Begin typing your search above and press return to search.

భారత్ కి అమెరికా అండగా...మోడీ ఉంటేనే !

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచానికి పెద్దన్నగా వ్యవహరిస్తూంటారు. ఒకసారి తాను శాంతి దూతని అంటారు, మరో సారి తాను ప్రపంచానికి పోలీసుని అంటారు.

By:  Satya P   |   18 Jun 2026 9:03 AM IST
భారత్ కి అమెరికా అండగా...మోడీ ఉంటేనే !
X

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచానికి పెద్దన్నగా వ్యవహరిస్తూంటారు. ఒకసారి తాను శాంతి దూతని అంటారు, మరో సారి తాను ప్రపంచానికి పోలీసుని అంటారు. కొన్ని దేశాల మీదకు యుద్ధానికి వెళ్తారు, మరి కొన్ని దేశాలకు రక్షణగా ఉంటామని అంటారు. మరి భారత్ అమెరికా సంబంధాలు ఏమిటి అంటే చరిత్ర చూస్తే పూర్తిగా వాణిజ్యపరమైనవే అని చెబుతుంది. ఆప్త మిత్రుడిగా భారత్ కి అమెరికా నిలబడిన సందర్భం అయితే లేదనే అంటుంది. దీనికి ఒక నిలువెత్తు ఉదాహరణ 1971లో పాకిస్థాన్ తో భారత్ కి యుద్ధం వస్తే అమెరికా పాకిస్థాన్ వైపు నిలిచింది. ఆ సమయంలో రష్యా భారత్ కి అండగా ఉంది. మరి అమెరికా భారత్ కి మధ్య ఉన్నది ఎలాంటి సంబంధం అంటే మారిన అంతర్జాతీయ పరిణామాల నేపధ్యంలో ఏర్పడిన అనివార్య సంబంధమే అని చెప్పాల్సి ఉంటుంది. పరస్పర అవసరాలే ఈ స్నేహానికి మూల కారకాలు అని కూడా పేర్కొనాల్సి ఉంటుంది.

భారత్‌పై దాడి జరిగితే :

భారత్ అమెరికా రక్షణ సంబంధాల మీద ఫ్రాన్స్ లో జీ 7 వేదికగా ట్రంప్ ని మీడియా ప్రశ్నించింది. ఈ సమయంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా పక్కనే ఉన్నారు. ఈ ప్రశ్నకు ట్రంప్ ఇచ్చిన జవాబు అయితే డిప్లమాటిక్ గానే ఉంది అన్న విశ్లేషణలు వినిపిస్తునాయి. భారత్ మీద దాడి జరిగితే అమెరికా అండగా ఉంటుందని ట్రంప్ హామీ ఇచ్చారు. అయితే అది కూడా మోదీ ప్రధానిగా ఉన్నంత వరకు మాత్రమే అమెరికా మద్దతు ఉంటుందని స్పష్టీకరణ చేయడమే విశేషం. ఒకవేళ కొత్త నాయకుడు భారత్ కి వస్తే చెప్పలేనని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇక్కడే అనేక రకాలైన విశ్లేషణలు పుట్టుకుని వస్తున్నాయి.

మోడీ మీదనే ప్రేమా :

భారత్ ఒక దేశం అమెరికా ఒక దేశం. ఈ రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు కానీ ఇతర బంధాలు కానీ కాలానికి అతీతంగా ఉంటేమే మంచి బంధం అని చెప్పాల్సి ఉంటుంది. కానీ ట్రంప్ మోడీ ప్లేస్ లో కొత్త నేత వస్తే చెప్పలేమని అనడం ఆలోచించాల్సిందే అని అంటున్నారు. అయితే ఇప్పటిదాకా చూస్తే అమెరికా భారత్ ల మధ్యన అధికారికంగా రక్షణ ఒప్పందాలు అయితే ఏవీ లేవు కూడా. కానీ ట్రంప్ మాత్రం భారత్ మీద దాడి జరిగితే తాము ఉంటామని చెప్పడం ద్వారా ప్రపంచానికి తాము భారత్ కి మంచి మిత్రుడిని అని స్పష్టం చేసారు. అదే సమయంలో రెండు దేశాల మధ్య అధికారిక ఒప్పందాలేవీ లేవు అని కూడా అన్నారు. అయినప్పటికీ భారత్‌పై దాడి జరిగితే మేము అండగా నిలవడానికి సిద్ధంగా ఉన్నామని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ ఆయనపై ఎవరైనా దాడి చేస్తే మేము అండగా ఉంటాం. ఒకవేళ కొత్త నాయకుడు వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ మోదీ నాయకత్వంలో భారత్‌కు మా పూర్తి సహకారం ఉంటుందని చెప్పి ట్రంప్ ఆసక్తిని పెంచేశారు.