ఫోన్ చేయ్ నెతన్యాహూ..ఖతర్ కు సారీ చెప్పు.. పీకపై ట్రంప్ కత్తి
నెతన్యాహూ చాలా అంశాల్లో అత్యుత్సాహం చూపుతారని, అది చివరకు తీవ్ర స్థాయి పరిణామాలకు దారితీస్తుందని చరిత్ర చెబుతోంది.
By: Tupaki Political Desk | 2 Oct 2025 9:25 AM ISTఇజ్రాయెల్ ప్రధాని బెంజామిన్ నెతన్యాహూ కరుడుగట్టిన యుద్ధ కాంక్ష ఉన్న నాయకుడు అని విమర్శకులు పేర్కొంటారు. కాదు.. ఆయన ఇజ్రాయెల్ కోసం ఎంతకైనా తెగిస్తారు అని సపోర్ట్ చేసే వారు వ్యాఖ్యానిస్తారు. హమాస్ అంశం లేకుంటే ఆయనకు రాజకీయ భవిష్యత్ లేదని, అందుకే యుద్ధాన్ని ఆపరని మరికొందరు విశ్లేషిస్తుంటారు. ఇలాంటి సమయంలో ఆయనను ఆపేది ఎవరు? అంటే అమెరికానే. అందులోనూ ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రమే అని కచ్చితంగా చెప్పొచ్చు.
హమాస్ అంతం సరే.. ఎందుకిత అత్యుత్సాహం...?
నెతన్యాహూ చాలా అంశాల్లో అత్యుత్సాహం చూపుతారని, అది చివరకు తీవ్ర స్థాయి పరిణామాలకు దారితీస్తుందని చరిత్ర చెబుతోంది. సరే.. ఇజ్రాయెల్ ప్రయోజనాలే ఆయనకు ముఖ్యం కాబట్టి 2023 అక్టోబరు 7 నుంంచి హమాస్ తో సాగిస్తున్న యుద్ధంలో ఎవరూ ఏమీ అనలేరు. అయితే, ఇటీవల ఖతర్ పై హమాస్ నేతలను టార్గెట్ చేస్తూ ఇజ్రాయెల్ చేసిన దాడి మాత్రం తీవ్ర వివాదాస్పదం అయింది. ఖతర్ అమెరికాకు చాలా మంచి ఫ్రెండ్. హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం ముగింపునకు కూడా ఆ దేశం కీలక పాత్ర పోసిస్తోంది. అందులోభాగంగానే ఖతర్ రాజధాని దోహాలో ఆ దేశ అధికారులు, హమాస్ నేతలు సమావేశం అయ్యారు. అలాంటి సమయంలో ఇజ్రాయెల్ దాడి చేసి నిప్పు రవ్వ రాజేసింది. ఇది ట్రంప్ నకు తీవ్ర కోపం తెప్పించింది. ఖతర్ పై ఎలాంటి చర్య తీసుకునేటప్పుడు అయినా తమకు చెప్పాలని ఆయన మండిపడ్డారు.
క్షమాపణ చెప్పాలని.. తొడపై ఫోన్ పట్టుకుని
నెతన్యాహూ తాజాగా అమెరికా వెళ్లారు. హమాస్ తో యుద్ధం గురించి ట్రంప్ తో చర్చించారు. అంతేకాదు.. ఖతర్ కు సారీ చెప్పారు. యుద్ధాన్ని ముగించాలని భావిస్తున్నట్లు కూడా ప్రకటించారు. గాజాను ఆక్రమించుకోబోమన్నారు. కాగా, ట్రంప్, నెతన్యాహూ సమావేశానికి సంబంధించి అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ ఫొటో విడుదల చేసింది. అది బ్లాక్ అండ్ వైట్ లో ఉంది. ఖతర్ ప్రధాని అబ్దుల్ రహ్మాన్ బిన్ జస్సిమ్ అల్ థానికీ నెతన్యాహూ ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. పశ్చిమాసియాలో శాంతిని కోరుకుంటున్నట్లు తెలిపిన ఆయన... దోహా దాడికి సారీ చెప్పారు. అయితే, ఈ ఫోన్ చేస్తున్న సమయంలో ఆయన ఎదురుగా కూర్చున్న ట్రంప్ చేతిలో స్క్రిప్ట్ ఉంది. ఫోన్ డయల్ పాడ్ ఒడిలో పెట్టుకున్నారు. తాను స్క్రిప్ట్ చదువుతూ.. నెతన్యాహూతో ఖతర్ కు క్షమాపణ చెప్పించినట్లు స్పష్టం అవుతోంది.
