Begin typing your search above and press return to search.

ట్రంప్ అణు జలాంతర్గాముల బెదిరింపులకు రష్యా షాకింగ్ రియాక్షన్!

ఆయుధాలతో బెదిరించడం, సుంకాలతో కొట్టడం.. రెండోసారి అధ్యక్షుడైన తర్వాత డొనాల్డ్ ట్రంప్ కు ఇవి నిత్యకృత్యంగా మారిపోయాయి.

By:  Raja Ch   |   2 Aug 2025 10:43 AM IST
ట్రంప్  అణు జలాంతర్గాముల బెదిరింపులకు రష్యా షాకింగ్  రియాక్షన్!
X

ఆయుధాలతో బెదిరించడం, సుంకాలతో కొట్టడం.. రెండోసారి అధ్యక్షుడైన తర్వాత డొనాల్డ్ ట్రంప్ కు ఇవి నిత్యకృత్యంగా మారిపోయాయి. ఇటీవల తన మాట వినలేదని రష్యా అణు కేంద్రాలపై చావు దెబ్బ కొట్టి, ఆ తర్వాత శాంతి పలుకులు పలికారు. ఈ నేపథ్యంలో రష్యాపై పీకల లోతు వరకూ పగ పెంచుకున్నట్లు ఉన్న ప్రెసిడెంట్ ట్రంప్... తాజాగా అణు జలంతర్గాముల బెదిరింపులకు దిగారు. దీనికి రష్యా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.

అవును... రష్యాకు చేరువలోని సముద్ర జలాల్లో రెండు అణు జలాంతర్గాములను మోహరించాలని తమ నౌకాదళాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఆదేశించారు. ఈ విషయాన్ని ట్రూత్ సోషల్ వేదికగా ప్రకటించారు. ఇందులో భాగంగా... ఒకవేళ ఆ రెచ్చగొట్టే వ్యాఖ్యల వెనుక ఏదైనా ఉద్దేశాలు ఉంటే వాటికి సన్నద్ధమయ్యేందుకు ఇలా చేశా.. మాటలు ముఖ్యం.. వాటివల్ల కొన్నిసార్లు తీవ్ర పరిణామాలు తలెత్తవచ్చు.. ప్రస్తుతం ఇలాంటివి జరగవని ఆశిస్తున్నట్లు తెలిపారు.

రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రీ మెద్వదేవ్‌ చేస్తున్న హెచ్చరికలకు ప్రతిస్పందనగా ఈ చర్యను చేపట్టినట్లు తెలిపారు. ఉక్రెయిన్‌ అంశంలో కాల్పుల విరమణకు 10 రోజుల్లో ముందుకు రావాలని ట్రంప్‌.. రష్యాకు హెచ్చరిక చేసిన నేపథ్యంలో మెద్వదేవ్‌ స్పందించారు. రష్యా వద్ద సోవియట్‌ హయాం నాటి అణు దాడి సామర్థ్యం ఉందని స్పష్టం చేశారు. దీంతో.. ఈ పనికి పూనుకున్నారు.. ఈ విషయాన్ని ట్రూత్ వేదికగా వెల్లడించారు.

రష్యా నుంచి స్ట్రాంగ్ కౌంటర్!:

సముద్ర జలాల్లో రెండు అణు జలాంతర్గాములను అమెరికా మోహరించిన విషయంపై తాజాగా రష్యా పార్లమెంటు సభ్యుడు విక్టర్‌ వోడోలాట్‌ స్కీ స్పందించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... తమ వద్ద కూడా తగినన్ని అణు జలాంతర్గాములు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో... మహాసముద్రాల్లో యూఎస్ జలాంతర్గాముల సంఖ్య కంటే తమవి చాలా ఎక్కువని తెలిపారు.

అదేవిధంగా... అమెరికా మోహరించినవి తమ జలాంతర్గాముల నియంత్రణలో ఉన్నాయని చెప్పిన విక్టర్... అందువల్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటనలకు పెద్దగా ప్రతిస్పందించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఇదే విషయంపై స్పందించిన గ్లోబల్ అఫైర్స్ మ్యాగజైన్ రష్యా ఎడిటర్ ఇన్ చీఫ్ ఫ్యోడర్ లుక్యానోవ్... అమెరికా అధ్యక్షుడి హెచ్చరికలను తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం లేదని అన్నారు.