Begin typing your search above and press return to search.

ట్రంప్ కు నోబెల్ ‘శాంతి’ దక్కకపాయే.. మనశ్శాంతి కరువాయే.. ట్రోల్స్

2025 నోబెల్ శాంతి బహుమతి ప్రకటించబడింది, కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దీన్ని గెలుచుకోలేకపోయారు.

By:  A.N.Kumar   |   10 Oct 2025 6:06 PM IST
ట్రంప్ కు నోబెల్ ‘శాంతి’ దక్కకపాయే.. మనశ్శాంతి కరువాయే.. ట్రోల్స్
X

2025 నోబెల్ శాంతి బహుమతి ప్రకటించబడింది, కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దీన్ని గెలుచుకోలేకపోయారు. దీంతో ఆయన నిట్టూర్పు గురించి, 'ఇంకా నేను ఎన్ని యుద్ధాలు ఆపాలి' అంటూ బాధపడుతున్నారని నెటిజన్లు ఫన్నీగా ట్రోల్ చేస్తున్నారు. నోబెల్ బహుమతిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ట్రంప్‌కు నిరాశ ఎదురుకావడంతో, ఈ పరిణామం వెంటనే సోషల్ మీడియా, ముఖ్యంగా ఎక్స్ లో, ఫన్నీ మీమ్స్‌తో రణరంగంగా మారింది.

-నోబెల్ దక్కిన 'వెనిజుయెలా ఐరన్ లేడీ'

ఈ సంవత్సరంలో బహుమతి వెనిజుయెలా ప్రధాన ప్రతిపక్ష నేత మారియా కొరినా మాచాడోకు లభించింది. ప్రజాస్వామ్య హక్కులను ప్రోత్సహించడంలో తన ప్రయత్నం కోసం ఆమెకు ఈ గౌరవం దక్కింది. 'వెనిజుయెలా ఐరన్ లేడీ'గా పేరుగాంచిన మాచాడో, 2025లో టైమ్ మాగజైన్ 'The 100 Most Influential People' జాబితాలో కూడా చోటు సంపాదించారు.

- ట్రంప్ 'నిరాశ' వైరల్

బహుమతి ప్రకటన కంటే ముందే ట్రంప్ తనకు నోబెల్ రావాలని బలంగా ఆశించారు. ఇజ్రాయెల్–హమాస్ మధ్య విరామం, ఆర్మీనియా–అజర్బైజాన్, ఇండియా–పాకిస్తాన్ సహా అనేక అంతర్జాతీయ ఘర్షణలను మధ్యవర్తిత్వం చేశానని, తాను మౌలికమైన శాంతి యత్నాలలో పాలుపంచుకున్నట్లు ప్రచారం చేసుకున్నారు.

అయితే, నిపుణులు , రాజకీయ విశ్లేషకులు ఆయన వాదనల నిజసత్యాన్ని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో నోబెల్ దక్కకపోవడంతో, ట్రంప్ నిరాశను వ్యక్తపరిచేలా ఉన్న ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియా యూజర్లు వేగంగా పంచుకున్నారు. ఆయన 'ఇంకా నేను ఏం చేయాలి' అంటూ బాధపడుతున్నారేమోనని, 'మనశ్శాంతి కరువైందే' అంటూ ఫన్నీ క్యాప్షన్లతో మీమ్స్ సృష్టించి 'ఇంటర్నెట్ గోల్డ్' సృష్టించారు.

- వచ్చే ఏడాది కోసం ఏం చేస్తారు?

తనకు ప్రైజ్ రాదని బయటకు ఎంత చెప్పుకున్నా లోలోపల ఉన్న చిన్న ఆశ నేటితో సమాధి అయింది. దీంతో ట్రంప్ వచ్చే ఏడాది నోబెల్ దక్కించుకోవడానికి ఏం చేస్తారోనని నెట్టింట చర్చ జరుగుతోంది. ట్రంప్ నిరాశ, ఆయన్ను ట్రోల్ చేస్తున్న మీమ్స్... 2025 నోబెల్ ప్రకటనను మరింత చక్కగా ట్రెండింగ్‌లోకి మార్చాయని చెప్పవచ్చు.