Begin typing your search above and press return to search.

ఇరాన్ లేపేస్తుందని ట్రంప్ భయపడ్డాడు..ఓ డమ్మీ ఫ్లైట్ లో పారిపోయాడు..

గత జులైలో నాటో సదస్సు కోసం అంకారా వెళ్లిన ట్రంప్‌కు ఇరాన్ నుంచి సడన్‌గా ముప్పు ఉందంటూ ఇంటెలిజెన్స్ బాంబు పేల్చింది.

By:  A.N.Kumar   |   11 Aug 2026 9:51 AM IST
ఇరాన్ లేపేస్తుందని ట్రంప్ భయపడ్డాడు..ఓ డమ్మీ ఫ్లైట్ లో పారిపోయాడు..
X

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఇరాన్ రంగంలోకి దిగి లేపేస్తుందేమోనని భయపడి సీక్రెట్ సర్వీస్ వారు ఆడిన ఈ 'మాస్టర్ ప్లాన్' వింటే ఎవరైనా దిమ్మతిరగాల్సిందే. సినిమా కథలను మించిపోయిన ఈ రియల్ లైఫ్ హై-డ్రామా తుర్కియే రాజధాని అంకారాలో జరిగింది.

సాధారణంగా అమెరికా అధ్యక్షులంటే గాల్లో తిరిగే వైట్ హౌస్ లాంటి ‘ఎయిర్‌ఫోర్స్ వన్’ విమానంలో రాచఠీవితో ప్రయాణిస్తారు. శత్రువుల కళ్లు కూడా దానిపైనే ఉంటాయి. సరిగ్గా ఇక్కడే మన సెక్యూరిటీ బాస్‌లు తమ పాతకాలపు నాటకాలతో రివర్స్ గేర్ వేశారు.

జులై సదస్సు.. క్యాటరింగ్ ట్రక్కు స్టంట్!

గత జులైలో నాటో సదస్సు కోసం అంకారా వెళ్లిన ట్రంప్‌కు ఇరాన్ నుంచి సడన్‌గా ముప్పు ఉందంటూ ఇంటెలిజెన్స్ బాంబు పేల్చింది. దాంతో ట్రంప్‌ను ఎయిర్‌ఫోర్స్ వన్ నుంచి అత్యంత గోప్యంగా ఒక క్యాటరింగ్ ట్రక్కులో అవును, బిర్యానీలు, కూల్ డ్రింక్స్ మోసే అదే విమానాశ్రయం ట్రక్కు నుంచి బయటకు దాటించేశారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశ అధ్యక్షుడిని ఇలా తినుబండారాల వాహనంలో దొంగచాటుగా మార్చడం కచ్చితంగా సెక్యూరిటీ రికార్డుల్లో నిలిచిపోతుంది.

ఎయిర్‌ఫోర్స్ వన్‌లో ప్రెస్, మిగతా సిబ్బందిని ఎక్కించి జనాలు, శత్రువులు "అదిగో ట్రంప్ విమానం పోతోంది" అని అనుకునేలా బిల్డప్ ఇచ్చారు. కానీ సీన్ కట్ చేస్తే ఆయన చిన్న సీ-32ఏ మిలిటరీ ఫ్లైట్‌లో గుట్టుచప్పుడు కాకుండా బ్రిటన్ ఎగిరిపోయారు.

శత్రువులను బొమ్మను చేసిన అమెరికా ప్లాన్

ఇరాన్ స్కెచ్ వేసి విమానం కోసం ఆకాశం వైపు చూస్తుంటే ట్రంప్ మాత్రం కింద నుంచి రూట్ మార్చేసి సేఫ్‌గా ల్యాండ్ అయిపోయారన్నమాట. మొత్తానికి శత్రువులకు బిస్కెట్ వేసి పెద్ద విమానాన్ని 'డమ్మీ'గా వాడి ట్రంప్‌ను రక్షించిన ఈ ఆపరేషన్ హాలీవుడ్ కామెడీ యాక్షన్ సినిమాను తలపించింది.

అయితే ఇరాన్ నిజంగానే దాడికి సిద్ధమైందా లేక సీక్రెట్ సర్వీస్ వాళ్ల అతి జాగ్రత్తా అన్నది అధికారికంగా తేలాల్సి ఉంది. ఏది ఏమైనా అధ్యక్షుడు మాత్రం 'ఎయిర్‌ఫోర్స్ వన్' విలాసాన్ని వదిలేసి, క్యాటరింగ్ ట్రక్కులో ప్రయాణించి వార్తల్లో నిలిచారు.