రష్యాపై ఆంక్షలు.. భారత్‌పై ప్రభావం.. ఏందుకు? ఎలా?
దీంతో ఈ వ్యవహారంపై దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. దీనిపై కేంద్రంలోని నరేంద్ర మోడీసర్కారు మాత్రం మౌనంగా ఉంది.
By: Garuda Media | 20 Sept 2026 4:00 AM ISTఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చెప్పడం కష్టమే. ఇప్పుడు ఆయన తీసుకున్న కీలక నిర్ణయం.. చేసిన సంతకం.. ప్రత్యక్షంగా రష్యాపై ఆంక్షలు విధించేదే అయినప్పటికీ.. దీని ప్రభావం మాత్రం పరోక్షంగా ఎక్కువగా పడేది మాత్రం భారత్‌పైనే కావడం గమనార్హం. దీంతో ఈ వ్యవహారంపై దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. దీనిపై కేంద్రంలోని నరేంద్ర మోడీసర్కారు మాత్రం మౌనంగా ఉంది.
ఏంటా బిల్లు..
తాజాగా శుక్రవారం.. అమెరికా అధ్యక్షుడు.. ట్రంప్-లిండ్సే ఓ. గ్రాహం శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ 2026- బిల్లుపై సంతకం చేశారు. దీనిని అమెరికా ప్రతినిధుల సభ(అధికార పక్షం) 159 ఓట్లతో ఆమోదించింది. అనంతరం.. వైట్ హౌస్‌కు చేరిన ఈ బిల్లుపై తాజాగా ట్రంప్ సంతకం చేశారు. ఇది.. రష్యా వాణిజ్య కార్యకలాపాలపై భారీ ఆంక్షలు తీసుకురానుంది. అదేవిధంగా వ్యూహాత్మకంగా కూడా ఆ దేశాన్ని ఒంటరిని చేయాలన్నది అమెరికా ఉద్దేశం.
ఎందుకు తెచ్చారు..?
రష్యాపై కఠిన ఆంక్షలు విధించేందుకు అమెరికా బిల్లు ఎందుకు తీసుకువచ్చిందన్నది ప్రశ్న. దీనికి ఒక్కటే కారణం.. ఇరాన్‌పై తాము జరుపుతున్న యుద్ధానికి ఉక్రెయిన్ మద్దతు ప్రకటించింది. దీంతో ఉక్రెయిన్‌ను ఇబ్బంది పెడుతున్న రష్యాను ఉక్కిరి బిక్కిరి చేసేందుకు తాజాగా అమెరికా బిల్లు తెచ్చింది. అంటే.. కార్యాకారణ సంబంధం దీనిలో కనిపిస్తోంది. ఉక్రెయిన్‌పై రష్యా జరుపుతున్న యుద్ధానికి అవసరమైన ఆర్థిక వనరులను, రాబడులను దెబ్బతీయడం, రష్యా ఇంధన విక్రయాల ద్వారా వచ్చే ఆదాయాన్ని నిలిపివేయడమే ప్రధాన లక్ష్యంగా అమెరికా ఈ ఆంక్షల బిల్లును తీసుకొచ్చింది
ఏం జరుగుతుంది?
అమెరికా తెచ్చిన బిల్లు ఆమోదం పొందడం, అధ్యక్షుడు సంతకం కూడా చేయడంతో ఈ బిల్లు అధికారికంగా అమల్లోకి వచ్చినట్టు అయింది. దీంతో రష్యా ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా ఉన్న ఇంధన రంగం భారీ దెబ్బతిననుంది. అంతేకాదు.. అమెరికా ఇప్పటికే విధించిన ఆంక్షల నుంచి తప్పించుకోవడానికి రష్యా వాడుతున్న "షాడో ఫ్లీట్" (రహస్య రవాణా నౌకలు) పై ఈ బిల్లు ప్రత్యేకంగా ఆంక్షలు విధిస్తుంది. తద్వారా ఉక్రెయిన్‌పై చేస్తున్న యుద్ధంలో రష్యాకు ఆర్థిక వనరులు నిలిచిపోతాయని అమెరికా భావిస్తోంది.
భారత్‌పై ప్రభావం ఎందుకు?
ఇక, రష్యాపై అమెరికా ఆంక్షలు విధిస్తే.. భారత్‌పై ప్రభావం ఎందుకు పడుతుందన్నది ప్రశ్న. దీనికి సమాధానం.. రష్యా నుంచి చౌకగా..(ఇతర ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే) భారత్ ఇంధనాన్ని కొనుగోలు చేస్తోంది. తాజా బిల్లుతో ఇలా చమురును కొనుగోలు చేసేందుకు భారత్ ప్రయత్నించరాదు. ఒకవేళ అమెరికా ఆంక్షలను పట్టించుకోకుండా.. భారత్ రష్యానుంచి చమురునుకొనుగోలు చేయాలని భావిస్తే.. భారత్‌పై అమెరికా 100 శాతం సుంకాలను విధించేందుకు రెడీ అవుతుంది. దీంతో భారత వ్యాపార, వాణిజ్య పరిశ్రమలు తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోయి.. భారత ఆర్థిక వ్యవస్థే ఇబ్బందిపడే పరిస్థితి తలెత్తుతుంది.
