'భవిష్యత్తులో భారత్ కు పాక్ చమురు'... ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!
ఈ నేపథ్యంలోనే భవిష్యత్తులో భారత్ కు పాకిస్థాన్ చమురు విక్రయించొచ్చని వ్యాఖ్యానించారు. దీని వెనుకున్న కథ ఇప్పుడు చూద్దామ్...!
By: Raja Ch | 31 July 2025 11:27 AM ISTఇటు మిత్రదేశం మిత్రదేశం అంటూ భారత్ కు స్ట్రోక్స్ ఇస్తూ.. అటు పాక్ కు మాత్రం ఐ లవ్ యూ అని చెబుతూ తనదైన రాజకీయం చేస్తోన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా పాకిస్థాన్ తో వాణిజ్య ఒప్పందం కుదిరినట్లు ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు.. ఈ సందర్భంగా భవిష్యత్తులో భారత్ కు పాకిస్థాన్ చమురు విక్రయించవచ్చని వ్యాఖ్యానించారు.
అవును... మోడీ నాకు మంచి మిత్రుడు, భారత్ తమకు మంచి మిత్ర దేశం అని చెబుతూ... భారత దిగుమతులపై 25శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించిన ట్రంప్... ఆ ప్రకటన చేసిన కొన్ని గంటల్లోనే.. పాకిస్థాన్ తో వాణిజ్య ఒప్పందం కుదిరినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే భవిష్యత్తులో భారత్ కు పాకిస్థాన్ చమురు విక్రయించొచ్చని వ్యాఖ్యానించారు. దీని వెనుకున్న కథ ఇప్పుడు చూద్దామ్...!
తాజాగా ట్రూత్ సోషల్ లో ట్రంప్ ఓ పోస్టు పెట్టారు. ఇందులో భాగంగా... అమెరికా, పాకిస్థాన్ మధ్య ఒక వాణిజ్య ఒప్పందం కుదిరిందని తెలిపారు. ఈ ఒప్పందం ప్రకారం... ఇరుదేశాలు చమురు నిల్వలను పెంచుకోవడంలో కలిసి పనిచేస్తాయని.. దీనికోసం ఒక మంచి చమురు కంపెనీని ఎంచుకునే ప్రక్రియలో ఉన్నామని తెలిపారు.
ఈ నేపథ్యంలోనే... ఈ ఒప్పందం కారణంగా భవిష్యత్తులో భారత్ కు పాకిస్థాన్ చమురు విక్రయించొచ్చని వ్యాఖ్యానించారు. దీంతో... ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో... భారత్ విషయంలో ట్రంప్ ఆలోచనలు ఏమిటి అనే చర్చ తెరపైకి వచ్చిందని అంటున్నారు.
మరోవైపు... టారిఫ్ లు ప్రకటించిన తర్వాత మీడియాతో మాట్లాడిన ట్రంప్.. భారత్ పై 25శాతం సుంకాలు విధించడంపై స్పందించారు. ఈ సందర్భంగా... సుంకాలపై భారత్ తో ఇంకా చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. ఇదే క్రమంలో బ్రిక్స్ ను ప్రస్తాస్తూ.. యూఎస్ కు వ్యతిరేకంగా డాలర్ ను అణగదొక్కాలని బ్రిక్స్ దేశాలు చూస్తున్నాయని.. భారత్ కూడా ఆ కూటమిలో భాగమేనని అన్నారు.
ఈ నేపథ్యంలోనే... భారత ప్రధాని మోడీ తనకు మంచి స్నేహితుడని ఉద్ఘాటించిన ట్రంప్.. అమెరికా వస్తువులపై భారత్ ఎక్కువ సుంకాలు విధిస్తుందని.. ఈ సందర్భంగా అది మిత్ర దేశమైనప్పటికీ 25శాతం సుంకం తాము విధిస్తున్నట్లు ప్రకటించారు. ఇది ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తుందని చెబుతూ... దీనికి అదనంగా పెనాల్టీలు కూడా ఉంటాయని అన్నారు.
