ట్రంప్ ఎఫెక్ట్: అమెరికాకు 61 వేల కోట్ల నష్టం!
తాజాగా అమెరికా విద్యా రంగంపై కూడా ట్రంప్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. ఆయన తీసుకున్న వలస విధానం, వీసా విధానంలో తెచ్చిన మార్పులు.. అమెరికా విద్యారంగాన్ని కుదేలయ్యేలా చేస్తున్నాయి.
By: Garuda Media | 22 Aug 2025 12:00 PM ISTఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు.. వేస్తున్న అడుగులు ఆ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం ఏమో కానీ.. రోజ రోజుకు తిరోగమనంలోకి నెడుతున్నాయని అమెరికన్లు వాపోతున్నారు. ఇటీవల వివిధ దేశాలపై సంకాలు బాదేశారు. దీంతో స్థానికంగా అన్ని నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశానికి అంటుతున్నాయి. సామాన్య అమెరికన్లు.. నెలసరి జీతాలపై జీవించేవారు.. ఈ ధరలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. అయినా.. ట్రంప్ మాత్రం తను పట్టుకున్న కుందేలుకు మూడు కాళ్లేనని వాదిస్తున్నారు.
తాజాగా అమెరికా విద్యా రంగంపై కూడా ట్రంప్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. ఆయన తీసుకున్న వలస విధానం, వీసా విధానంలో తెచ్చిన మార్పులు.. అమెరికా విద్యారంగాన్ని కుదేలయ్యేలా చేస్తున్నాయి. తాజా అంచనా ప్రకారం.. ట్రంప్ నిర్ణయం కారణంగా.. రూ.61, 21,88,500,000(సుమారు 61 వేల కోట్లు-7 బిలియన్ డాలర్లు) నష్టం చవిచూడాల్సి వస్తోందని.. విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. `మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్` నినాదం పఠిస్తున్న ట్రంప్.. అన్ని అవకాశాలు స్థానిక అమెరికన్లకే దక్కాలని పట్టుదలతో ఉన్నారు.
ఈ క్రమంలో విదేశీ విద్యను చదువుకునేందుకు అమెరికాకు వచ్చే విద్యార్థులపై అనేక ఆంక్షలు విధించారు. దీనిలో వీసా, వలస విధానాలను మరింత కఠినతరం చేశారు. ఫలితంగా విదేశీ విద్యార్థులపై ఏదో ఒక కారణం చూపించి.. కట్టడి చేస్తున్నారు. ఈ ఏడాది 6 వేల మంది విద్యార్థులను తిరస్కరించారు. వీరిపై ఉగ్ర సంబంధాలు, ఉగ్రవాద సానుభూతి పరుల ముద్ర వేయడం మరింత వివాదంగా మారింది.
ఇక, ఈ ఏడాది కేవలం 76 వేల మంది విద్యార్థులు మాత్రమే విదేశాల నుంచి వచ్చి అమెరికాలో చదువుకునేందుకు సిద్ధమయ్యారు. కానీ, గత ఏడాదితో పోలిస్తే.. ఈ సంఖ్య 28 శాతం తక్కువగా ఉండడం గమనార్హం. ఇక, భారత విద్యార్థుల విషయానికి వస్తే.. 332000 మంది విద్యార్థులు అమెరికాలో చదువుకునేందుకు దరఖాస్తులు చేసుకోగా.. వీరు.. ట్రంప్ నిర్ణయంతో 46 శాతం మంది వెనక్కి తగ్గారు. ఇక, చైనాకుచెందిన వారు .. కూడా 26 శాతం మంది ఆగిపోయారు.
వాస్తవానికి అమెరికాకు విద్యారంగంలో వస్తున్న ఆదాయాన్ని చూస్తే.. భారత్, చైనాలే అతి పెద్ద దేశారు. కానీ, ట్రంప్ నిర్ణయంతో విద్యార్థులు వెనక్కి వెళ్లిపోతున్నారు. ఇలా.. వరుసగా ఇది నాలుగోసారి అని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. దేశానికి కూడా 7 బిలియన్ డాలర్ల ఆర్థిక నష్టం వస్తోందని అంటున్నారు. ఇక, ట్యూషన్ ఫీజులు రూపంలో స్థానిక పాఠశాలలు కూడా 30 శాతం మేరకు ఆదాయాన్ని కోల్పోతున్నాయి.
