ట్రంప్ ను కలిసింది పుతిన్ కాదా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అలాస్కాలో జరిగిన భేటీపై ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
By: A.N.Kumar | 16 Aug 2025 11:36 PM ISTఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అలాస్కాలో జరిగిన భేటీపై ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ సమావేశం అంతర్జాతీయంగా కీలకమని విశ్లేషకులు చెబుతున్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం మరో ఆసక్తికరమైన వాదన ఊపందుకుంది.
కొంతమంది నెటిజన్లు, ట్రంప్‌ను కలిసింది నిజమైన పుతిన్ కాదని, ఆయన స్థానంలో డుప్లికేట్ వచ్చారని పోస్టులు పెడుతున్నారు. ట్రంప్‌తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న పుతిన్ హావభావాలు సాధారణంగా కనిపించలేదని, ఆయన శరీర భాషలో ఏదో విభిన్నత ఉందని వారు అంటున్నారు. ముఖ్యంగా స్టిఫ్‌గా నిలబడటం కష్టంగా అనిపించడం, ముఖ కవళికల్లో అసహజమైన మార్పులు కనిపించడం వంటివి ఈ అనుమానాలకు కారణమవుతున్నాయని వివరిస్తున్నారు.
ఇక నెట్టింట పలు వీడియోలు, ఫోటోలు షేర్ అవుతూ “ఇది నిజమైన పుతిన్ కాదు” అంటూ వివిధ రకాల విశ్లేషణలు చేస్తున్నారు. కొందరు అయితే, గతంలోనూ పుతిన్ బాడీ డబుల్‌లను ఉపయోగించాడనే వాదనను ప్రస్తావిస్తున్నారు. రష్యాలో పుతిన్ ఆరోగ్యం, వయసు, భద్రత అంశాల కారణంగా ఇలాంటి ప్రత్యామ్నాయాలను వినియోగిస్తారని గతంలో వచ్చిన వార్తలను గుర్తుచేస్తున్నారు.
అయితే అధికారిక వర్గాలు మాత్రం ఈ ఊహాగానాలపై ఎలాంటి స్పందన ఇవ్వలేదు. ట్రంప్ – పుతిన్ భేటీ అంతర్జాతీయ సంబంధాల దృష్ట్యా ఎంత ముఖ్యమో దానిపై మాత్రమే దృష్టి పెట్టారు. కానీ సోషల్ మీడియా వేదికల్లో మాత్రం పుతిన్ నిజంగానే వచ్చారా? లేక బాడీ డబుల్ వచ్చారా? అన్న చర్చ ఇంకా హాట్ టాపిక్‌గా మారింది.
మొత్తానికి, ట్రంప్ – పుతిన్ సమావేశం కంటే, ఆ సమావేశంలో పాల్గొన్నది నిజమైన పుతినేనా అన్న సందేహమే ఇప్పుడు ఎక్కువ హడావిడి సృష్టిస్తోంది.
