అమాయకంగా అనుకుంటే పొరపాటే. డోనాల్డ్ తాత ప్రచారంలోకి దిగారంటే చాలు... అది పొలిటికల్ మైదానం కాదు.. వివాదాల రింగ్ మాస్టర్ షోగా మారిపోతుంది. ‘ఎన్నికలొచ్చాయి... మళ్ళీ నా రూటు మార్చను’ అంటూ డెమోక్రాట్లపై తనదైన స్టైల్లో విరుచుకుపడుతూ వైట్ హౌస్ ఆశలతో దూసుకుపోతున్నారు ట్రంప్.
మధ్యంతర ఎన్నికలు ముగింపు దశకు చేరుకుంటున్న వేళ మిచిగాన్ ప్రచార సభలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు చూస్తే ఎవరికైనా కళ్ళు తేలేయాల్సిందే. డెమోక్రటిక్ పార్టీ సెనెట్ అభ్యర్థి.. ముస్లిం నేత అబ్దుల్ ఎల్-సయ్యద్‌ను గురిపెట్టి ‘ఆయన ఒక జిహాదీ’ అంటూ డైరెక్ట్ సెటైర్లు, ఘాటు ఆరోపణలు విసిరారు. అంతటితో ఆగితే ఆయన ట్రంప్ ఎందుకవుతారు? 9/11 దాడి జ్ఞాపకాలను తోడి.. సదరు అభ్యర్థికి ‘ముస్లిం బ్రదర్హుడ్’తో సంబంధాలున్నాయని సరికొత్త స్క్రిప్ట్ అల్లేశారు. "ఆయన గనుక సెనెట్లోకి అడుగుపెడితే గడప వద్దే మెటల్ డిటెక్టర్లు పెట్టి రోజూ చెక్ చేయాలి" అంటూ ఎల్-సయ్యద్ వ్యక్తిగత గుర్తింపుపై పెట్టిన సెటైరికల్ ముద్రలు ఇప్పుడు నెట్టింట.. రాజకీయ వర్గాల్లో పెద్ద రచ్చకే తెరలేపాయి. భయం నమ్మకం కన్నా త్వరగా ఓట్లు రాలుస్తుందనే పాత ఫార్ములాను ట్రంప్ మళ్ళీ గట్టిగా నమ్ముకున్నట్లున్నారు.
ఇక ఫ్లోరిడాలోని డేటోనా బీచ్ సభలో మరో వినోదం చోటుచేసుకుంది. మైక్ పట్టుకుని ఊగిపోతున్న ట్రంప్‌కు నిరసనకారులు నాలుగుసార్లు అడ్డుపడేసరికి తాతగారికి కోపం నరనరాలకూ పాకింది. ‘నోరు మూసుకో లూజర్’ అంటూ మైకులోనే నిరసనకారుడిపై బరస్ట్ అయ్యి.. అటకెక్కిన సహనంతో అతన్ని బయటకు తోసేయమని ఆర్డర్ వేశారు. విమర్శలను స్వీకరించడం కంటే ఎదురుతిరిగే వారిని బెదిరించడమే మాస్ లీడర్షిప్ అని ఆయన ఫీల్ అవుతున్నారో ఏమో..
మరోవైపు 4.3 కోట్లకు పైగా ఓటర్లు ముందస్తుగా ఓటేసి రికార్డు సృష్టించారు. అంటే అమెరికా ప్రజలు ఈ పొలిటికల్ డ్రామాను క్లోజ్ రేంజ్లో వాచ్ చేస్తున్నారని అర్థమవుతోంది. మరి ట్రంప్ విసిరిన ఈ ‘భయాల మంత్రం’.. ‘దూకుడు మంత్రం’ ఓట్ల వర్షం కురిపిస్తుందా? లేక తటస్థ ఓటర్లకు విసుగు తెప్పించి రివర్స్ కొడుతుందా? ఈ నాటకానికి ఎండ్ కార్డ్ పడేది ఎన్నికల ఫలితాల్లోనే.. ఫలితం ఏంటో వేచిచూడాలి మరీ..
